Sriya Reddy: పవన్ ‘ఓజీ’లో చేస్తున్నందుకు అంతా ఏమంటున్నారంటే?

ABN , Publish Date - Dec 24 , 2023 | 01:18 PM

శ్రియా రెడ్డి.. ఈ పేరు ఇప్పుడందరికి బాగా దగ్గరైంది. అందుకు కారణం మాత్రం ‘సలార్’ సినిమానే. రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తోంది. ఇందులో ‘రాధారమ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో శ్రియా రెడ్డి నటించారు. ఈ సినిమా విజయానందంలో ఉన్న శ్రియా రెడ్డి.. తన తాజా ఇంటర్వ్యూలో తర్వాత చేస్తున్న ‘ఓజీ’ విశేషాలను కూడా చెప్పుకొచ్చారు.

Sriya Reddy: పవన్ ‘ఓజీ’లో చేస్తున్నందుకు అంతా ఏమంటున్నారంటే?
Actress Sriya Reddy

శ్రియా రెడ్డి (Sriya Reddy).. ఈ పేరు ఇప్పుడందరికి బాగా దగ్గరైంది. అందుకు కారణం మాత్రం ‘సలార్’ (Salaar) సినిమానే. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తోంది. ఇందులో ‘రాధారమ’ (#radharama) అనే పవర్‌ఫుల్ పాత్రలో శ్రియా రెడ్డి నటించింది. హీరో విశాల్‌ (Hero Vishal)కి వదిన (విశాల్ అన్న విక్రమ్ కృష్ణ భార్య) అయిన శ్రియా రెడ్డి.. గతంలో అతని ‘పొగరు’ (Pogaru) సినిమాలో పవర్ ఫుల్ రోల్‌లో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె ‘సలార్’ వంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘సలార్’ ఒక్కటే కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ (OG) సినిమాలోనూ ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలలోని పాత్రలతో ఆమె మున్ముందు మరింత బిజీ నటిగా మారే అవకాశం అయితే లేకపోలేదు. ఇక ‘సలార్’‌లో తన పాత్రని అంతా చూశారు.. రాబోయే ‘ఓజీ’లో తన పాత్ర ఎలా ఉండబోతుందో.. చిన్న హింట్ ఇచ్చారు శ్రియా రెడ్డి. తన తాజా ఇంటర్వ్యూలో పవర్ స్టార్ ‘ఓజీ’ గురించి ఆమె చెప్పుకొచ్చారు.

‘‘ఓజీ.. ఈ సినిమా గురించి ఏం చెప్పాలి. దర్శకుడు సుజిత్ ఓ అద్భుతమైన కథని రెడీ చేశారు. ఇందులోనూ నేను కూడా భాగమైనందుకు చాలా చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే నా పాత్ర తీరుతెన్నులు ఈ సినిమాకి చాలా కీలకంగా ఉంటాయి. నెగిటివ్ రోల్ కాదు కానీ.. చాలా షేడ్స్ ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానులతో కలిసి చూసేందుకు ఎంతగానో వేచి చూస్తున్నాను’’ అంటూ ఒక్కసారిగా ఓజీపై క్రేజ్‌ని శ్రియా రెడ్డి డబుల్ చేశారు. అంతేకాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆమె చెప్పిన విషయం వింటే.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవడం కాయం. (Sriya Reddy About OG)


Sriya-Reddy.jpg

‘‘పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌‌గారిని కలిసే వరకూ ఆయన అంత పెద్ద స్టార్‌ అనే విషయం తెలియదు. ఆయన స్టార్‌డమ్‌ను చూసి షాకయ్యాను. అంతకుముందు నేను ఎప్పుడూ అలాంటి స్టార్‌డమ్ చూడలేదు. ‘ఓజీ’లో నటిస్తున్నానని తెలిసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా.. అభిమానులు నా చుట్టూ చేరి.. ‘మీరు మా దేవుడితో వర్క్‌ చేస్తున్నారు’ అని అడుగుతుంటే ఆశ్చర్యపోయేదాన్ని. అంత విశేష ప్రజాదరణ ఆయనకు ఉంది. పవన్ కళ్యాణ్‌గారిని సెట్‌లో కలిసినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు. ఆయనది చాలా గొప్ప మనసు. పవర్‌స్టార్‌తో కలిసి వర్క్ చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అని శ్రియా రెడ్డి చెప్పుకొచ్చారు. (Sriya Reddy Talks about Pawan Kalyan Craze)


ఇవి కూడా చదవండి:

====================

*Ram Charan ISPL: ఐపీఎల్‌లో కాదు ఐఎస్‌పీఎల్‌లో రామ్ చరణ్‌కు టీమ్.. హైదరాబాదే!

*******************************

*RGV: ‘వ్యూహం’ బెడిసికొట్టింది.. వర్మా.. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు

******************************

*Sharvari Wagh: ‘నీ పేరు ఏంటని?’ దీపికా పదుకొనే అడిగింది

********************************

*Game Changer: మెగాభిమానులకు నిరాశ.. ఎన్టీఆర్ సినిమా తర్వాతే చరణ్ ఫిల్మ్

*****************************

Updated Date - Dec 24 , 2023 | 01:18 PM