Samyuktha: గుర్ర‌మెక్కిన సంయుక్త‌

ABN , Publish Date - Feb 11 , 2024 | 04:02 PM

ప్ర‌స్తుతం టాలీవుడ్ ల‌క్కీయ‌స్ట్ హీరోయిన్ ఎవ‌రైనా ఉన్నారా అంటే అది సంయుక్త అనే చెప్పాలి. ప్రస్తుతం నిఖిల్ హీరోగా వ‌స్తున్న‌ ‘స్వయంభు’లో హీరోయిన్‌గా నటిస్తోంది.

Samyuktha: గుర్ర‌మెక్కిన సంయుక్త‌
samyuktha

ప్ర‌స్తుతం టాలీవుడ్ ల‌క్కీయ‌స్ట్ హీరోయిన్ ఎవ‌రైనా ఉన్నారా అంటే అది సంయుక్త (Samyuktha menon) అనే చెప్పాలి. భీమ్లా నాయ‌క్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది మొద‌లు బింబిసార‌, స‌ర్‌, విరూపాక్ష‌, డెవిల్ ఇలా చేసిన‌ ప్ర‌తి చిత్రం విజ‌యం సాధించి అమ్మ‌డికి ఎన‌లేని క్రేజ్‌ను తీసుకువ‌చ్చాయి. ప్రస్తుతం ఆమె హీరో నిఖిల్ హీరోగా వ‌స్తున్న‌ ‘స్వయంభు’ (Swayambhu) లో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోండ‌గా సినిమా కోసం సంయుక్తా మీనన్ (Samyuktha menon) హార్స్ రైడింగ్ నేర్చుకుంటోంది. ఈ క్ర‌మంలో హార్స్ రైడింగ్ చేస్తున్న‌ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయ‌గా నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది.


GGC6H0-bMAAiZng.jpg

ఈ పోస్టులో సంయుక్త మీనన్ (Samyuktha menon) స్పందిస్తూ ఈ ఏడాది ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ.. జీవితం అంటే ఏంటో తెలుసుకుంటున్నాను. నా జీవితమంతా సాహసాలతోనే సాగుతోంది. కంఫర్ట్ గా ఒకే చోట ఉండిపోవడాన్ని ఇష్టపడను. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడుగులు వేస్తుంటా. నా కొత్త సినిమా స్వయంభు (Swayambhu) కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నా. హార్స్ రైడింగ్ నేర్చుకోవడం కొత్త మానసిక అనుభూతిని కలిగిలిస్తోంది. అపజయాలనే విజయాలకు మెట్లుగా మార్చుకుంటున్నా. అని పేర్కొంది.

Updated Date - Feb 11 , 2024 | 04:07 PM