మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు అందిన ఆహ్వానం..

ABN , Publish Date - Feb 09 , 2024 | 07:05 PM

ప్ర‌ముఖ‌ నిర్మాత‌, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగబోతోన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న సోద‌రుడు శిరీష్ కుమారుడైన అశిష్ వివాహం సంద‌ర్భంగా గ‌త వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల‌లోని సెల‌బ్రిటీల‌ను, రాజ‌కీయ నాయ‌కులను క‌లిసి ఆహ్వాన పత్రిక అంద‌జేస్తూ.. పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. తాజాగా మహేష్, రామ్ చరణ్‌లకు ఈ ఆహ్వానం అందింది.

మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు అందిన ఆహ్వానం..
Ram Charan and Mahesh Babu

ప్ర‌ముఖ‌ నిర్మాత‌, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు (Dil Raju) ఇంట పెళ్లి బాజాలు మోగబోతోన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న సోద‌రుడు శిరీష్ (Shirish) కుమారుడైన అశిష్ (Ashish) వివాహం సంద‌ర్భంగా గ‌త వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల‌లోని సెల‌బ్రిటీల‌ను, రాజ‌కీయ నాయ‌కులను క‌లిసి ఆహ్వాన పత్రిక అంద‌జేస్తూ.. పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. తాజాగా దిల్ రాజు ఫ్యామిలీ మెంబర్స్ మహేష్ బాబు, రామ్ చరణ్‌ల ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను పెళ్లికి రావాలని కోరుతూ.. ఆహ్వాన పత్రికలను అందజేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. (Ashish Weds Advitha)

Mahesh-Babu.jpg

ఇంతకు ముందు దిల్ రాజు ఫ్యామిలీకి సంబంధించి ఎవరికి వీలుంటే వారు.. సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి ఆశిష్ వివాహానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. తాజాగా పెళ్లి కుమార్తె అద్వైత‌ స‌మేతంగా ఆశిష్.. మోహ‌న్‌బాబు ఇంటికి వెళ్లి పెళ్లి ప‌త్రిక అంద‌జేశారు. ఆయన వారి పెళ్లి సమయంలో షూటింగ్ నిమిత్తం వేరే దేశంలో ఉండనున్నారు. అందుకే కాబోయే నూతన దంపతులను ఇంటికి పిలిపించుకుని ఆశీర్వదించారు. ఆ ఫొటోలు కూడా సోషల్ మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. (Dil Raju Family Invitation to Mahesh Babu)


Ram-Charan.jpg

అంతకు ముందు దిల్ రాజు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నాగార్జున, వెంకటేష్, రవితేజ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ అక్కినేని వంటి వారందరినీ కలిసి అద్వైత, ఆశిష్‌ల వివాహానికి ఆహ్వానించారు. మరోవైపు.. ఫిబ్రవరి 14న జరగనున్న ఈ వివాహ మహోత్సవాన్ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం. (Dil Raju Family Invitation to Ram Charan)


ఇవి కూడా చదవండి:

====================

*Karthik Gattamneni: తెలుగులో ‘ఈగల్’.. హిందీలో ‘సహదేవ్’ అని ఎందుకు పెట్టామంటే..

*************************

*Director Maruthi: ‘ట్రూ లవర్’ జంటతో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాం

**************************

Updated Date - Feb 09 , 2024 | 07:54 PM