Samyuktha: కామాఖ్య దేవాలయంలో సంయుక్త పూజలు.. అందుకేనా?

ABN , Publish Date - Apr 27 , 2024 | 10:50 PM

సంయుక్త.. ఇప్పుడిప్పుడే తన పరిధిని విస్తరించుకుంటున్న హీరోయిన్. తాజాగా ఆమె అస్సాంలోని ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి ఆలయంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ గుడికి ఓ ప్రతిష్టత ఉంది. ఈ దేవాలయానికి పెళ్లి కావాలనుకునే మహిళలు, పెళ్లయిన తర్వాత పిల్లల కోరుకునే మహిళలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మరిప్పుడు సంయుక్త ఈ గుడికి ఏం కోరుకోవడానికి వెళ్లినట్లు అనేలా అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Samyuktha: కామాఖ్య దేవాలయంలో సంయుక్త పూజలు.. అందుకేనా?
Samyuktha at Kamakhya Temple

సంయుక్త (Samyuktha).. ఇప్పుడిప్పుడే తన పరిధిని విస్తరించుకుంటున్న హీరోయిన్. టాలీవుడ్‌లో ఆమెకు సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గానే పేరుంది. ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న సంయుక్త, తన చుట్టు ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఆదిశక్తి (Adishakti) సంస్థను స్థాపించి.. సేవా కార్యక్రమాల్లోకి అడుగుపెట్టింది. అలాగే సంయుక్తకు దైవభక్తి కూడా ఎక్కువే. గ్యాప్ దొరికితే చాలు ఏదో ఒక గుడిలో దర్శనమిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె అస్సాం (Assam)లోని ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి ఆలయం (Kamakhya Temple)లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Samyuktha-2.jpg

ఎందుకు ఆశ్చర్యం.. గుడికి వెళితే ఆశ్చర్యపోవాలా? అనే డౌట్స్ రావచ్చు. కానీ ఈ గుడికి ఓ ప్రతిష్టత ఉంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. 51 శక్తిపీఠాల్లో నాలుగో శక్తిపీఠం ఈ దేవాలయం. ముఖ్యంగా ఈ దేవాలయానికి పెళ్లి కావాలనుకునే మహిళలు, పెళ్లయిన తర్వాత పిల్లల కోసం వెళ్లే మహిళలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మరిప్పుడు సంయుక్త ఈ గుడికి ఏం కోరుకోవడానికి వెళ్లినట్లు అనేలా అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Samyuktha-3.jpg

అయితే ఈ మధ్య కాలంలో కంగనా రనౌత్ (Kangana Ranaut), తమన్నా (Tamannah), ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela), సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) వంటి వారు కూడా ఈ గుడిలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. వాళ్ల కెరీర్ డౌన్‌లో ఉన్నప్పుడు ఈ దేవాలయం సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి.. మంచి ఫలితాలను పొందారు. ఇప్పుడు సంయుక్త బాలీవుడ్ (Samyuktha Bollywood Entry) వెళ్లే ప్రయత్నాల్లో ఉంది కాబట్టి.. అక్కడ తనకి అంతా మంచే జరగాలని, మంచి మంచి అవకాశాలు రావాలని కోరుతూ.. ఈ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా టాక్ నడుస్తోంది. అసలు విషయం ఏంటనేది సంయుక్తనే చెప్పాలి.

Samyuktha-1.jpg

Samyuktha-4.jpg

Read Latest Cinema News

Updated Date - Apr 27 , 2024 | 10:50 PM