Salaar: రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్.. రెండో రోజూ కలెక్షన్ల ‘వరదే’!

ABN , Publish Date - Dec 24 , 2023 | 03:02 PM

రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా భారీ అంచనాలతో వచ్చిన ‘సలార్‌’ చిత్రం బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపుతోంది. సంచలన వసూళ్లను సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రికార్డు స్థాయిలో రూ. 178.7 కోట్ల వసూళ్లను రాబట్టిందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో రోజులకు గానూ ఈ సినిమా వసూళ్లు చేసిన కలెక్షన్ల వివరాలను కూడా మేకర్స్ వదిలారు.

Salaar: రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్.. రెండో రోజూ కలెక్షన్ల ‘వరదే’!
Prabhas in Salaar

రెబల్ స్టార్ ప్రభాస్‌ (Rebel Star Prabhas) హీరోగా భారీ అంచనాలతో వచ్చిన ‘సలార్‌’ (Salaar) చిత్రం బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపుతోంది. సంచలన వసూళ్లను సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రికార్డు స్థాయిలో రూ. 178.7 కోట్ల వసూళ్లను రాబట్టిందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారానే దాదాపు రూ. 90 కోట్ల వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘సలార్‌’ నిలిచింది. తాజాగా మేకర్స్ రెండు రోజుల కలెక్షన్ల వివరాలను కూడా విడుదల చేశారు. రెండు రోజులకుగానూ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 295.7 కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా చెబుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. (Salaar 2 Days Collections)

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ‘సలార్’ రెండో రోజు కూడా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో రోజు ఆదివారం, నాలుగో రోజు క్రిస్మస్ హాలీడే కూడా యాడవ్వడంతో.. మొత్తంగా నాలుగు రోజులకు ‘సలార్’ కలెక్షన్స్ రికార్డ్స్ బ్రేక్ చేయడం కాయమని, కలెక్షన్ల ‘వరద’ కన్ఫర్మ్ అని ట్రేడ్ నిపుణులు చెబుతుండటం విశేషం. ‘బాహుబలి’ (Bahubali) తర్వాత సరైన సినిమా లేక నిరాశలో ఉన్న ప్రభాస్ అభిమానులకు.. ‘సలార్’ చిత్రం ఫుల్ మీల్స్ ఇచ్చేందనే చెప్పుకోవాలి. సినిమా చూసిన వాళ్లంతా.. ప్రభాస్ కటౌట్‌కి సరిపడా సినిమా ఇదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. (Salaar World Wide Collections)


Salaar.jpg

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో వసూళ్లు మరింతగా పుంజుకుంటున్నాయి. ప్రభాస్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘సలార్‌’ నిలుస్తుందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల రికార్డులు బద్దలవుతున్నాయి. ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రానికి రెండో భాగాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ‘సలార్‌’లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా వంటి వారు కీలకపాత్రలు పోషించగా.. శృతి హాసన్‌ (Shruti Haasan) హీరోయిన్‌గా నటించింది. (#SalaarBoxOffice)


ఇవి కూడా చదవండి:

====================

*Sriya Reddy: పవన్ ‘ఓజీ’లో చేస్తున్నందుకు అంతా ఏమంటున్నారంటే?

*********************************

*Ram Charan ISPL: ఐపీఎల్‌లో కాదు ఐఎస్‌పీఎల్‌లో రామ్ చరణ్‌కు టీమ్.. హైదరాబాదే!

*******************************

*RGV: ‘వ్యూహం’ బెడిసికొట్టింది.. వర్మా.. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు

******************************

*Sharvari Wagh: ‘నీ పేరు ఏంటని?’ దీపికా పదుకొనే అడిగింది

********************************

*Game Changer: మెగాభిమానులకు నిరాశ.. ఎన్టీఆర్ సినిమా తర్వాతే చరణ్ ఫిల్మ్

*****************************

Updated Date - Dec 24 , 2023 | 03:11 PM