Karthikeya: నేనలా అనలేదు.. దయచేసి నటీనటులపై ఇలాంటివి మానుకోండి

ABN , First Publish Date - 2023-08-14T16:18:55+05:30 IST

సోషల్ మీడియా వేదికగా యంగ్ హీరో కార్తికేయ ఓ విజ్ఞప్తి చేశారు. తను అన్నది ఒకటైతే.. వేరేలా రాతలు రాయవద్దని, నటీనటుల ఇమేజ్‌ని డ్యామేజ్ చేయవద్దంటూ కార్తికేయ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Karthikeya: నేనలా అనలేదు.. దయచేసి నటీనటులపై ఇలాంటివి మానుకోండి
Hero Karthikeya

సోషల్ మీడియా వేదికగా యంగ్ హీరో కార్తికేయ (Karthikeya) ఓ విజ్ఞప్తి చేశారు. తను అన్నది ఒకటైతే.. వేరేలా రాతలు రాయవద్దని, నటీనటుల ఇమేజ్‌ని డ్యామేజ్ చేయవద్దంటూ కార్తికేయ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. విషయంలోకి వస్తే.. కార్తికేయ హీరోగా నటించిన చిత్ర ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడు. ఇందులో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ (DJ Tillu) ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్‌గా నటించారు. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కార్తికేయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.


ఆ ఇంటర్వ్యూలో కార్తికేయ మాటల్ని కొందరు వక్రీకరిస్తూ.. వార్తలు సృష్టిస్తుండటంతో వెంటనే ఆయన సోషల్ మీడియా వేదికగా వివరణ ఇస్తూ.. అలాంటి రాతలు రాయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ముందుగా ఇంటర్వ్యూలో కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఎక్స్ 100’ (RX 100) సినిమా తర్వాత నన్ను రొమాంటిక్ సీన్స్‌లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అలాగే ‘డీజే టిల్లు’ సినిమాతో నేహా శెట్టి (Neha Shetty) కూడా రొమాంటిక్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అయితే ఆ చిత్రాలకు ఈ చిత్రానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ కథలో ఓ రొమాంటిక్ సీన్ ఉంది. మా ఇద్దరికీ రొమాంటిక్ ఇమేజ్ ఉంది. అందుకే ఈ సినిమా కోసం మా ఇద్దరినీ ఎంపిక చేసుకున్నారని చెప్పుకొచ్చాడు.

Neha-Shetty.jpg

దీనికి.. ‘‘ఆర్‌ఎక్స్ 100తో నాకు రొమాంటిక్ ఇమేజ్ (Romantic Image) వచ్చింది. డీజే టిల్లు సినిమాతో నేహాకి రొమాంటిక్ ఇమేజ్ వచ్చింది. మా కాంబినేషన్ మీద ఆ అంచనాలు ఉంటాయి. కాబట్టి.. బెదురులంకలో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి’’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ని చూసిన కార్తికేయ వెంటనే సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ‘‘ఒక్కసారి అక్కడ నేను ఏం చెప్పానో పూర్తి ఇంటర్వ్యూ చూడండి. నేనలా మాట్లాడలేదు. దయచేసి నటీనటుల ఇమేజ్‌‌ని లేదంటే సినిమాపై ఉన్న వైబ్‌ని దెబ్బతీసేలా ఇలాంటి పోస్టులు చేయకండి.. థ్యాంక్యూ’’ అని కార్తికేయ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*VT13: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 13వ చిత్రానికి టైటిల్ ఖరారు.. టైటిల్ ఏంటంటే..

***************************************

*Nani: అసలు సిసలు పాన్ ఇండియా యాక్టర్ అతను మాత్రమే.. నాని అలా అనేశాడేంటి?

***************************************

*Vishwak Sen: జీవితంలో మరో కొత్త దశలోకి.. పబ్లిసిటీ స్టంటా లేక నిజంగానే పెళ్లా..?

***************************************

*Renu Desai: రేణు దేశాయ్ విజ్ఞప్తిపై అంబటి రియాక్షన్.. ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లే!

***************************************

Updated Date - 2023-08-14T16:18:55+05:30 IST