Pushpa Kesava: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసులో ‘పుష్ప’ నటుడు అరెస్ట్

ABN , First Publish Date - 2023-12-06T18:17:13+05:30 IST

‘పుష్ప’ సినిమాలో మచ్చా మచ్చా అంటూ అల్లు అర్జున్ పక్కన తిరిగిన నటుడు జగదీశ్ (సినిమాలో పేరు కేశవ)‌పై పోలీస్ కేసు నమోదైంది. ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకున్న కేసులో జగదీశ్‌ని నిందితుడిగా పోలీసులు తేల్చారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

Pushpa Kesava: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసులో ‘పుష్ప’ నటుడు అరెస్ట్
Pushpa Actor Jagadeesh

‘పుష్ప’ సినిమాలో మచ్చా మచ్చా అంటూ అల్లు అర్జున్ పక్కన తిరిగిన నటుడు జగదీశ్ (సినిమాలో పేరు కేశవ)‌పై పోలీస్ కేసు నమోదైంది. ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకున్న కేసులో జగదీశ్‌ని నిందితుడిగా పోలీసులు తేల్చారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

విషయంలోకి వస్తే.. ‘పుష్ప’ సినిమాలో కేశవగా నటించిన నటుడు జగదీశ్‌.. ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్నప్పడు కొన్ని ఫొటోలను తీసి ఆమెను బెదిరించినట్లుగా.. అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నవంబర్ 27వ తేదీన సదరు మహిళకు తెలియకుండా ఫొటోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టడంతో.. ఆ మహిళ మనస్తాపానికి గురై నవంబర్ 29వ తేదీన ఆత్మహత్య చేసుకుంది.


Jagadeesh.jpg

ఆమె ఆత్మహత్య అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం జగదీశ్ అని తేల్చారు. దీంతో అతనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ‘పుష్ప’ సినిమా అంతా జగదీశ్ వాయిస్ ఓవర్‌తోనే నడిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అతను బిజీ నటుడిగా మారారు. కానీ ఇలా.. ఓ మహిళ విషయంలో దారుణంగా ప్రవర్తించి.. జగదీశ్ పోలీసులకు దొరికిపోయాడు.


ఇవి కూడా చదవండి:

====================

*Asha Bhosle and Mumtaz: ముంతాజ్, ఆశా భోంస్లేల డ్యాన్స్ వీడియో వైరల్.. రెండు కళ్లు చాలడం లేదంటూ..

****************************************

*Vishal: చెన్నై మేయర్‌పై విశాల్ సెటైర్లు.. ఘాటుగా స్పందించిన మేయర్

************************************

Updated Date - 2023-12-06T18:28:19+05:30 IST