Anup Rubens: అనూప్ రూబెన్స్ ‘మనం’ స్పెషల్ మ్యూజికల్ వీడియో వైరల్

ABN , Publish Date - May 23 , 2024 | 03:47 PM

‘జై, ప్రేమ కావాలి, మనం’ వంటి క్లాసిక్ హిట్స్‌తో మ్యూజిక్ డైరెక్టర్‌గా అనూప్ రూబెన్స్ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రేమ పాటలకు అనూప్ పెట్టింది పేరు. ‘ఇష్క్, టెంపర్, సోగ్గాడే చిన్ని నాయనా’ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన లిస్ట్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్స్ ఉంటాయి. తాజాగా ఆయన సంగీతం అందించిన ‘మనం’ చిత్రం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ స్పెషల్ మ్యూజిక్ వీడియోను అనూప్ విడుదల చేశారు.

Anup Rubens: అనూప్ రూబెన్స్ ‘మనం’ స్పెషల్ మ్యూజికల్ వీడియో వైరల్
Music Director Anup Rubens

‘జై, ప్రేమ కావాలి, మనం’ వంటి క్లాసిక్ హిట్స్‌తో మ్యూజిక్ డైరెక్టర్‌గా అనూప్ రూబెన్స్ (Anup Rubens) ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రేమ పాటలకు అనూప్ పెట్టింది పేరు. ‘ఇష్క్, టెంపర్, సోగ్గాడే చిన్ని నాయనా’ ఇలా చెప్పుకుంటూ పోతే అనూప్ రూబెన్స్ లిస్ట్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో అనూప్ ఆల్బమ్స్ తగ్గాయి కానీ.. ప్రస్తుతం మరోసారి అనూప్ రూబెన్స్ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన లైవ్‌లో కీ బోర్డు‌పై ప్లే చేసిన ‘మనం’ (Manam) మ్యూజికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. అనూప్ మరోసారి వార్తలలో నిలుస్తున్నారు. (Anup Rubens Manam Special Musical Video)

*Disaster Show: బుజ్జీ! ఎంతపనైపోయింది, టోటల్ ఫ్లాప్ కదా!


మామూలుగా సినిమా సక్సెస్‌‌లో మ్యూజిక్‌కు ఉండే ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ప్రేమ కావాలి, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, టెంపర్, మనం, గోపాల గోపాల, సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, నేనే రాజు నేనేమంత్రి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, హార్ట్ ఎటాక్’ ఇలా ప్రతీ సినిమాలో అనూప్ రూబెన్స్ సంగీతం ఎంతో ప్రధానంగా నిలిచింది. ఆయన మెలోడీ పాటలకు ఎంతో ఫేమస్. అనూప్ ఇచ్చిన లవ్, ఎమోషనల్, మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఎవర్ గ్రీన్ ‘మనం’ (10 Years To Manam) మూవీ వచ్చి పదేళ్లు అయింది. ఈ క్రమంలో సినిమాను రీ రిలీజ్ (Manam Re Release) కూడా చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ పాటలకు థియేటర్లు మళ్లీ మోత మోగనున్నాయి. గురువారం ఈ మూవీని హైదరాబాద్‌‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవీ థియేటర్లో రీ రిలీజ్ చేస్తున్నారు. ‘మనం’ వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అనూప్ కీ బోర్డు‌పై వాయించిన ట్యూన్స్ మళ్లీ ఆ ట్రాన్స్‌లోకి తీసుకెళుతున్నాయి. 23 మే, 2014న విడుదలైన ‘మనం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్‌ మూవీగా నిలిచి.. ఆ సినిమాలో భాగమైన వారందరికీ ఎంతో గొప్పపేరును తెచ్చిపెట్టింది. (Celebrating Manam 10 Years)


Anup-Rubens-Pic.jpg

అనూప్ రూబెన్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja) తీస్తోన్న పాన్ ఇండియా మూవీకి, గౌరీ రోనంకి తీస్తోన్న చిత్రానికి, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న మరో ప్రాజెక్ట్‌కి ఆయన వర్క్ చేస్తున్నారు. ఇవే కాకుండా.. సుమంత్ హీరోగా సంతోష్ తెరకెక్కిస్తున్న సినిమాకు, ఆది సాయికుమార్‌ ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ సినిమాకు.. విజయ్ కొండా-ఆకాష్ పూరి కాంబో చిత్రానికి కూడా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. (Anup Rubens Future Projects)

Read Latest Cinema News

Updated Date - May 23 , 2024 | 03:48 PM