VT13: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 13వ చిత్రానికి టైటిల్ ఖరారు.. టైటిల్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-08-14T13:04:09+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా.. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న తెలుగు-హిందీ యాక్షన్ డ్రామా చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. VT13‌ అనే వర్కింగ్ టైటిల్‌‌తో ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి ‘ఆపరేషన్ వేలంటైన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

VT13: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 13వ చిత్రానికి టైటిల్ ఖరారు.. టైటిల్ ఏంటంటే..
Mega Prince Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) హీరోగా.. శక్తి ప్రతాప్ సింగ్ హడా (Shakti Pratap Singh Hada) దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న తెలుగు-హిందీ యాక్షన్ డ్రామా చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. VT13‌ అనే వర్కింగ్ టైటిల్‌‌తో ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి ‘ఆపరేషన్ వేలంటైన్’ (Operation Valentine) అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ.. సోమవారం టైటిల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. ఓ వైవిధ్యభరిత చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుందనే విషయాన్ని తెలియజేస్తోంది.


ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో వరుణ్ తేజ్ IAF అధికారిగా కనిపించనున్నారు. ఆ విషయం ఇంతకు ముందు విడుదల చేసిన పోస్టర్స్‌లోనే తెలిసింది. ఇప్పుడు విడుదల చేసిన టైటిల్ లుక్‌లోనూ ఒక విస్పోటనాన్ని చూపిస్తూనే వరుణ్ తేజ్ (Varun Tej) ఇంటెన్స్ లుక్‌ని అందులో మిళితం చేసిన విధానం.. సినిమాపై ఇంట్రస్ట్‌ని కలగజేస్తోంది. రీసెంట్‌గా ఓ మేజర్ యాక్షన్ ఎపిసోడ్‌ని మేకర్స్ భారీ స్థాయిలో చిత్రీకరించారు. (Operation Valentine Title Look Poster)

VT13.jpg

నిజ సంఘటనలతో స్ఫూర్తి పొంది శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్ (Aamir Khan), సిద్ధార్థ్ రాజ్ కుమార్ (Siddharth Raj Kumar) ఈ చిత్ర కథని సిద్ధం చేసినట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దేశం ఇప్పటివరకు చూడని అతిపెద్ద, భయంకరమైన వైమానిక దాడులలో పోరాడిన మన హీరోల పోరాట స్ఫూర్తిని తెలియజేసే విధంగా దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సందీప్ ముద్ద (Sandeep Mudda) భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ (Manushi Chhillar) ఈ చిత్రంలో రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఈ టైటిల్ పోస్టర్‌లో మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Nani: అసలు సిసలు పాన్ ఇండియా యాక్టర్ అతను మాత్రమే.. నాని అలా అనేశాడేంటి?

***************************************

*Vishwak Sen: జీవితంలో మరో కొత్త దశలోకి.. పబ్లిసిటీ స్టంటా లేక నిజంగానే పెళ్లా..?

***************************************

*Renu Desai: రేణు దేశాయ్ విజ్ఞప్తిపై అంబటి రియాక్షన్.. ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లే!

***************************************

*SS Rajamouli: అందుకే యూత్‌కు న‌చ్చుతుంది

***************************************

*Vishal Marriage: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలపై విశాల్ క్లారిటీ..

***************************************

Updated Date - 2023-08-14T13:04:09+05:30 IST