సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bichagadu: ‘బిచ్చగాడు’కు, ఈ నోట్ల రద్దుకు లింకేంటి సామీ!

ABN, First Publish Date - 2023-05-20T14:46:09+05:30

‘బిచ్చగాడు 2’ మంచి కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. అయితే ఈ సినిమా విడుదలైన కొన్ని గంటలకే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోటును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. దీంతో

2000 Note and Bichagadu Movie Poster
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్ ఆంటోనీ (Vijay Antony) స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) చిత్రం మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. విజయ్ ఆంటోనీకి జోడిగా ఈ సినిమాలో కావ్య థాపర్ (Kavya Thapar) నటించారు. తెలుగులో ఈ సినిమాను ఉషా పిక్చర్స్ బ్యానర్ మీద విజయ్ కుమార్, వీరనాయుడు సంయుక్తంగా మే 19న భారీ ఎత్తున రిలీజ్ చేయగా.. మంచి కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ఈ చిత్రం ప్రదర్శింపబడుతోంది. అయితే ఈ సినిమా విడుదలైన కొన్ని గంటలకే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోటును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది.

గతంలో ‘బిచ్చగాడు’ (Bichagadu) సినిమా విడుదలైన సంవత్సరంలోనే రూ. 500, రూ. 1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేస్తున్నట్లుగా ప్రకటిస్తే.. ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ సినిమా విడుదలైన సంవత్సరంలోనే రూ. 2000 నోట్లను ఉపసంహరణ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో.. ఈ సినిమాకు, ఆ నోట్లకు ఏదో లింక్ ఉందనేలా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. 2016లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేశారు. అదే సంవత్సరం మేలో ‘బిచ్చగాడు’ సినిమా విడుదలైంది. ఇప్పుడు అంటే 2023లో రూ. 2000 నోట్లను రద్దు చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు. దీంతో నోట్ల రద్దుపై ‘బిచ్చగాడు’ ప్రభావం చాలా ఉందంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ (Funny Comments) చేస్తున్నారు.

రూ. 2000 నోట్ల రద్దుకు కారణమిదే:

2016వ సంవత్సరంలో చలామణీలోకి వచ్చిన రూ. 2000 నోట్లను 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించడం ఆపేసింది. రూ. 500, రూ. 1000 నోట్లను చట్టబద్ధంగా రద్దు చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థలోని కరెన్సీ అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో రూ.2000 నోటును వాడుకలోకి తెచ్చిన కేంద్రం.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇతర నోట్లు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇతర డినామినేషన్‌కి చెందిన నోట్లు దేశ ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోయే మోతాదులో ఉండటంతో ‘క్లీన్ నోట్ పాలసీ’ (Clean Note Policy) కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) రూ. 2000 నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది.


ఇవి కూడా చదవండి:

************************************************

*HappyBirthdayNTR: పవర్ హౌస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

*2018: తెలుగు ప్రేక్షకుల ముందుకు రూ. 100 కోట్లు రాబట్టిన చిత్రం.. ఎప్పుడంటే?

*Orange: జనసేనాని చేతికి ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్‌ ఆదాయం

*Pan India Stars: ఒకే స్టేజ్‌పై పవన్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఎందుకో తెలిస్తే..!

*V Vijayendra Prasad: సీఎం కేసీఆర్‌ మిరాకిల్ క్రియేట్ చేశారు.. తెలంగాణ బిడ్డగా హ్యాపీ!

*Lal Salaam: క్రికెట్ లెజెండ్‌తో యాక్టింగ్ లెజెండ్.. పిక్ బహుత్ అచ్చా హై!

Updated Date - 2023-05-20T14:46:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!