Thalakona: కశ్మీర్ యాపిల్‌‌లా ఉండే అప్సరా రాణి.. కశ్మీర్ మిర్చి‌లా..

ABN , Publish Date - Mar 21 , 2024 | 12:37 PM

అక్షర క్రియేషన్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి (చేవెళ్ల) నిర్మాతగా అప్సరా రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘తలకోన’. ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో బుధవారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.

Thalakona: కశ్మీర్ యాపిల్‌‌లా ఉండే అప్సరా రాణి.. కశ్మీర్ మిర్చి‌లా..
Apsara Rani

అక్షర క్రియేషన్ పతాకంపై నగేష్ నారదాసి (Nagesh Naradasi) దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి (చేవెళ్ల) (Devara Sridhar Reddy) నిర్మాతగా అప్సరా రాణి (Apsara Rani) ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘తలకోన’ (Thalakona Movie). ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో బుధవారం ప్రీ రిలీజ్ వేడుక (Thalakona Pre Release Event)ను నిర్వహించింది. నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్, డిఎస్ రావు.. హీరో రమాకాంత్, డిస్ట్రిబ్యూటర్ పార్ధు రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు.

Thalakona.jpg

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. మా హీరోయిన్ అప్సరా రాణి ఇప్పటివరకు చేయని వెరైటీ కథ ఇది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు.. అందులో ఇంకో కోణం కూడా ఉంటుందని చూపించాం. అదే విధంగా పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరిగింది. అందుకు తగ్గ టీమ్‌ను, టెక్నికల్ టీమ్‌ను కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం.. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. (Thalakona Pre Release Event)


Apsara-Rani.jpg

దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. అప్సరా రాణిని చూస్తే కశ్మీర్ యాపిల్‌‌లా కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో తను కశ్మీర్ మిర్చి‌లా నటించింది. వెరైటీ స్టోరీ ఇది. షూటింగ్ తలకొనలో అద్భుతంగా జరిగింది. మా సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. మా లాంటి చిన్న సినిమాలకు సరైన షోస్ ఇచ్చి సినిమాలను బ్రతికించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నానని తెలిపారు. హీరోయిన్ అప్సరా రాణి మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఈ చిత్రం డెఫినెట్‌గా ఓ మైలురాయిగా నిలుస్తుంది. నేను ఇంత వరకు చేయని ఫైట్స్ ఈ చిత్రంలో చేయడం జరిగింది. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. (Thalakona Ready to Release)

Rani.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Earthquake: జపాన్‌లో భూకంపం.. 28వ అంతస్తులో రాజమౌళి ఫ్యామిలీ..!

***********************

*Suriya: ఈ యేడాది విడుదలకానున్న సూర్య రెండు చిత్రాలు

***************************

*Ilaiyaraaja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. అధికారిక ప్రకటన వచ్చేసింది

************************

*RC16: ఘనంగా ‘RC16’ ప్రారంభం.. ఫొటోలు వైరల్

********************************

Updated Date - Mar 21 , 2024 | 12:58 PM