Megha Akash: అవన్నీ వదంతులే.. మేఘా ఆకాష్ డేటింగ్ వార్తలపై తల్లి క్లారిటీ

ABN , First Publish Date - 2023-06-09T22:19:14+05:30 IST

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ కుమారుడితో హీరోయిన్ మేఘా ఆకాష్ డేటింగ్‌లో ఉందని, త్వరలోనే నిశ్చితార్థం అనే వార్తలను.. ఆమె మదర్ ఖండించారు. తన కుమార్తె విషయంలో వైరల్ అవుతున్న వార్తలలో ఎటువంటి వాస్తవం లేదని ఆమె వెల్లడించారు. దీంతో మేఘా ఆకాష్ డేటింగ్, నిశ్చాతర్థపు వార్తలలో నిజం లేదని తెలిసిపోయింది.

Megha Akash: అవన్నీ వదంతులే.. మేఘా ఆకాష్ డేటింగ్ వార్తలపై తల్లి క్లారిటీ
Megha Akash

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తున్న యంగ్‌ హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ (Megha Akash) త్వరలోనే పెళ్ళిపీటలెక్కబోతున్నారంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆమె తల్లి (Megha Akash Mother) ఖండించారు. తన కుమార్తె పెళ్ళి చేసుకోబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని, ఇలాంటి వార్తలను ప్రసారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. కోలీవుడ్‌లో ‘వందా రాజాదాన్‌ వరువేన్‌’, ‘ఎన్నై నోక్కి’, ‘ఒరు పక్క కథై’, ‘పేట’, ‘సింగిల్‌ శంకరుం స్మార్ట్‌ఫోన్‌ సిమ్రాన్‌’ వంటి చిత్రాల్లో నటించిన మేఘా ఆకాష్‌.. గత కొంతకాలంగా తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ కుమారుడితో డేటింగ్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై మేఘా ఆకాష్‌ తల్లి స్పందించారు. తన కుమార్తెపై సాగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఆమె.. పెళ్ళి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

అంతకు ముందు త్వరలో ఈ చెన్నై (Chennai) బ్యూటీ పెళ్లి పీటలెక్కనున్నట్లు కోలీవుడ్‌ మీడియా సైతం కోడై కూసింది. కన్యాకుమారికి చెందిన ప్రముఖ రాజకీయవేత్త, వ్యాపారవేత్త కొడుకును మేఘా ఆకాష్‌ పెళ్లి చేసుకోనుందని.. మేఘా కొంతకాలంగా అతనితో ప్రేమలో ఉందని, ఇటీవల ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లికి అంగీకారం తెలిపారనేలా వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే విషయాన్ని కోలీవుడ్ మీడియా కూడా విపరీతంగా వైరల్ చేసింది. త్వరలోనే నిశ్చితార్థం అని కూడా ప్రచారం చేశాయి. ఈ విషయం బాగా వైరల్ అవుతుండటంతో మేఘా ఆకాష్‌ తల్లి.. మీడియాకు ఆ వార్తలలో నిజం లేదని తెలియజేశారు.

Megha-Akash.jpg

మేఘ ఆకాష్ తెలుగు సినిమాల విషయానికి వస్తే (Megha Akash Tollywood Movies).. నితిన్‌తో చేసిన ‘లై’ (Lie) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘ఛల్‌ మోహన్‌రంగా’, ‘రాజ రాజ చోర’, ‘డియర్‌ మేఘ’, ‘ప్రేమదేశం’, ‘రావణాసుర’, ‘గుర్తుందా శీతాకాలం’ వంటి చిత్రాల్లో ఆమె నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే సరైన సక్సెస్ మాత్రం ఇప్పటి వరకు ఆమె ఖాతాలో పడలేదు. ఆమె కీలక పాత్రలో నటించిన ‘భూ’ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి స్పందననే రాబట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*VarunLavanya: నిశ్చితార్థం అయిపోయింది.. సాంప్రదాయ పద్ధతిలో లావణ్య.. ఫొటోలు వైరల్

*Mahi V Raghav: ‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అయినా ముందే హెచ్చరిక చేశాం

*Karthika: రెజీనా చదివే బుక్‌లో.. దెయ్యంగా కాజల్ అగర్వాల్!

*Anasuya: అలసిపోయాను.. ఇక ఆపేస్తున్నాను

*Pawan Kalyan OG: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌‌‌పై ఫ్యాన్స్ ట్వీట్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

*Hero Siddharth: ఓ పెద్దావిడను చూసి భోరున ఏడ్చేసిన సిద్ధార్థ్.. ఆమె ఎవరో తెలుసా?

Updated Date - 2023-06-09T22:19:14+05:30 IST