1134: నో బడ్జెట్‌తో ప్రయోగాత్మక చిత్రం.. క్లీన్ యూ‌తో రిలీజ్‌కు రెడీ..

ABN , Publish Date - Jan 02 , 2024 | 05:01 PM

ఇప్పుడొస్తున్న కొత్త దర్శకులు కాన్సెప్ట్ ఓరియెంటెడ్, డిఫరెంట్ టేకింగ్, మేకింగ్‌తో తమ టాలెంట్‌ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్పుడొ నూతన దర్శకుడు ‘1134’ అంటూ ఓ డిఫరెంట్ ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, జనవరి 5వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

1134: నో బడ్జెట్‌తో ప్రయోగాత్మక చిత్రం.. క్లీన్ యూ‌తో రిలీజ్‌కు రెడీ..
1134 Movie Title Logo

ఇప్పుడొస్తున్న కొత్త దర్శకులు కాన్సెప్ట్ ఓరియెంటెడ్, డిఫరెంట్ టేకింగ్, మేకింగ్‌తో తమ టాలెంట్‌ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి దర్శకుల నుండి వస్తున్న డిఫరెంట్ మూవీస్‌కు థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియెన్స్ సైతం రొటీన్ ఫార్మూలాను తెరపై చూసేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ఇప్పుడొ నూతన దర్శకుడు ‘1134’ అంటూ ఓ డిఫరెంట్ ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా సాగే ఈ సినిమాను నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి (Ssharadh Chandra Tadimeti) తెరకెక్కించారు. శాన్వీ మీడియా బ్యానర్‌పై రాబోతోన్న ఈ మూవీకి భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (1134 Movie Ready to Release)

రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుందని మేకర్స్ చెబుతున్నారు. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్‌‌ వంటి ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై మంచి అభిప్రాయాన్ని ఏర్పాటు చేశాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లుగా మేకర్స్ ప్రకటించారు. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చిందని.. సెన్సార్ సభ్యులు సైతం ఈ డిఫరెంట్ చిత్రానికి మంచి ప్రశంసలు అందించారని చెప్పుకొచ్చారు. జనవరి 5న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా వారు తెలిపారు. (1134 Movie Censor Completed)


Ssharadh-Chandra.jpg

రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా బ్యానర్‌‌లపై తెరకెక్కిన ఈ ‘1134’ చిత్రంలో కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందించారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా ప్రేక్షకులను సైతం మెప్పిస్తుందని చిత్ర బృందం చెబుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ దర్శకుడు వదిలిన సర్క్యులర్ చూశారా..

****************************

*SV Ranga Rao: ముత్యాల సుబ్బయ్యకు ముచ్చెటమలు పట్టించిన ఎస్వీఆర్.. విషయం ఏమిటంటే?

************************

*Guntur Kaaram: మాస్‌ బీట్‌‌ని.. నెటిజన్లు మడతెట్టేస్తున్నారు..

****************************

*Kotabommali PS in OTT: ‘కోటబొమ్మాళి PS’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*********************************

Updated Date - Jan 02 , 2024 | 07:25 PM