Samyuktha: దర్శకుడికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. ఏం ఇచ్చిందంటే!

ABN , First Publish Date - 2023-04-27T23:39:46+05:30 IST

సంయుక్తా మీనన్‌ (Samyuktha) ప్రస్తుతం టాలీవుడ్‌ హ్యాపెనింగ్‌ హీరోయిన్‌. భీమ్లానాయక్‌తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ ‘బింబిసార’, సార్‌ తాజాగా విరూపాక్ష (Virupaksha super hit) చిత్రంతో

Samyuktha: దర్శకుడికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. ఏం ఇచ్చిందంటే!

సంయుక్తా మీనన్‌ (Samyuktha) ప్రస్తుతం టాలీవుడ్‌ హ్యాపెనింగ్‌ హీరోయిన్‌. భీమ్లానాయక్‌తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ ‘బింబిసార’, 'సార్‌' తాజాగా 'విరూపాక్ష' (Virupaksha super hit) చిత్రంతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్నఈ మల్లూబ్యూటీ గోల్డెన్‌ లెగ్‌ కాదు అంతకుమించి ప్లాటినమ్‌ లెగ్‌ (Golden leg) అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘విరూపాక్ష’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ సినిమా ఫీవరే నడుస్తోంది. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కార్తిక్‌ వర్మ దండు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిట్‌ కావడమే కాకుండా హీరోయిన్‌గా నటించిన సంయుక్త మీనన్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల సైతం ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు కార్తీక్‌ వర్మకు సంయుక్త ఐఫోన్‌ బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. (Samyukth), (Sukumar)

‘విరూపాక్ష’(Virupaksha) సినిమా విడుదల రోజు చిత్ర బృందం అంతా థియేటర్స్‌ విజిట్‌కు వెళ్లారు. అక్కడ ప్రేక్షకులతో ఎక్కువ సేపు స్పెండ్‌ చేయడంతో దర్శకుడు ఫోన్‌ పోయింది.ఈ విషయం తెలుసుకున్న సంయుక్త ఐఫోన్‌ ప్రో మోడల్‌ మొబైల్‌ను దర్శకుడిగా గిఫ్ట్‌గా ఇచ్చింది. ‘సినిమా హిట్‌ తర్వాత దర్శకుడికి మంచి గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నా. అదే సమయంలో అతని ఫోన్‌ పోయింది. దాంతో ఆయనకు వచ్చే ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు ఆగిపోయాయి. అందుకని వెంటనే ఫోన్‌ తీసుకున్నా. ఆయన పిమ్‌ కార్డ్‌ పని చేయడానికిఇ 24 గంటలు పడుతుంది.. దాంతో సోషల్‌ మీడియాలో సినిమా గురించి ఏం అనుకుంటున్నారో తెలుసుకోవడానికి దర్శకుడు మాలో ఎవరో ఒకరి ఫోన్‌ తీసుకుని చూసేవారు’’అని చెప్పుకొచ్చారు సంయుక్త. గతవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ రూ.50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

'

Updated Date - 2023-04-28T13:33:37+05:30 IST