Samantha: షూటింగ్స్‌కే గ్యాప్.. సోషల్ మీడియాకు కాదు.. షేకాడిస్తోంది

ABN , First Publish Date - 2023-07-24T16:28:55+05:30 IST

టాలెంటెడ్ నటి సమంత కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లుగా ఇటీవల చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ అన్నింటినీ పూర్తి చేసిన సమంత.. షూటింగ్స్ చేయని వాటికి మనీ రిటన్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక షూటింగ్స్ బ్రేక్ ఇవ్వడంతో.. తను చేస్తున్న ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ.. సోషల్ మీడియాని షేకాడిస్తోంది.

Samantha: షూటింగ్స్‌కే గ్యాప్.. సోషల్ మీడియాకు కాదు.. షేకాడిస్తోంది
Heroine Samantha

టాలెంటెడ్ నటి సమంత (Samantha) కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లుగా ఇటీవల చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ అన్నింటినీ పూర్తి చేసిన సమంత.. షూటింగ్స్ చేయని వాటికి మనీ రిటన్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ గ్యాప్‌ ఆమె ఎందుకు తీసుకుంది? మళ్లీ ఆమె సినిమాలు చేయడానికి ఎప్పుడు వస్తుంది? అనేలా సమంత నుంచి ఆ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఒకటే వార్తలు. అయితే ఈ గ్యాప్‌లో ఆమె కనిపించకుండా వెళ్లిపోతుందేమో అని ఆమె ఫ్యాన్స్ కూడా ఎంతో ఆందోళన చెందారు. (Heroine Samantha)


కానీ.. సినిమాలు చేసేటప్పుడు కూడా ఉండనంత యాక్టివ్‌గా ఇప్పుడు సమంత సోషల్ మీడియాలో ఉంటుంది. దీనికి ఫ్యాన్స్ యమా ఆనందంగా ఉన్నారు. ధ్యానం చేస్తున్న ఫొటోలతో రీసెంట్‌గా అందరి మనసులు దోచేసిన సమంత.. ఇప్పుడు పోస్ట్ చేసిన ఓ వీడియోతో అయితే.. ఏకంగా కుర్రకారు గుండెలు పిండేసింది. ఇందులో ఎంత క్యూట్‌గా ఉందంటే.. కంటి చూపులతోనే కందిపోతుందేమో అన్నంత గ్లామరస్‌గా ఉంది సమంత. ఈ వీడియోని చూసిన వారంతా.. ‘వావ్.. బ్యూటీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో పోస్ట్‌లో ‘డ్రీమ్ ఆన్’ అంటూ ప్రకృతితో మమేకమవుతున్న కొన్ని ఫొటోలని సమంత షేర్ చేసింది. అవి కూడా టాక్‌ ఆఫ్ ద సోషల్ మీడియా అవుతున్నాయి. (Samantha Insta Post Viral)

ముఖ్యంగా సమంత షేర్ చేసిన వీడియోలో ఆమె చాలా స్టైలిష్‌గా ఉంది. కురులను అటు, ఇటు ఆడిస్తూ.. చిన్న చిరునవ్వుతో హృదయాలను దోచేసింది. స్లో మోషన్‌లో ప్లే అవుతున్న ఆ వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. మొత్తంగా అయితే సమంత తనకున్న అనారోగ్యాన్ని ఎదుర్కొనేందుకు మంచి ప్లానింగ్‌నే ఎన్నుకుందనేలా.. ఇలాంటి ఫొటోలు, వీడియోలతో తెలియజేస్తుంది. త్వరలోనే అమె చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లనుందనేలా టాక్ వినబడుతోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Honey Rose: బోల్డ్‌ పాత్రలో.. ఇదే ఫస్ట్ టైమ్

**************************************

*Ruhani Sharma: నేనా టైప్ కాదు.. కానీ అది ముఖ్యం

**************************************

*Bhagavanth Kesari: ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది

**************************************

*Amala Paul: మళ్లీ స్పాట్‌లైట్‌లోకి అమల.. ఫొటోస్‌‌తో మతి పోగొట్టేసిందిగా!

**************************************

*SS Rajamouli: ‘కల్కి 2989 AD’ గ్లింప్స్ రాజమౌళికి నచ్చిందా.. ఎలా స్పందించారంటే?

**************************************

Updated Date - 2023-07-24T16:30:36+05:30 IST