Sharvari Wagh: ‘నీ పేరు ఏంటని?’ దీపికా పదుకొనే అడిగింది

ABN , Publish Date - Dec 24 , 2023 | 10:17 AM

అసిస్టెంట్‌ డైరక్టర్‌ నుంచి కథానాయికగా మారింది బాలీవుడ్ బ్యూటీ శార్వరీ వాఘ్‌. ఈ బ్యూటీ తన తొలి చిత్రం ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’తో ఫిల్మ్‌ఫేర్‌, ఐఫా అవార్డులు అందుకుంది. ఫొటోషూట్స్‌, స్నేహితులతో గడిపిన క్షణాలు, పండక్కి వండిన వంటకాలను.. తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది శార్వరీ. తాజాగా ఆమె తనకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.

Sharvari Wagh: ‘నీ పేరు ఏంటని?’ దీపికా పదుకొనే అడిగింది

అసిస్టెంట్‌ డైరక్టర్‌ నుంచి కథానాయికగా మారింది బాలీవుడ్ బ్యూటీ శార్వరీ వాఘ్‌ (Sharvari Wagh). ఈ బ్యూటీ తన తొలి చిత్రం ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ (Bunty Aur Babli 2)తో ఫిల్మ్‌ఫేర్‌, ఐఫా అవార్డులు అందుకుంది. ఫొటోషూట్స్‌, స్నేహితులతో గడిపిన క్షణాలు, పండక్కి వండిన వంటకాలను.. తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది శార్వరీ. ఈ స్టన్నింగ్‌ బ్యూటీకి ఇప్పుడిప్పుడే సోషల్‌ మీడియాలో మంచి ఫేమ్‌ వస్తోంది. పదిలక్షల ఫాలోయర్స్ ఉన్న శార్వరి తన అప్‌డేట్స్‌కు చక్కని వేదిక సోషల్‌ మీడియా అంటుంది. ప్రస్తుతం ఆమె.. ‘మహారాజా’, ‘వేదా’ చిత్రాలతో పాటు మరో మూడు స్ర్కిప్టుల్లో సంతకాలు చేయటానికి రెడీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న శార్వరి గురించి కొన్ని విషయాలు..

Sharvari-Wagh-4.jpg

మా కుటుంబం సహకారం..

యష్‌రాజ్‌ ఫిల్మ్‌ కథానాయికగా అది కూడా సైఫ్‌ అలీఖాన్‌, రాణీముఖర్జీ లాంటి సీనియర్‌ నటులతో అవకాశం రావటం అదృష్టంగా భావించా. నాకు బాగా గుర్తుంది. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్టూడియోలో సినిమా చూస్తున్నాం. మా అమ్మ, చెల్లి ఏడుస్తున్నారు. వాస్తవానికి ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ హాస్యచిత్రం. దర్శకుడు వరుణ్‌కు అర్థం కాలేదు. క్షణాల్లో నేను తేరుకున్నా. ‘నన్ను తెరమీద చూడాలనే కోరిక గాఢంగా ఉండేది. ఏడేళ్ల తర్వాత నెరవేరడంతో ఎమోషన్‌ అయ్యారు’ అన్నాను. ఆ ఏడేళ్ల కష్టం.. ఒక్కసారిగా మర్చిపోయా. నేను కథానాయిక అవ్వటానికి కుటుంబ సహకారం, ప్రోత్సాహం ఉంది. స్నేహితుల్లా ఉంటాం. కష్టమైన కాలాల్లో అండగా నిలిచారు. (Sharvari Wagh Interview)


Sharvari-Wagh-3.jpg

ఏడేళ్ల తర్వాత నటించే..

శార్వరీకి మొదటి చిత్రం అవార్డులు తెచ్చిపెట్టింది. దీంతో పాటు తొలి వెబ్‌సిరీస్‌ ‘ది ఫర్‌గాటెన్‌ ఆర్మీ’ నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే దీని వెనకాల ఆమె కృషి ఎంతో ఉంది. 2014లో తొలి ఆడిషన్‌ జరిగింది. 2021లో తొలి చిత్రం జరిగింది. ఈ ఏడేళ్లలో ఆమె ఎంతో స్ట్రగుల్‌ అనుభవించింది. ‘నేను ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. ఫలానా యాడ్‌, ఫలానా పాత్ర నాకే కావాలని ఎంతో మంది వచ్చేవారు. అందరం ఒకే చోట కూర్చుని ఎదురు చూసేవాళ్లం. అది ఒక్కరికే వరించేది. ఆడిషన్స్‌ స్టార్ట్‌ చేసిన ఏడేళ్ల తర్వాత సినిమా వస్తే చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్తారు. అయితే కుటుంబం సహకారం ఉండటం వల్ల నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలనుకున్నా. అసిస్టెంట్‌ డైరక్టర్‌గా ‘ప్యార్‌ కా పంచనామా 2’, ‘బాజీరావ్‌ మస్తానీ’ చిత్రాలకు పని చేశా. ఆ సమయంలో కంటెంట్‌ అసలైన కింగ్‌ అని తెలుసుకున్నా. ఆ తర్వాత ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ షూటింగ్‌ చేశా. కరోనా వల్ల ఆలస్యమైంది. 2021లో విడుదలై మంచి పేరు తెచ్చిపెట్టిందా చిత్రం. ఆ ఏడేళ్లలో సహనంగా హార్డ్‌వర్క్‌ చేశా. సినిమా నటిగా చేయాలనే కల ఒక్కటే ఉండేది. చివరికి సాధించా’నంటుంది శార్వరీ. (Sharvari)

Sharvari-Wagh-2.jpg

ఇదీ నేపథ్యం..

