GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

ABN , First Publish Date - 2023-02-24T22:26:28+05:30 IST

గ్లోబల్ స్టార్ (GlobalStar) అంటే ఏమిటో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) క్రేజ్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..
Mega Power Star Ram Charan

గ్లోబల్ స్టార్ (GlobalStar) అంటే ఏమిటో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) క్రేజ్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని సంచలనం అవుతోంది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చెప్పులు లేకుండా నడవడం నుంచి.. అమెరికాలో దిగడం వరకు... ఆయన ప్రతి అడుగును అభిమానులు, ప్రేక్షకులు ఫాలో అవుతూ సోషల్ మీడియాలో ఆయన పేరుతో సందడి చేశారు. స్వామిమాలలో అమెరికా వెళ్లిన రామ్ చరణ్... అక్కడ ఆలయంలో అయ్యప్ప మాల తీశారు. గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళితే... ఆయన్ను చూడటం కోసం అభిమానులు బారులు తీరారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటున్న రామ్ చరణ్ వ్యక్తిత్వం చూసి అమెరికన్లు సైతం అభిమానులు అవుతున్నారు. ఒక చిన్న పాప కూడా రామ్ చరణ్ కోసం ఏడ్చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక గుడ్ మార్నింగ్ అమెరికా (Good Morning America) షోలో సింపుల్‌గా చరణ్ కూర్చున్న తీరు గురించి హోస్ట్ కూడా మాట్లాడారు.

రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్‌లో (Hollywood) హాట్ టాపిక్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) పాత్రలో ఆయన నటన లెజెండరీ హాలీవుడ్ దర్శక నిర్మాత నుంచి విమర్శకుల, ప్రేక్షకుల వరకు అందరినీ ఆకట్టుకుంది. రామ్ పాత్రలో నటన గురించి జేమ్స్ కామెరూన్ (James Cameron) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించారంటే... చరణ్ పర్ఫామెన్స్ ఎంత ఎఫెక్ట్ చూపించిందనేది అర్థమవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాని కూడా రామ్ చరణ్ నటన మరో స్థాయిలో నిలబెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో సినిమాకు నామినేషన్లు సాధించి పెట్టింది. ఇప్పుడు ది క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‌లో (The Critics Choice Super Awards) బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ క్యాటగిరిలో రామ్ చరణ్‌కు నామినేషన్ లభించింది. మార్చి 16న విన్నర్స్ డిటైల్స్ అనౌన్స్ చేస్తారు. ఇదిలా ఉంటే గత వారం పది రోజులుగా రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ (GlobalStar RamCharan) అంటూ ఓ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్‌ రేంజ్ ఇదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్.. సంచలన దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయన 15వ (RC15) సినిమా అది. ఆ తర్వాత సానా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించారు. మరో రెండు ప్రాజెక్ట్స్‌ కూడా చర్చల దశలో ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

*********************************

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం

Updated Date - 2023-02-24T22:26:30+05:30 IST