Mahi V Raghav: ‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అయినా ముందే హెచ్చరిక చేశాం

ABN , First Publish Date - 2023-06-09T19:53:45+05:30 IST

క్రైమ్ వెబ్ సిరీస్ ‘సైతాన్’ ట్రైలర్ విడుదల అనంతరం వస్తున్న విమర్శలపై దర్శకుడు మహి వి రాఘవ్ స్పందించారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తానంటూ.. అందుకే ముందుగానే ఈ కంటెంట్ విషయంలో హెచ్చరిక చేశామని తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌లో కొన్ని తీవ్రమైన పదాలు, వయలెన్స్ ఉంటాయి. క్రైమ్ కథ ఇష్టపడే వారికే ఈ సిరీస్ అని తెలిపారు.

Mahi V Raghav: ‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అయినా ముందే హెచ్చరిక చేశాం
Shaitan Web Series Director Mahi V Raghav

గత కొన్ని రోజులుగా దర్శకుడు మహి వి రాఘవ్ (Mahi V Raghav) తెరకెక్కిస్తున్న క్రైమ్ వెబ్ సిరీస్ ‘సైతాన్’ (Shaitan) పై ఎటువంటి టాక్ నడుస్తుందో తెలియంది కాదు. ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన తర్వాత అందులోని బూతు డైలాగ్స్, కొన్ని శృంగార సీన్లు, బ్లడ్‌తో నిండిన సీన్లు హాట్ టాపిక్‌గా మారాయి. అంత వల్గర్ కంటెంట్ ఉన్నా కూడా.. ‘సైతాన్’ ట్రైలర్ (Shaitan Trailer) మాత్రం మంచి స్పందనను రాబట్టుకుంటూ.. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకెళుతోంది. ఈ ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూసి.. ప్రేక్షకులు కూడా ఇటువంటి వాటికి అలవాటు పడిపోయారు అనేలా కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. అయితే ట్రైలర్‌లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, సీన్లపై వస్తున్న విమర్శలకు దర్శకుడు మహి వి రాఘవ్ క్లారిటీ ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కానీ మేము ముందుగానే ఈ కంటెంట్ విషయంలో హెచ్చరిక చేస్తూ వచ్చాం. ఈ వెబ్ సిరీస్‌లో కొన్ని తీవ్రమైన పదాలు, వయలెన్స్ ఉంటాయి.. ఇది క్రైమ్ కథలని ఇష్టపడే ఆ తరహా ఆడియన్స్ కోసం తెరకెక్కించిన వెబ్ సిరీస్ అని మొదటి నుంచి చెబుతూనే వచ్చాం. నేను ఈ కథతో క్రైమ్ వరల్డ్‌ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. ఒక దర్శకుడిగా క్రైమ్ వరల్డ్ ఎలా ఉంటుందో చూపించేందుకు స్వేచ్చని తీసుకున్నాను. ఆరిస్టుల చేత ఆ తరహా పెర్ఫామెన్స్ చేయించా. ఇలా చేయకుంటే ఈ కథకి న్యాయం జరగదని అనిపించింది. అందుకే అంత ఫ్రీడమ్ తీసుకోవాల్సి వచ్చింది. (Director Mahi V Raghav about Shaitan)

‘సైతాన్’ వల్గర్ సిరీస్ కాదు.. కానీ క్రైమ్ వరల్డ్‌ (Crime World)ని బేస్ చేసుకున్న కథ కాబట్టి కొన్ని ఘాటైన పదాలు ఉంటాయి. పోస్టర్స్, ట్రైలర్ ద్వారా ఇది ఎలాంటి వెబ్ సిరీస్ అనేది క్లియర్‌గా చెప్పేశాం. కాబట్టి దీనిని చూడాలా? వద్దా? అనేది ఆడియన్స్ వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను. నా వరకు ఒక రచయిత, కళాకారుడు, క్రియేటివ్‌గా తమ ఆలోచనలని స్వేచ్ఛగా ఎలా వ్యక్తం చేస్తారో.. అదే విధంగా ఒక దర్శకుడికి తన కథలో పదాలు, డైలాగ్స్ ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందనే భావిస్తున్నాను’’ అని మహి వి రాఘవ్ చెప్పుకొచ్చారు. కాగా.. జూన్ 15 నుంచి ఈ ‘సైతాన్’ సిరీస్ (Shaitan Web Series) డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Karthika: రెజీనా చదివే బుక్‌లో.. దెయ్యంగా కాజల్ అగర్వాల్!

*Anasuya: అలసిపోయాను.. ఇక ఆపేస్తున్నాను

*Pawan Kalyan OG: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌‌‌పై ఫ్యాన్స్ ట్వీట్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

*Hero Siddharth: ఓ పెద్దావిడను చూసి భోరున ఏడ్చేసిన సిద్ధార్థ్.. ఆమె ఎవరో తెలుసా?

*Adipurush: సెన్సార్ పూర్తి.. ఏం సర్టిఫికేట్ వచ్చిందో తెలుసా?

Updated Date - 2023-06-09T19:59:00+05:30 IST