Dear Uma: హీరోయిన్‌ని సర్‌ప్రైజ్ చేసిన ‘డియర్ ఉమ’ టీమ్..

ABN , Publish Date - May 18 , 2024 | 05:07 PM

ఓ తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా అవకాశం దక్కించుకోవడమే నేడు గొప్ప విషయం. అలాంటిది సుమయా రెడ్డి అనే తెలుగు అమ్మాయి ‘డియర్ ఉమ’ అంటూ మొదటి సినిమాతోనే నిర్మాతగా మారడం, కథను అందించడం, హీరోయిన్‌గా నటించడం అంటే మామూలు విషయం కానే కాదు. ఇలా అన్నీ తానై ఓ లేడీ బాస్‌గా సినిమాను నడిపిస్తోంది సుమయా రెడ్డి. మే 18ని ఆమె బర్త్‌డే పురస్కరించుకుని మూవీ యూనిట్ సుమయాని సర్‌ప్రైజ్ చేసింది.

Dear Uma: హీరోయిన్‌ని సర్‌ప్రైజ్ చేసిన ‘డియర్ ఉమ’ టీమ్..
Heroine Sumaya Reddy

ఓ తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా అవకాశం దక్కించుకోవడమే నేడు గొప్ప విషయం. అలాంటిది సుమయా రెడ్డి (Sumaya Reddy) అనే తెలుగు అమ్మాయి ‘డియర్ ఉమ’ (Dear Uma) అంటూ మొదటి సినిమాతోనే నిర్మాతగా మారడం, కథను అందించడం, హీరోయిన్‌గా నటించడం అంటే మామూలు విషయం కానే కాదు. ఇలా అన్నీ తానై ఓ లేడీ బాస్‌గా సినిమాను ముందుకు నడిపిస్తోంది సుమయా రెడ్డి. శనివారం సుమయా రెడ్డి పుట్టిన రోజు (మే 18). ఈ సందర్భంగా ‘డియర్ ఉమ’ చిత్రయూనిట్ ఆమెను సర్‌ప్రైజ్ చేస్తూ.. ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ (Happy Birthday Sumaya Reddy) తెలిపారు. అన్నీ తానై నడిపిస్తున్న తమ లేడీ బాస్‌కు చిత్రయూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ‘డియర్ ఉమ’ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి (Dear Uma Update). త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. (Sumaya Reddy Birthday Special)

*Chitrangada Singh: ఆమె వయసు 48, కానీ ఆమెని చూస్తే అబ్బ...


Dear-Uma.jpg

‘డియర్ ఉమ’ విషయానికి వస్తే.. సుమయా రెడ్డి, పృథ్వీ అంబర్ (Pruthvi Amber) హీరోహీరోయిన్లుగా సుమ చిత్ర ఆర్ట్స్ (Suma Chitra Arts) బ్యానర్ మీద సుమయా రెడ్డి నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రానికి సాయి రాజేష్ మహాదేవ్ (Sai Rajesh Mahadev) దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, నవ్వుతుంటనే లిరికల్ వీడియో సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుని.. సినిమాపై అంచనాలను పెంచేశాయి. అందమైన ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. అలాగే ఓ తెలుగమ్మాయ్ తనలోని మల్టీ టాలెంట్‌ను ప్రదర్శిస్తూ.. డేరింగ్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుండటం విశేషం.

Read Latest Cinema News

Updated Date - May 18 , 2024 | 06:14 PM