Latest Update on Samyuktha's Bollywood film: ఉత్తమ నటీనటులతో బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న సంయుక్త

ABN , Publish Date - May 24 , 2024 | 06:48 PM

తెలుగులో వరస విజయాలతో అగ్ర నటీమణుల్లో చేరిన సంయుక్త ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. నసీరుద్దీన్ షా, కాజోల్, ప్రభు దేవా లాంటి ఉత్తమ నటీనటులు నటిస్తున్న సినిమాలో సంయుక్త ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. తెలుగు నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ సినిమాకి దర్శకుడు. టీజర్ కూడా త్వరలోనే విడుదలవుతుంది అని చెపుతున్నారు.

Latest Update on Samyuktha's Bollywood film: ఉత్తమ నటీనటులతో బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న సంయుక్త
Samyuktha is all set to debut in HIndi with actors like Naseeruddin Shah, Kajol and Prabhu Deva

ఇప్పుడు బాలీవుడ్ లో దక్షిణాదివారిదే పైచేయిగా కనిపిస్తోంది. ఒక పక్క దక్షిణాదికి చెందిన దర్శకులతో పని చెయ్యాలని బాలీవుడ్ అగ్రనటులు ఆసక్తి చూపిస్తుంటే, ఇంకోపక్క దక్షిణాదికి చెందిన నటీమణులు కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టి విజయం సాధిస్తున్నారు. నయనతార, రష్మిక మందన్న లు షా రుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ ల సరసన నటించి విజయం సాధించి మంచి పేరు తెచ్చుకున్నారు. వీరికి అక్కడ ఇప్పుడు డిమాండ్ బాగావుంది. ఇప్పుడు వీరి అడుగుజాడల్లోనే దక్షిణాదికి చెందిన ఇంకో నటీమణి సంయుక్త బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

charantejhindifilm.jpg

సంయుక్త ఒక మంచి కంటెంట్ వున్న సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఆమె చేస్తున్న సినిమాలో అగ్రనటులు లేకపోయినా అత్యుత్తమ నటీనటులు అంటే జాతీయ పురస్కారాలు అందుకున్న నటీనటులతో పనిచేస్తోంది. కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా కీలకమైన పాత్రలో నటిస్తున్న ఒక చిత్రంలో సంయుక్త కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకి తెలుగు నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ కూడా విడుదల అవుతుందని తెలుస్తోంది.

prabhudevahindicinema.jpg

తెలుగులో వరుస విజయాలతో అగ్ర నటీమణుల్లో ఒకరుగా ఎదిగిన సంయుక్త ప్రస్తుతం ఈ హిందీ సినిమాతో ఆరంగేట్రం చెయ్యడం ఆసక్తికరంగా వుంది. ఆమె ఇప్పుడు నిఖిల్ సరసన ఒక పాన్ ఇండియా సినిమా 'స్వయంభు' చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే శర్వానంద్ తో ఒక సినిమా చేస్తున్నట్టుగా తెలిసింది.

samyuktha2.jpg

ఈ సినిమాలో ఇంకో ఆసక్తికరం అంశం ఏంటంటే ప్రభుదేవ, కాజోల్ ఈ ఇద్దరూ 27 ఏళ్ల తరువాత ఈ చిత్రంలో కలిసి నటించండం. వీరిద్దరూ ఇంతకు ముందు 'మెరుపు కళలు' అనే సినిమా చేశారు, ఇందులో ప్రభుదేవ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో కనపడతారు. రాజీవ్ మీనన్ ఆ సినిమాకి దర్శకుడు, ఆ సినిమాలో పాటలు అన్నీ అప్పట్లో పెద్ద విజయం సాధించాయి. ఇప్పుడు వారిద్దరూ ఈ చరణ్ తేజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటించడం ఆసక్తికరం. వీరితో పాటు సంయుక్త కూడా ఒక భాగం అవటం ఆమె హిందీ ఆరంగేట్రం మంచి కలయికలో వస్తోంది అని అంటున్నారు. ఈ సినిమాకి మంచి పేరున్న సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

Updated Date - May 24 , 2024 | 06:48 PM