Game Changer: మెగాభిమానులకు నిరాశ.. ఎన్టీఆర్ సినిమా తర్వాతే చరణ్ ఫిల్మ్

ABN , Publish Date - Dec 23 , 2023 | 10:35 PM

‘సలార్’ సినిమా థియేటర్ వద్ద సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలకు సంబంధించి స్పందించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదల అని తెలియజేశారు. దీంతో మెగాభిమానులు కొందరు ఆనందం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

Game Changer: మెగాభిమానులకు నిరాశ.. ఎన్టీఆర్ సినిమా తర్వాతే చరణ్ ఫిల్మ్
Game Changer Movie Poster

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా తర్వాత కొరటాల శివ (Koratala Siva)తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) చేయాల్సిన సినిమా ‘దేవర’ (Devara) ప్రారంభం కావడానికి చాలా టైమ్ పట్టింది. ఒకానొక దశలో ‘దేవర’ సినిమాపై బీభత్సంగా వార్తలు వైరల్ అయ్యాయి. అదే టైమ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని మరో హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) మాత్రం తమిళ సంచలన దర్శకుడు శంకర్‌ (Shankar)తో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా షూట్ మొదలెట్టేశారు. దీంతో ఇరు హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేసుకున్నారు. కారణం ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కాకపోవడమే. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుగా సినిమా షూట్ ప్రారంభించినా.. విడుదల విషయంలో మాత్రం ఎన్టీఆర్ సినిమానే ముందు విడుదల కాబోతోంది. ‘దేవర’ సినిమా రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతుండగా.. మొదటి పార్ట్‌ని 5 ఏప్రియల్‌, 2024లో (Devara Release Date) కచ్చితంగా విడుదల చేస్తామని మేకర్స్ బల్లగుద్ది మరీ ప్రకటించారు. మరో వైపు రామ్ చరణ్ (Ram Charan) చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మాత్రం ఇంత వరకు విడుదల తేదీ ఎప్పుడనేది తెలియరాలేదు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్‌డేట్ వస్తుందా? అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సినిమా సాంగ్ వదులుతామని చెప్పి.. అది కూడా చేయలేదు.


Ram-Charan.jpg

ఇక ఇప్పుడు నిర్మాత దిల్ రాజు (Dil Raju) ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు సంబంధించి స్పందించారు. ‘సలార్’ సినిమా‌ని చూసేందుకు వచ్చిన దిల్ రాజుని.. మెగాభిమానులు చుట్టుముట్టి.. ‘గేమ్ ఛేంజర్’ విడుదల ఎప్పుడని ప్రశ్నించగా.. ఆయన వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌లో ఉంటుందని చెప్పుకుంటూ వెళ్లిపోయారు. దీంతో కొందరు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అందుకు కారణం.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా! ‘సలార్’ (Salaar) థియేటర్ వద్ద దిల్ రాజు ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో రామ్ చరణ్ (#RamCharan), గేమ్ ఛేంజర్ (#GameChanger) ట్యాగ్స్ ట్రెండ్ అవుతుండటం విశేషం.


ఇవి కూడా చదవండి:

====================

*Ala Ninnu Cheri: అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలోకి ‘అలా’ వచ్చేసింది

***************************

*Animal: ‘యానిమల్’లో రణబీర్ తల్లిగా చేసిన నటి వయసు ఎంతో తెలుసా? హీరో రణబీర్ కంటే..?

***************************

*Mohan Babu: కలెక్షన్ కింగ్ నుండి ‘కన్నప్ప’ అప్‌డేట్

***************************

*Bandi Trailer: నగ్నంగా టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతోన్న ట్రైలర్

*****************************

Updated Date - Dec 23 , 2023 | 10:35 PM