HappyBirthdayNTR: పవర్ హౌస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-05-20T12:36:59+05:30 IST

యంగ్ టైగర్, పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్‌గా ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఆ పేరుకున్న హిస్టరీకే హిస్టరీని క్రియేట్ చేస్తున్నాడీ నందమూరి తారక రామారావు. ఈ తారక రాముడి

HappyBirthdayNTR: పవర్ హౌస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
Young Tiger NTR

క్లాస్ హీరోలు కొందరు, మాస్ హీరోలు కొందరు.. ఈ రెండూ కలగలిపి విశ్వరూపం ప్రదర్శించగల నటులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) ఒకరు. ఇండస్ట్రీలో ఇలాంటి ఇమేజ్ చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది. అలాంటి వారితో పోల్చుకున్నా.. అగ్రస్థానంలో నిలవగలిగిన సత్తా ఉన్న నటుడు తారక్ (Tarak). ఇప్పుడాయన ఇమేజ్ ‘ఆర్ఆర్ఆర్’‌తో ఖండాంతరాలను దాటింది. ఆ పెద్దాయన మనవడిగా అడుగుపెట్టి.. యంగ్ టైగర్, పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్‌గా ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఆ పేరుకున్న హిస్టరీకే హిస్టరీని క్రియేట్ చేస్తున్నాడీ నందమూరి తారక రామారావు. ఈ తారక రాముడి పుట్టినరోజు నేడు (మే 20). ఈ సందర్భంగా ఆయనపై ఓ ప్రత్యేక ఆర్టికల్..

జూనియర్ ఎన్టీఆర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. కెరీర్ తొలినాళ్లలోనే బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత అందరి హీరోలకు ఉన్నట్టే.. ఈయనకు కూడా వరస ప్లాప్స్ పడ్డాయి. దీంతో ఎన్టీఆర్ (NTR) పని అయిపోయిందని అంతా అనుకున్నారు. అదే టైమ్‌లో బాగా లావుగా తయారవడం కూడా ఆయన కెరీర్‌పై దెబ్బకొట్టింది. సినిమాలైతే చేస్తున్నాడు.. అందులో తను ఎంత కష్టపడాలో అంతా కష్టపడుతున్నాడు కానీ.. హిట్ మాత్రం ఆయనకు రాలేదు. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న ఎన్టీఆర్‌ని మళ్లీ మాములు మనిషిని చేసింది ఎవరో కాదు.. ఆయన ఎంతగానో అభిమానించే జక్కన్న (SS Rajamouli). ‘యమదొంగ’ (Yamadonga) చిత్రంతో ఎన్టీఆర్‌ని పూర్వ రూపానికి మార్చేశాడు జక్కన్న. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ తన నటనపైనే కాదు.. తన శరీరంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతూ వస్తున్నారు. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందనే దానికి నిదర్శనమే ‘యమదొంగ’ విజయం. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డాడో.. అంతే గొప్ప విజయాన్ని అందుకున్నాడు.

