Sai Dharam Tej: కంటతడి పెట్టిన సాయిధరమ్ తేజ్.. కారణమదే..

ABN , First Publish Date - 2023-06-13T18:03:43+05:30 IST

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎంతో ప్రేమగా పెంచుకున్న టాంగో (పెట్ డాగ్) మృతి చెందడంతో.. ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ లెటర్‌ను షేర్ చేశారు. ఈ లెటర్‌లో టాంగోతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచు మనోజ్ కూడా సాయి పోస్ట్‌కు రియాక్ట్ అయ్యారు.

Sai Dharam Tej: కంటతడి పెట్టిన సాయిధరమ్ తేజ్.. కారణమదే..
Mega Hero Sai Dharam Tej

మెగా హీరో సాయిధరమ్ తేజ్ (Mega Hero Sai Dhatam Tej) తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వార్త.. ఆయననే కాకుండా మెగాభిమానులెందరినో (Mega Fans) కంటతడి పెట్టిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ విషాదవార్తను షేర్ చేసుకున్నారు. ఆ వార్త విన్న నెటిజన్లు.. తేజ్‌కి ధైర్యం చెబుతున్నారు. అసలు దీనికంతటికీ కారణం ఏమిటని అనుకుంటున్నారో. టాంగో.. ఓ డాగ్. అవును ఎంతో ప్రేమగా చూసుకునే వారు లేకపోతే కలిగే బాధ.. జీవితంలో ఏదో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్ చేయక తప్పదు. అలాంటి క్షణాలను ఇప్పుడు సాయితేజ్ ఫేస్ చేస్తున్నారు. అవును, ఆయన ఎంతో ప్రేమగా చూసుకునే, పెంచుకునే పెంపుడు కుక్క టాంగో చనిపోయినట్లుగా.. సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. (Sai Dharam Tej Post on Tango)

“ప్రియమైన టాంగో,

ఎప్పుడు నిన్ను తలుచుకున్నా నా మనసు చాలా తేలికగా, ఆనందంగా ఉంటుంది. నువ్వు లేవు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఇక నువ్వు ఉండవని అనే భావనే ఎంతో బాధని కలిగిస్తుంది. ఎన్నోసార్లు నన్ను నువ్వు కాపాడావు. నాకు బాధ అనిపించినప్పుడు ఓదార్చావు.. ఇబ్బంది అనిపించినప్పుడు నవ్వించావు. నా కష్టసుఖాల్లో ఎప్పుడూ తోడుగా ఉన్నావు. ఆ క్షణాలన్నీ ఎంతో అమూల్యమైనవి. నీ నుంచి నేను ఎంతో ప్రేమను పొందాను. నువ్వు నా జీవితంలోకి రావడమనేది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. నువ్వు నా దగ్గరికి వచ్చిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో జ్ఞాపకాలను నాకిచ్చావు. లవ్ యు మై బండ ఫెలో, టాంగో” అంటూ సాయిధరమ్ తేజ్ ఓ ఎమోషనల్ లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Tango.jpg

ఈ లెటర్‌తో పాటు.. టాంగో (Tango) తన దగ్గరకు వచ్చినప్పటి ఫొటోని కూడా తేజ్ షేర్ చేశారు. ఇక సాయిధరమ్ తేజ్ చేసిన ఈ పోస్ట్ చూసిన వారంతా.. ఆయనని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. మెగాభిమానులు (Mega Fans) అయితే.. ‘ధైర్యంగా ఉండన్నా.. ఈ భూమిపై ఏదీ శాశ్వతం కాదు.. కొందరు అలా వచ్చి వెళ్లిపోతుంటారంతే..’ అనేలా కామెంట్స్ చేస్తూ.. తేజ్‌కి ధైర్యం చెబుతున్నారు. మంచు హీరో మనోజ్ (Manchu Manoj) కూడా సాయిధరమ్ తేజ్ పోస్ట్‌కు రియాక్ట్ అవుతూ.. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చాడు. ప్రస్తుతం తేజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Vijay Anthony: ‘బిచ్చగాడు 2’ తర్వాత పవర్‌ఫుల్‌ టైటిల్‌తో..

**************************************

*Manoj Bajpayee: పవన్ కల్యాణ్ ఆల్రెడీ చేశారు.. మహేష్ బాబు అయితే బెటర్!

**************************************

*Ravi Teja: పెయింటరా? లేక పత్తి పండించే రైతా?.. మాస్ రాజా ఖాతాలో మరొకటి!

**************************************

*Ileana: నా కన్నీళ్లు తుడిచాడు.. తన ప్రియుడిపై ఇలియానా ఆసక్తికరమైన వ్యాఖ్యలు

****************************************

*Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్


********************************

*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

*******************

*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

*********************************

Updated Date - 2023-06-13T18:39:06+05:30 IST