Akhil Akkineni: ‘ఏజెంట్’లో అది నాకు చాలా కష్టమనిపించింది

ABN , First Publish Date - 2023-04-22T20:53:03+05:30 IST

యంగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల కాంబినేషన్‌లో రూపొందిన స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘ఏజెంట్’ గురించి అఖిల్ ఏం చెప్పారంటే..

Akhil Akkineni: ‘ఏజెంట్’లో అది నాకు చాలా కష్టమనిపించింది
Akhil Akkineni

యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni), స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి (Surender Reddy)ల కాంబినేషన్‌లో స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’ (Agent). ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments), సురేందర్ 2 సినిమా (Surender 2 Cinema) పతాకాలపై రామబ్రహ్మం సుంకర (Ramabrahmam Sunkara) నిర్మించారు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హీరో అఖిల్ అక్కినేని చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. (Akhil Akkineni Agent Interview)

‘‘నాకు లార్జర్ దేన్ లైఫ్, యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న వెలితి. ఆ సినిమా చాలా మంచి విజయం సాధించింది. నాకు యాక్సెప్టెన్స్ చాలా వరకు పెరిగింది. అయితే పర్సనల్‌గా నాకు ఇష్టమైన జోనర్ యాక్షన్. లాక్‌డౌన్ సమయంలో ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు.. దర్శకుడు సురేందర్ రెడ్డి‌గారిని కలవడం జరిగింది. అప్పటికి కథ ఇంకా తెలీదు. కానీ ఏదైనా కొత్తగా ఫ్రెష్ గా చేయాలని మాత్రం నిశ్చయించుకున్నాను. ఒక కొత్త తరహా యాక్షన్ సినిమా చేసి ఫ్రెష్ కంటెంట్‌ని ఇవ్వాలనే ప్రయత్నంతో స్పై జోనర్‌ని ఎంపిక చేసుకొని ఏజెంట్ జర్నీ మొదలుపెట్టాను. నాకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలే ఇష్టం. రాజమౌళి (Rajamouli)గారి సినిమాలు అంటే పిచ్చి. (Akhil Akkineni About Agent)

సిసింద్రీ చేసినప్పుడు నాకు 16 నెలలు.. అసలు ఏం గుర్తులేదు(నవ్వుతూ). ఇప్పుడు కూడా కొందరు సిసింద్రీ అని పిలుస్తారు. ఇప్పటికి నా ఆలోచన దృక్పథం ఏమిటంటే.. అఖిల్ నటించిన సినిమాకి థియేటర్‌కి వస్తే ప్రేక్షకులకు ఎక్స్ట్రీమ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. చాలా హార్డ్ వర్క్ చేసి, సినిమాకి ఏడాది రెండేళ్ళు పట్టినా.. ప్రేక్షకులకు థియేటర్‌లో గొప్ప అనుభూతి ఇచ్చే చిత్రాలు చేయాలని వుంది. ఏజెంట్ జోనర్ నాకు బాగా నచ్చేసింది. లిమిటేషన్స్ విషయానికి వస్తే.. ఇంత క్రేజీగా చేయగలుగుతానా లేదా అనేది డౌట్. ఎందుకంటే ఇంతకుముందు అలాంటిది చేయలేదు. ఈ పాత్ర కోతిలానే బిహేవ్ చేస్తుంది. ప్రతి క్షణం ఒక హైలో మాట్లాడాలి. అది నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే.. వ్యక్తిగతంగా నేను కొంచెం సిగ్గరి. అయితే కొంత జర్నీ తర్వాత ఆ పాత్ర అలవాటైపోయింది. (Akhil Akkineni Talks about Agent Movie)

Akhil-2.jpg

ఏజెంట్ చాలా ప్రత్యేకమైన సినిమా. మమ్ముట్టిగారు లాంటి పెద్ద స్టార్‌ని ఎందుకు ఇందులో తీసుకున్నామో విడుదల తర్వాత మీరే చెప్తారు. ఇది కేవలం ఒక్క హీరో వైపు నుంచే నడిచే సినిమా కాదు. మూడు పాత్రలు మధ్య ఇంటెన్స్ డ్రామా జరిగే సినిమా ఇది. మమ్ముట్టి గారి పాత్రతో నేను ప్రేమలో పడిపోయాను. అంత అద్భుతంగా వచ్చింది. కథ ఓ కొత్త ప్రపంచంలో జరుగుతుంటుంది. కంప్లీట్ గా న్యూ సెటప్. ఖచ్చితంగా ఏజెంట్ ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో నా పాత్ర పేరు రిక్కీ. తను చాలా వైల్డ్. ఎవరూ ఊహించని విధంగా డీల్ చేస్తాడు. ఏజెంట్.. వెరీ వైల్డ్.