NTR-1.jpg

‘యమదొంగ’ తర్వాత చేసిన ‘కంత్రీ’ సినిమా నిరాశ పరిచినప్పటికీ.. ఆ తర్వాత చేసిన ‘అదుర్స్’ (Adurs), ‘బృందావనం’ (Brindavanam) చిత్రాలు ఎన్టీఆర్ రేంజ్‌ని అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అదుర్స్’ చిత్రం ఎన్టీఆర్‌లోని విభిన్న కోణాన్ని ప్రేక్షకులకి పరిచయం చేసింది. ఆ సినిమా ఇప్పుడు టీవీలలో వచ్చినా.. టీవీల ముందు ప్రేక్షకులు అలానే కూర్చుండిపోతారు. అంతలా ఆ సినిమా ప్రేక్షకులని ఆలరించింది. ఆ తర్వాత తన ప్రయత్నంలో లోపం లేకుండా సినిమాలు చేసినా.. ఓ మోస్తరు విజయాలే ఆయనకి దక్కాయి. మళ్లీ ‘టెంపర్’ (Temper) వచ్చే వరకు ఎన్టీఆర్ సినిమాలు డౌన్‌లోనే నడిచాయి. ‘టెంపర్’తో మరోసారి తనలోని విశ్వరూపాన్ని ఎన్టీఆర్ ప్రదర్శించారు. ‘టెంపర్’ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరసగా మంచి చిత్రాలు పడ్డాయి. సుకుమార్‌తో చేసిన ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho) చిత్రం.. నటుడిగా ఎన్టీఆర్‌ని మరోస్థాయికి చేర్చిందని చెప్పుకోవచ్చు. ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత వీరరాఘవ’.. ఇలా వరుస విజయాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR)తో ఒక్కసారిగా పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్‌ని అల్లాడించాడు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’తో హాలీవుడ్‌లో ఎన్టీఆర్ పేరు మారుమోగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Young Tiger NTR)తో అవకాశం వస్తే సినిమా చేయడానికి రెడీ అంటూ ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ (Guardians of the Galaxy) చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్ (James Gunn) ప్రకటించడంతో.. ఎన్టీఆర్ స్టామినా ఇదంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.

NTR-30.jpg

ఇప్పుడు బాలీవుడ్‌ స్ట్రయిట్ చిత్రం ‘వార్ 2’ (War 2)తో హృతిక్ రోషన్‌ (Hrithik Roshan)కు పోటీగా దిగుతున్న ఎన్టీఆర్.. మరోవైపు కొరటాలతో ‘దేవర’ (Devara) అంటూ పోస్టర్స్‌తోనే పిచ్చెక్కించేస్తున్నాడు. తాజాగా వచ్చిన ‘దేవర’ ఫస్ట్ లుక్‌తో.. మరో వైవిధ్య భరిత చిత్రం ఎన్టీఆర్ ఖాతాలో చేరబోతుందనేలా ట్రెండ్ బద్దలు కొట్టేశాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఈ పవర్ హౌస్‌ (Power House)తో ‘కెజియఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) పవర్ ఫుల్ చిత్రాన్ని చేయబోతున్నారు. ఆ సినిమాతో చరిత్ర తిరగరాయడం ఖాయం అనేలా ఇప్పటికే టాక్ వైరల్ అవుతోంది. ఇంటర్నేషనల్ బాక్సాఫీస్‌ని షేక్ చేసేలా ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ టీమ్ ప్లాన్ చేస్తున్నారనేది తాజా సమాచారం.

NTR-31.jpg

ఏదిఏమైనా.. యంగ్ టైగర్ అంటే సునామీ. డ్యాన్స్, డైలాగ్స్, యాక్టింగ్, సింగింగ్.. ఇలా మల్టీ టాలెంట్‌తో.. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ (Man of the Masses NTR)గా తిరుగులేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న ఈ పవర్ హౌస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్ (#HappyBirthdayNTR).

ఇవి కూడా చదవండి:

************************************************

*2018: తెలుగు ప్రేక్షకుల ముందుకు రూ. 100 కోట్లు రాబట్టిన చిత్రం.. ఎప్పుడంటే?

*Orange: జనసేనాని చేతికి ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్‌ ఆదాయం

*Pan India Stars: ఒకే స్టేజ్‌పై పవన్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఎందుకో తెలిస్తే..!

*V Vijayendra Prasad: సీఎం కేసీఆర్‌ మిరాకిల్ క్రియేట్ చేశారు.. తెలంగాణ బిడ్డగా హ్యాపీ!

*Lal Salaam: క్రికెట్ లెజెండ్‌తో యాక్టింగ్ లెజెండ్.. పిక్ బహుత్ అచ్చా హై!

Updated Date - 2023-05-20T12:36:59+05:30 IST