Naa Saami Ranga: నాగ్ ఎత్తికెళ్లిపోతాడంట.. జర జాగ్రత్త!

ABN , First Publish Date - 2023-12-06T20:14:03+05:30 IST

కింగ్ నాగార్జున అక్కినేని, కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో చేస్తున్న ‘నా సామిరంగ’ సినిమాని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు. దర్శకుడిగా విజయ్ బిన్నికి ఇది తొలి చిత్రం. ఆశికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది’ని త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ తెలియజేశారు.

Naa Saami Ranga: నాగ్ ఎత్తికెళ్లిపోతాడంట.. జర జాగ్రత్త!
King Nagarjuna

కింగ్ నాగార్జున అక్కినేని (King Nagarjuna Akkineni), కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని (Vijay Binni) దర్శకత్వంలో చేస్తున్న ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) సినిమాని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు. దర్శకుడిగా విజయ్ బిన్నికి ఇది తొలి చిత్రం. ఆశికా రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్రను వరలక్ష్మిగా తాజాగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు విడుదల చేసిన గ్లింప్స్‌లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కట్టిపడేసింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ను మేకర్స్ వదిలారు.

ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది’ త్వరలో విడుదల కానుంది. లిరికల్ వీడియోను లాంచ్ చేయడానికి ముందు పాట ప్రోమోను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ పాట గురించి తెలియజేస్తూ.. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రైతు గెటప్‌లో నాగార్జున చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తున్నారు. వ్యవసాయ భూమిలో ట్రాక్టర్‌ పై కాలు వేసి బీడీ కాలుస్తూ మాస్ వైబ్‌తో ఆకట్టుకున్నారు నాగార్జున. (Naa Saami Ranga First Single Update)


King-Nag.jpg

గ్లింప్స్‌లో అద్భుతమైన బీజీఎంతో మంత్రముగ్ధులను చేసిన ఎంఎం కీరవాణి (MM Keeravani) ఈ చిత్రంకు అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను అందిస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఆల్బమ్‌లోని అన్ని పాటలకు చంద్రబోస్ (Chandrabose) లిరిక్స్ రాయడం విశేషం. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి మ్యాసివ్ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మరోవైపు ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. 2024 సంక్రాంతి కానుకగా సినిమాని గ్రాండ్‌గా విడుదల చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Pushpa Kesava: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసులో ‘పుష్ప’ నటుడు అరెస్ట్

**********************************

*B-Town: రోడ్డుపై తాగి తూలిన హీరో.. అసలు నిజం ఏమిటంటే..?

**************************************

*Asha Bhosle and Mumtaz: ముంతాజ్, ఆశా భోంస్లేల డ్యాన్స్ వీడియో వైరల్.. రెండు కళ్లు చాలడం లేదంటూ..

****************************************

Updated Date - 2023-12-06T20:14:36+05:30 IST