B-Town: రోడ్డుపై తాగి తూలిన హీరో.. అసలు నిజం ఏమిటంటే..?

ABN , First Publish Date - 2023-12-06T15:38:23+05:30 IST

బాలీవుడ్ యాక్టర్ సన్నీడియోల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సన్నీ డియోల్ బాగా తాగేసి ఉన్నారు. ముంబైలోని జుహు సర్కిల్‌లో నడిరోడ్డుపై వాహనాలకు ఎదురుగా ఆయన ఊగుతూ వెళుతుంటే.. ఓ ఆటో అతను ఆపి.. సన్నీడియోల్‌ని ఎక్కించుకుంటున్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుండగా.. స్వయంగా సన్నీనే ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చారు.

B-Town: రోడ్డుపై తాగి తూలిన హీరో.. అసలు నిజం ఏమిటంటే..?
Sunny Deol at Mumbai Juhu Streets

బాలీవుడ్ యాక్టర్ సన్నీడియోల్ (Sunny Deol) వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సన్నీ డియోల్ బాగా తాగేసి ఉన్నారు. ముంబైలోని జుహు సర్కిల్‌లో నడిరోడ్డుపై వాహనాలకు ఎదురుగా ఆయన ఊగుతూ వెళుతుంటే.. ఓ ఆటో అతను ఆపి.. సన్నీడియోల్‌ని ఎక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది. ఈ స్టార్ యాక్టర్‌కి ఏమైందంటూ ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు. బాధ్యత లేకుండా ఇలా సీనియర్లు ప్రవర్తిస్తే.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. (Sunny Deol in Mumbai Streets)

అయితే అసలు విషయం తెలిసి అంతా నాలుక్కరుచుకుంటున్నారు. ఇప్పటి వరకు సన్నీడియోల్ ఎక్కడా ఇటువంటి పనులు చేయలేదు. ఆయన వ్యక్తిత్వం హుందాగానే ఉంటుంది. అలాంటిది.. అసలు ఎందుకిలా జరిగిందనేది ఆలోచించకుండా ఎవరిష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఆయన తాగేసి రోడ్డు మీదకు రాలేదు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఇదంతా జరిగిందని.. స్వయంగా సన్నీడియోలే వివరణ ఇచ్చారు.


Sunny-Deol.jpg

విషయంలోకి వస్తే.. సన్నీడియోల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సఫర్’ (Safar). ఈ సినిమా కోసం ముంబైలోని జుహు సర్కిల్‌లో ఓ సన్నివేశాన్ని అర్థరాత్రి చిత్రీకరించారు. అయితే కెమెరాలు పక్కన కనిపించకపోవడంతో అంతా ఇది రియల్ అనుకున్నారు. వైరల్ అవుతున్న క్లిప్‌లో కూడా కెమెరాలు కనబడకుండా.. కేవలం సన్నీడియోల్‌ని మాత్రమే కవర్ చేస్తున్నట్లుగా వీడియో లీకైంది. అంతే అంతా ట్రోలింగ్ మొదలెట్టారు. దీంతో సన్నీడియోల్ రియల్ వీడియోని షేర్ చేసి.. ఇది షూటింగ్ అంటూ క్లారిటీ ఇచ్చారు. సన్నీడియోల్ గురించి చెప్పాలంటే.. ఆయన పలు సందర్భాల్లో ఆల్కహాల్ (Alcohol) తీసుకోనని చెప్పి ఉన్నారు. అంతే.. మ్యాటర్ క్లియర్.


ఇవి కూడా చదవండి:

====================

*Asha Bhosle and Mumtaz: ముంతాజ్, ఆశా భోంస్లేల డ్యాన్స్ వీడియో వైరల్.. రెండు కళ్లు చాలడం లేదంటూ..

****************************************

*Vishal: చెన్నై మేయర్‌పై విశాల్ సెటైర్లు.. ఘాటుగా స్పందించిన మేయర్

************************************

*Nithiin: ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం..

*************************************

Updated Date - 2023-12-06T17:34:00+05:30 IST