స్పై జోనర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం సీరియస్‌గా వెళ్లిపోతుంది. అయితే మాస్ ఆడియన్స్‌కి నచ్చేలా యంగేజింగ్ ఎంటర్‌టైనింగా ఉండటానికి స్క్రిప్ట్ దశలో చాలా వర్క్ చేశాం. స్పై అనే వాడు నీడలో ఉంటూ అందరితో బ్లెండ్ అయిపోయి వుండాలి. కానీ ఏజెంట్ కంప్లీట్ రివర్స్. అన్ ప్రెడిక్ట్ వైల్డ్ మంకీలా ఉంటాడు. సెపరేట్ కామెడీ స్పై రన్‌ని డిస్ట్రబ్ చేస్తుంది. అందుకే హ్యూమర్‌ని కథానాయకుడి పాత్రలోనే ఉండేట్లు చూసుకున్నాం. అది చాలా ఆసక్తికరంగా వుంటుంది. సీరియస్ యాక్షన్ సీన్‌లో కూడా తను హ్యుమర్ తీసుకొచ్చేస్తాడు. క్యారెక్టర్ వైల్డ్ నెస్ వలన అది వర్కవుట్ అయ్యింది. సూరి గారి పాత్రలు మాములుగా క్రాక్‌గా వుంటాయి. దాని వలన సినిమా ఎక్సయిటింగ్‌గా అయిపోతుంది. సూరిగారు ఈ పాత్రని చాలా ప్రేమించి చేశారు.

Akhil-3.jpg

ఇందులో సాక్షి అద్భుతంగా నటించింది. చాలా ప్రొఫెషనల్‌గా చాలా మంచి ఎనర్జీతో చేసింది. చూడటానికి కూడా చాలా అందంగా వుంది. మొదటి రోజు షూట్ తర్వాత సూరిగారు ‘అమ్మాయి ఇరగదీసేస్తుంది మీరు ఎక్కడా తగ్గకండి’ అని చెప్పారు. ఊర్వశి రౌతెలా ఓ పాట చేస్తుంది. చివర్లో షూట్ చేసిన పాట అదే. క్లైమాక్స్‌లో వస్తుంది. నిర్మాత అనిల్‌గారు చాలా ప్యాషనేట్, డేరింగ్ ప్రొడ్యూసర్. చాలా సపోర్ట్. అలాంటి నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. తప్పకుండా ఆయనతో మరో సినిమా చేస్తాను.

బాడీని ఎనాలసిస్ చేయడానికి ఎవరైనా హాలీవుడ్ (Hollywood) యాక్షన్ హీరోల పరిశీలించారా? అంతా అంతా అడుగుతున్నారు. హాలీవుడ్ వరకూ ఎందుకు? ఇండియాలోనే హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఉన్నారు. కానీ బాడీ బిల్డింగ్‌లో నేను రియలైజ్ అయినది ఏమిటంటే.. ప్రతి బాడీ జెనిటిక్ డిఫరెంట్. ఒకరిలా బిల్డ్ చేద్దామని అనుకుంటే కుదరదు. దర్శకుడు ఎలాంటి లుక్‌ని కోరుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టాను. నాలుగు నెలల్లో నేను కోరుకుంటున్న బాడీ తీసుకురాగలని అనుకున్నాను. కానీ పది నెలలు పట్టింది. బాడీలో చాలా మార్పు కావాలి. ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ ఫర్మేషన్ ఇవ్వాలి. గత సినిమాల లుక్‌ని ప్రేక్షకులు మర్చిపోవాలి. ఈ పాయింట్‌ని దర్శకుడు బలంగా పట్టుకున్నారు. దానికి టైం పట్టింది.

ఫైనల్‌గా సినిమా ఏప్రిల్ 28న వస్తోంది. ఏప్రిల్ 28న వచ్చిన పోకిరి (Pokiri), బాహుబలి 2 (Baahubali 2) నా ఆల్ టైం ఫేవరేట్ మూవీస్. వ్యక్తిగతంగా నాకు పెద్దగా సెంటిమెంట్లు వుండవు. కానీ ఇది చెప్పినపుడు చాలా ఆనందంగా ఫీలయ్యాను. పోకిరి 50 సార్లు చూసి ఉంటాను. బాహుబలి కూడా అంతే. ఇంకా చూస్తూనే వున్నాను. ఇదొక బ్లెస్సింగ్ లానే భావిస్తున్నాను.’’

ఇవి కూడా చదవండి:

************************************************

*Dhanush: 40 ఏళ్ల వయసులో యూత్‌ ఐకాన్‌ అవార్డు

*Mama Mascheendra Teaser Talk: మహేష్ బావ.. ఆ ఇద్దర్నీ ఒకేసారి చంపేస్తాడట!

*OG Producer: మటన్ బిర్యానీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని సర్‌ప్రైజ్ చేసిన నిర్మాత

*Ivana: ‘సెల్ఫిష్’ చేతికి చిక్కిన ‘లవ్ టుడే’ భామ

*Young Actress: మోడల్స్‌ని వ్యభిచార ఊబిలోకి దించుతోన్న నటి అరెస్ట్

*Sai Madhav Burra: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పై ఆసక్తికర కామెంట్స్

Updated Date - 2023-04-22T20:53:03+05:30 IST