Dunki Drop 4 vs Salaar: ‘సలార్’కి పోటీగా ‘డంకీ’.. పోటాపోటీగా ట్రైలర్స్

ABN , First Publish Date - 2023-12-07T09:44:40+05:30 IST

డిసెంబర్ 21న షారుక్ ఖాన్ నటించిన ‘డంకీ’ విడుదల కాబోతుంటే.. ఆ మరుసటి రోజే (డిసెంబర్ 22) రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమా మొదటి నుంచి ఒకదానితో ఒకటి పోటీ అన్నట్లుగా విడుదల విషయంలో పోటీ పడుతూ వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఈ చిత్రాల ట్రైలర్ కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాల పోటీ మాములుగా ఉండదనేలా వ్యూస్‌ని రాబట్టి అంచనాలు పెంచేశాయి.

Dunki Drop 4 vs Salaar: ‘సలార్’కి పోటీగా ‘డంకీ’.. పోటాపోటీగా ట్రైలర్స్
Prabhas and Shah Rukh Khan

డిసెంబర్ 21న షారుక్ ఖాన్ నటించిన ‘డంకీ’ (Dunki) విడుదల కాబోతుంటే.. ఆ మరుసటి రోజే (డిసెంబర్ 22) రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ (Salaar) విడుదల కానుంది. ఈ రెండు సినిమా మొదటి నుంచి ఒకదానితో ఒకటి పోటీ అన్నట్లుగా విడుదల విషయంలో పోటీ పడుతూ వస్తున్నాయి. వాస్తవానికి ‘సలార్’ సినిమా సెప్టెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ దర్శకుడు మళ్లీ ప్యాచ్ వర్క్ అంటూ కొన్ని సీన్లు రీ షూట్ చేయాల్సి రావడంతో మళ్లీ వాయిదా పడి, డిసెంబర్ 22కి ఫిక్సయింది. తాజాగా ఈ రెండు సినిమాల ట్రైలర్స్ విడుదలయ్యాయి.

Prabhas.jpg

ఈ రెండు ట్రైలర్స్ కూడా వ్యూస్ పరంగా పోటాపోటీగా రికార్డ్స్ నెలకొల్పి.. అమాంతం సినిమాపై అంచనాలను పెంచేశాయి. ‘డంకీ డ్రాప్ 4’ (Dunki Drop 4) అంటూ వచ్చిన షారుక్ (Shah Rukh Khan) సినిమా ట్రైలర్ 24 గంటల్లో 103 మిలియన్ల వ్యూస్ రాబడితే.. ప్రభాస్ (Prabhas) ‘సలార్’ ట్రైలర్ 24 గంటల్లో 116 మిలియన్ల వ్యూస్ రాబట్టి అత్యధికంగా ప్రేక్షకులు చూసిన ట్రైలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ రెండు సినిమాలు వెంటవెంటనే రావడం పట్ల.. ఆయా హీరోలు అభిమానులు నిరాశలో ఉన్నారు. ఎందుకంటే, రెండు సినిమాలకు సోలో రిలీజ్ పడితే.. రికార్డ్ కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు రెవిన్యూని షేర్ చేసుకోవాలి. అందులోనూ ఒక రోజు ముందే వస్తున్న ‘డంకీ’ థియేటర్లను ఆక్రమిస్తే.. ‘సలార్’కి థియేటర్ల కౌంట్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇలా ప్రతీది ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. రెండు సినిమాలు ఒక వారం గ్యాప్‌లో వస్తే మాత్రం.. హీరోలిద్దరూ రికార్డులు కొట్టేవారంటా.. ట్రైలర్ విడుదల తర్వాత సోషల్ మీడియాలో కామెంట్స్ విపరీతంగా దర్శనమిస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాల ప్రభావం.. బాక్సాఫీస్‌‌పై ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. (Dunki vs Salaar)


SRK.jpg

బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ వంటి వారంతా నటించిన ‘డంకీ’ సినిమాని ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శృతి హాసన్, టినూ ఆనంద్, బాబీ సింహ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Naa Saami Ranga: నాగ్ ఎత్తికెళ్లిపోతాడంట.. జర జాగ్రత్త!

********************************

*Pushpa Kesava: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసులో ‘పుష్ప’ నటుడు అరెస్ట్

**********************************

*B-Town: రోడ్డుపై తాగి తూలిన హీరో.. అసలు నిజం ఏమిటంటే..?

**************************************

Updated Date - 2023-12-07T09:44:41+05:30 IST