Dear Uma Teaser: అమ్మాయిలు ఇచ్చే షాక్‌లకు.. మెడిసిన్ ఇదే..

ABN , Publish Date - Feb 14 , 2024 | 08:51 PM

సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘డియర్ ఉమ’. ఇందులో సుమయ రెడ్డి, దియా మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా.. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తోన్న ఈ చిత్ర టీజర్‌ని వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేశారు.

Dear Uma Teaser: అమ్మాయిలు ఇచ్చే షాక్‌లకు.. మెడిసిన్ ఇదే..
Dear Uma Movie Still

ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం.. అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం.. దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా ఇప్పుడు సుమయ రెడ్డి (Sumaya Reddy) తన బహుముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకోబోతోంది. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘డియర్ ఉమ’. ఇందులో సుమయ రెడ్డి, దియా మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా.. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తోన్న ఈ చిత్ర టీజర్‌ని వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేశారు. (Dear Uma Teaser Out)

ఇక ఈ టీజర్ చూస్తుంటే ఇదొక ప్రేమ కావ్యంలా అనిపిస్తుంది. ప్రేమ ఇచ్చే సంతోషాన్ని, బాధను ఓ దృశ్యకావ్యంగా మలిచినట్టు అనిపిస్తుంది. ‘నా కణాల్లో జీవం నీ కళ్లు.. నా నరాల్లో ప్రవాహాం నీ చూపు’, ‘ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన నిర్వచనం’, ‘అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉండదు.. అమ్మాయిల స్వార్థంలోనే ప్రేమ ఉంటుంది.. అమ్మాయిలు ఇచ్చే షాక్‌లకు.. అబ్బాయిలకు ఇదే సరైన మెడిసిన్’ అనే డైలాగ్స్ సినిమాలోని డెప్త్‌ను తెలియజేస్తున్నాయి. అందమైన ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా ఉండబోతుందని ఈ టీజర్‌తో తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Dear-Uma-Teaser.jpg

రాజ్ తోట కెమెరామెన్‌గా, రధన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Ramam Raghavam: ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఎమోషనల్ గ్లింప్స్.. సుకుమార్ ఏమన్నారంటే?

***********************

*Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..

*************************

*Sonia Agarwal: నా మాజీ భర్తతో మళ్లీ చేసేందుకు రెడీ..

***************************

Updated Date - Feb 14 , 2024 | 08:51 PM