Dear Uma: ‘డియర్ ఉమ’గా సుమయ రెడ్డి సిద్ధమవుతోంది..

ABN , Publish Date - Jan 16 , 2024 | 01:34 PM

ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం.. అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం.. దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా మల్టీ టాలెంట్‌తో సుమయ రెడ్డి అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సుమయ రెడ్డి, ‘దియ’ మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ’. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్నట్లుగా మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు.

Dear Uma: ‘డియర్ ఉమ’గా సుమయ రెడ్డి సిద్ధమవుతోంది..
Sumaya Reddy

ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం.. అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం.. దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా మల్టీ టాలెంట్‌తో సుమయ రెడ్డి (Sumaya Reddy) అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సుమయ రెడ్డి, ‘దియ’ మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ’ (Dear Uma). ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తూ.. కథను కూడా అందించారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివల్‌ను పురస్కరించుకుని తాజాగా ఈ చిత్ర అప్‌డేట్‌ను మేకర్స్ తెలియజేశారు.


Sumaya.jpg

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోందని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ వెల్లడించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చక్కని సందేశాన్ని ఇందులో ఇవ్వబోతున్నట్లుగానూ.. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. అలాగే టీజర్ విడుదల తర్వాత ఈ సినిమా స్థాయి ఏంటనేది అందరికీ తెలుస్తుందని.. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లోకి తీసుకువస్తామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. (Dear Uma Update)

కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి రాజ్ తోట కెమెరామెన్‌గా, రధన్ సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Naa Saami Ranga: మొదటి రోజు కంటే రెండో రోజు కిష్టయ్య కుమ్మేశాడు..

**********************

*Mahesh Babu: ‘గుంటూరు కారం’ టీమ్‌కి మహేష్ గ్రాండ్ పార్టీ.. ఫొటోలు వైరల్

************************

*Anasuya: సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో.. అనసూయ చర్యలు ఊహాతీతం

**************************

*K Raghavendra Rao: ‘హనుమాన్’, ‘నా సామిరంగ’ సక్సెస్‌లపై దర్శకేంద్రుడి స్పందన ఇదే..

****************************

Updated Date - Jan 16 , 2024 | 01:34 PM