హాలీవుడ్, బాలీవుడ్‌లకు పోటీగా టాలీవుడ్.. సాయిధరమ్ పోస్ట్ వైరల్

ABN , Publish Date - Dec 21 , 2023 | 08:31 PM

పాజిటివ్ మైండ్‌సెట్‌తో వుంటే.. అంతే పాజిటివ్‌గా వుంటుంద‌ని భావించే వ్య‌క్తుల్లో హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఒక‌రు. ఎల్ల‌ప్పుడూ సినిమా గెల‌వాల‌ని, అందులో తెలుగు సినిమా ఎప్పుడూ ముందుండాల‌ని కోరుకునే వ్య‌క్తి సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ‌. తాజాగా ఆయన సలార్, డంకీ, అక్వామెన్‌ సినిమాల విడుదలపై చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

హాలీవుడ్, బాలీవుడ్‌లకు పోటీగా టాలీవుడ్.. సాయిధరమ్ పోస్ట్ వైరల్
Sai Dharam Tej

పాజిటివ్ మైండ్‌సెట్‌తో వుంటే.. అంతే పాజిటివ్‌గా వుంటుంద‌ని భావించే వ్య‌క్తుల్లో హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఒక‌రు. ఎల్ల‌ప్పుడూ సినిమా గెల‌వాల‌ని, అందులో తెలుగు సినిమా ఎప్పుడూ ముందుండాల‌ని కోరుకునే వ్య‌క్తి సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ‌. తాజాగా ఆయ‌న సోష‌ల్‌ మీడియా వేదిక‌గా చేసిన ఓ పోస్ట్ వైర‌ల్‌గా మార‌ట‌మే కాదు.. సినీ ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

‘‘తెలుగు సినిమా త‌న స‌క్సెస్‌ఫుల్ ప్ర‌యాణంలో నేడు ఉన్న‌త‌స్థితికి చేరుకుంది. మ‌న తెలుగు సినిమా ‘స‌లార్’ ఈ రోజు షారుఖ్‌ఖాన్ ‘డంకీ’, హాలీవుడ్ ఫిలిం ‘అక్వామెన్‌’తో స‌రిస‌మాన‌మైన క్రేజ్‌తో రిలీజ్ అవ్వ‌డం ఎంతో సంతోషంగా, గ‌ర్వంగా వుంది. మూడు అగ్ర సినీ ప‌రిశ్ర‌మ‌లు ఒకే స‌మ‌యాన ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన సినిమాటిక్ అనుభూతికి ఇవ్వ‌డానికి సిద్ధం కావ‌డం గొప్ప విష‌యం.


Dunki.jpg

అన్నిటికంటే ఈ రోజు సినిమా చాలా అగ్ర‌స్థాయిలో వున్న ఫీల్ క‌లుగుతుంది. ఈ అనుభూతి క‌ల‌గ‌డానికి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ నా ధ‌న్య‌వాదాలు. ‘డంకీ’ చిత్రంతో వ‌రుస‌గా మూడు స‌క్సెస్‌ల‌తో హ్యాట్రిక్ స‌క్సెస్ సాధించిన షారుఖ్ సార్‌.. యువ‌ర్ క‌మ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్‌. ‘స‌లార్‌’తో వెండితెర‌పై ఫైర్ క్రియేట్ చేయ‌డానికి సిద్ధమైన ప్ర‌భాస్ అన్న‌కు, అక్వామెన్ సినిమాకు బెస్ట్ ఆఫ్ ల‌క్‌ చెబుతున్నాను’’ అంటూ సాయిధ‌ర‌మ్ తేజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారింది.


ఇవి కూడా చదవండి:

====================

*Jyothika: ముంబైకి మకాం అందుకే.. అసలు విషయం చెప్పేసిన జ్యోతిక

*******************************

*Devil: ‘డెవిల్’ సెన్సార్ టాక్ వచ్చేసింది..

*********************************

*Ooru Peru Bhairavakona: సందీప్ కిషన్, విఐ ఆనంద్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్..

********************************

*ఒక టికెట్టు కొంటే మరొకటి ఉచితం

********************************

*బిగ్ బాస్ షో అనేది పిచ్చికి పరాకాష్ట.. ఈ మాట అన్నది ఎవరంటే?

****************************

Updated Date - Dec 21 , 2023 | 08:31 PM