Upasana: అత్యంత ప్రేమాభిమానాల మధ్య ఉపాసన సీమంతం.. ఫొటోలు వైరల్

ABN , First Publish Date - 2023-04-24T18:41:27+05:30 IST

ఉపాసనకు సంబంధించి ఇటీవల దుబాయ్‌ (Dubai)లో జరిగిన సీమంతం (Baby Shower Celebrations) ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అదొక్కటే కాదు, ఆ తర్వాత కూడా అత్యంత సన్నిహితుల మధ్య హైదరాబాద్‌ (Hyderabad)లో మరో రెండు వేడుకలు

Upasana: అత్యంత ప్రేమాభిమానాల మధ్య ఉపాసన సీమంతం.. ఫొటోలు వైరల్
Upasana Baby Shower Party at Hyderabad

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Global Star Ram Charan), ఉపాసన (Upasana)ల జంట గురించి ఈ మధ్య కాలంలో వార్తలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఉపాసన గురించి రామ్ చరణ్ ఎక్కడ మాట్లాడినా ఆప్యాయత కురిసినట్టు ఉంటుంది. మిస్టర్‌ సీ (Mr C) అంటూ అతని కోసం ఆమె ఏం రాసినా అద్భుతంగా అనిపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని, కలిసిమెలిసి ఉండాల్సిన దంపతులకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా వీరిద్దరూ నిలుస్తున్నారు. వారి మధ్య అన్యోన్యతకు టాలీవుడ్ అనే కాకుండా.., అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఆనందించారు.

Upasana-00.jpg

ఆస్కార్‌కి రెడీ అవుతున్న ఈ దంపతుల మీద ఆ మధ్య వేనిటీ ఫెయిర్‌ ఓ వీడియో రికార్డ్ చేసింది. వేనిటీ ఫెయిర్‌ ఇప్పటి వరకు అప్‌లోడ్‌ చేసిన అన్నీ వీడియోల రికార్డులనూ బద్ధలు కొట్టేశారు ఉపాసన, రామ్‌చరణ్ దంపతులు. గర్భవతి అయిన తన భార్యను రామ్‌చరణ్‌ అపురూపంగా చూసుకుంటున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Upasana-5.jpg

ఇక ఉపాసనకు సంబంధించి ఇటీవల దుబాయ్‌ (Dubai)లో జరిగిన సీమంతం (Baby Shower Celebrations) ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అదొక్కటే కాదు, ఆ తర్వాత కూడా అత్యంత సన్నిహితుల మధ్య హైదరాబాద్‌ (Hyderabad)లో మరో రెండు వేడుకలు వైభవంగా జరిగాయి. ఒక వేడుకలో ఉపాసన పింక్‌ షిమ్మరీ వస్త్రాలంకరణతో మెరిసిపోయారు. మరో చోట బ్లూ ఫ్రీ ఫ్లోయింగ్ డ్రెస్‌తో తళుకులీనారు.

Upasana-6.jpg

రామ్‌చరణ్‌ (Ram Charan) తనకు నచ్చిన నలుపు రంగు దుస్తుల్లో ఒకచోట, వైట్‌ షర్ట్ విత్‌ స్మార్ట్ చినోస్‌లో మరోచోట స్మార్ట్‌గా కనిపించారు. ఈ పార్టీలకు అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు హాజరయ్యారు. పింకీ రెడ్డి, సానియా మీర్జా, కనికా కపూర్‌, అల్లు అర్జున్‌తోపాటు వారి కుటుంబసభ్యులు కూడా ఈ వేడుకలో అలరించారు.

Upasana-0.jpg

అలాగే కుటుంబసభ్యులు మెగాస్టార్ చిరంజీవి కొణిదెల (Chiranjeevi Konidela), సురేఖ, చెల్లెళ్లు సుష్మిత, శ్రీజతో పాటు ఉపాస‌న త‌ల్లి శోభన కామినేని, సంగీతారెడ్డి వంటివారు (Kamineni Family) కూడా ఈ వేడుకలో పాలుపంచుకుని ఆనందోత్సాహంలో మునిగిపోయారు. త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉపాసనను తమ ప్రేమాభిమానాలతో ఆహూతులందరూ ముద్దుచేశారు.

Upasana-2.jpg

గత కొన్నాళ్లుగా వరుస వేడుకలతో బిజీగా ఉన్న ఉపాసన చరణ్‌ దంపతులను భగవంతుడు పుత్రోత్సాహంలో ముంచెత్తే క్షణాల కోసం వేచిచూస్తున్నామని అంటున్నారు సన్నిహితులు, మెగాభిమానులు (Mega Fans). ప్రస్తుతం ఉపాసనకు సంబంధించి జరిగిన వేడుకల ఫొటోలు సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో తెగ‌ వైర‌ల్ అవుతున్నాయి.

Upsi-2.jpg

Upsi-1.jpg

Upasana-3.jpg

Upasana.jpg

Upasana-4.jpg

ఇవి కూడా చదవండి:

************************************************

*King Nagarjuna: కడుపులో ఉండగానే.. అయ్యగారి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!

*Hari Hara Veera Mallu: కీరవాణి కూడా..!

*Akhil Akkineni: ‘ఏజెంట్’లో అది నాకు చాలా కష్టమనిపించింది

*Dhanush: 40 ఏళ్ల వయసులో యూత్‌ ఐకాన్‌ అవార్డు

*Mama Mascheendra Teaser Talk: మహేష్ బావ.. ఆ ఇద్దర్నీ ఒకేసారి చంపేస్తాడట!

*OG Producer: మటన్ బిర్యానీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని సర్‌ప్రైజ్ చేసిన నిర్మాత

Updated Date - 2023-04-24T19:05:55+05:30 IST