Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ మోసం చేశాడా?.. అసలా పోస్టర్‌లో ఉందెవరు?

ABN , First Publish Date - 2023-04-07T13:47:09+05:30 IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ విషయంలో హరీష్ శంకర్‌పై ట్రోలింగ్ నడుస్తుంది. ఎందుకంటే.. ఈ పోస్టర్ వుంది పవన్ కాదంట.. మరి?

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ మోసం చేశాడా?.. అసలా పోస్టర్‌లో ఉందెవరు?
Ustaad Bhagat Singh First Look

‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) నటిస్తోంది. ఈ చిత్రం గత డిసెంబర్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బుధవారం చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి (Anand Sai) రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు. అయితే షూటింగ్ మొదలైన రోజే.. చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌పై ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Also Read-Balagam: ‘బలగం’ ఖాతాలో మరో అవార్డు.. మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డులు గెలిచిందంటే..

వాస్తవానికి ఈ పోస్టర్ విడుదల చేయగానే అందరూ హరీష్ శంకర్‌కు (Director Harish Shankar) ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే.. సినిమా ప్రారంభం రోజే.. ఫస్ట్ లుక్ వదిలి ఖుష్ చేశారంటూ వారంతా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆ ఆనందం కాసేపటికే ఆవిరైంది. ఇంత మోసం చేస్తావా? హరీష్ అంటూ ఒక్కసారిగా ట్రోలింగ్ మొదలైంది. కొందరు మెగా ఫ్యాన్స్‌కు అసలు ఇదేంటో కూడా అర్థం కాలేదు. ఎందుకు హరీష్‌ను ట్రోల్ (Trolling on Harish Shankar) చేస్తున్నారో కూడా తెలియక విషయం ఏంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే.. ఈ పోస్టర్‌లో ఉంది పవన్ కళ్యాణ్ కాదంట.. దర్శకుడు హరీష్ శంకరే పవర్ స్టార్ ఫోజు పెట్టాడని అంటున్నారు. పోస్టర్‌ని తీక్షణంగా చూస్తే.. అది నిజమే అని అనిపిస్తుంది. అందుకే ఫ్యాన్స్ అంతా.. ఇలానేనా మోసం చేసేది అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. (Ustaad Bhagat Singh Poster)

Power-Star.jpg

‘ఉస్తాద్ భగత్ సింగ్’కు సంబంధించి విడుదలైన ఈ ఫస్ట్ లుక్‌లో ఓ చెక్క కుర్చీలో పోలీస్ డ్రస్‌లో పవన్ కళ్యాణ్ (PSPK) కూర్చున్నట్లుగా చూపించారు. ఒక చేతిలో గన్.. మరో చేతిలో టీ గ్లాస్ ఉన్నట్లుగా చూపించారు. ఫేస్ మాత్రం కనిపించడం లేదు.. బ్యాక్‌ నుంచి చూపించారు. ఈ ఫస్ట్ లుక్ (Ustaad Bhagat Singh First Look) విడుదలైన వెంటనే అంతా పవన్ కళ్యాణే అనుకున్నారు. కానీ.. కాసేపటికే టాక్ మారిపోయింది. అంతకుముందు ‘గబ్బర్‌సింగ్’ సినిమా సమయంలో.. ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ లేకుండానే ఓ సీన్ చేసినట్లుగా హరీష్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలానే.. హరీష్ మ్యానేజ్ చేశాడంటూ ఫ్యాన్స్ (Mega Fans) కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయింది మాత్రం నిజం. మరి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో.. అసలు ఆ పోస్టర్‌లో ఉంది ఎవరో? తెలియాలంటే మాత్రం.. హరీష్ పెదవి విప్పాల్సిందే.

ఇవి కూడా చదవండి:

*********************************

*Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?

*Ravanasura Twitter Review: రవితేజ ‘రావణాసుర’ ట్విట్టర్ టాక్ ఏంటంటే..

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!

Updated Date - 2023-04-07T14:02:39+05:30 IST