మరాఠీ కుటుంబానికి చెందిన శార్వరీ ముంబైలో పుట్టి పెరిగింది. తన నాన్న శైలేష్‌ వాఘ్‌ రియల్‌ ఎస్టేట్‌లో బిల్డర్‌. అమ్మ నమ్రతా ఆర్కిటెక్‌. తన తాతయ్య మనోహర్‌ జోషి(1995-1999) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. ‘‘మా ఇంట్లో నటిని అవుతానని చెప్పలేదు. అయితే మనసులో మాత్రం తెరమీద కనబడాలనే కోరిక ఉండేది. ఏమంటారోనని చెప్పకపోయేదాన్ని. మాధురీ దీక్షిత్‌ సినిమాలంటే ఇష్టపడేదాన్ని. ఆమెలా డ్యాన్సులు వేసేదాన్ని. జుట్టు ఆమెలా ఉండాలని కలలు కనేదాన్ని. కాలేజీలో ‘ఫ్రెష్‌ ఫేస్‌’గా ఎంపికయ్యా. ఆ రోజు ఆనందానికి అవధుల్లేవు. కొన్ని నాటకాల్లో నటించేదాన్ని. నా చురుకుదనం, పాటలు పాడటం చూసి... ఓ రోజు అమ్మానాన్న నన్ను కూర్చోబెట్టి అడిగారు. యాక్టింగ్‌ చేస్తావా? అని అడిగారు. ఆ తర్వాతనే నాలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ తర్వాత సినిమా నటి అవుతానని ఇంట్లో చెప్పాను’’. (Sharvari Wagh Bollywood Heroine)


Sharvari-Wagh.jpg

ఆ రోజు హడావిడి అంతా ఇంతా కాదు...

ఆడిషన్‌ ఇచ్చినంత మాత్రాన సినిమాల్లోకి ఎంపిక చేయాలనే నిబంధన లేదు. 2014 తర్వాత సినిమాల్లో ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలని సంజయ్‌లీలా భన్సాలీగారి దగ్గర అసిస్టెంట్‌గా జాయినయ్యా. మీకో విషయం చెప్పాలి. ‘బాజీరావ్‌ మస్తానీ’ షూటింగ్‌ సమయంలో దీపికా, రణ్‌వీర్‌ సీన్స్‌ గురించి ఎక్స్‌ప్లయిన్‌ చేసేదాన్ని. వారిద్దరితో ఇంటరాక్షన్‌ ఉండేది. సీన్‌ చెప్పటం జరిగాక.. దూరంగా వెళ్లటం చేసేదాన్ని యథావిధిగా. అప్పుడే నా స్పార్క్‌ చూసి ‘నీ పేరు ఏంటని?’ దీపికా అడిగి తెలుసుకుంది. ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. దీపికా.. నా పేరు అడిగిందని మిత్రులందరికీ చెప్పాను. సినిమా వెనకాల పనిచేయటం వల్ల నటులు మనలాంటివారే అనిపించింది. కథ గురించి అవగాహన వచ్చింది. నటిగా ఆలస్యం అయినా ఈ బ్యాక్‌గ్రౌండ్‌ భవిష్యత్‌లో పనికొస్తుందేమో అంటుంది శార్వరీ. మాధురీ దీక్షిత్‌ పుణ్యాన డ్యాన్స్‌ అలవడింది. కథక్‌ కూడా నేర్చుకున్నా. అప్పుడే డ్యాన్స్‌ మీద పట్టు దొరికింది. కీబోర్డు కూడా ప్లే చేస్తాను. కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకున్నా. ప్రతి రోజూ కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఆలోచన నాది. నేర్చుకున్నవన్నీ నా కెరీర్‌కు తోడ్పడ్డాయి. (Bollywood Beauty Sharvari Wagh)

Sharvari-Wagh-5.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Game Changer: మెగాభిమానులకు నిరాశ.. ఎన్టీఆర్ సినిమా తర్వాతే చరణ్ ఫిల్మ్

*****************************

*Ala Ninnu Cheri: అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలోకి ‘అలా’ వచ్చేసింది

***************************

*Animal: ‘యానిమల్’లో రణబీర్ తల్లిగా చేసిన నటి వయసు ఎంతో తెలుసా? హీరో రణబీర్ కంటే..?

***************************

*Mohan Babu: కలెక్షన్ కింగ్ నుండి ‘కన్నప్ప’ అప్‌డేట్

***************************

*Bandi Trailer: నగ్నంగా టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతోన్న ట్రైలర్

*****************************

Updated Date - Dec 24 , 2023 | 10:17 AM