సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sai Dharam Tej: కోహ్లీ-పవన్, ధోని-చరణ్.. అల్లు అర్జున్‌ని అతడితో పోల్చాడేంటి?

ABN, First Publish Date - 2023-04-24T20:48:07+05:30

ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సాయిధరమ్ తేజ్.. తన ఫ్యామిలీ హీరోలను క్రికెటర్స్‌తో పోల్చారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో

Mega Hero Sai Dharam Tej
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటించిన పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ (Virupaksha). సంయుక్తా మీనన్ కథానాయిక. కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో.. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటూ బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఈ సినిమాకు రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతుండటంతో చిత్రయూనిట్ కూడా హ్యాపీగా ఉంది. త్వరలోనే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సాయిధరమ్ తేజ్.. తన ఫ్యామిలీ హీరోలను క్రికెటర్స్‌తో పోల్చారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో.. మీ ఫ్యామిలీ హీరోలను క్రికెటర్స్‌, వారి స్వభావంతో పోల్చాల్సి వస్తే.. ఎవరితో పోల్చుతారు అంటూ.. హోస్ట్ కొందరు క్రికెటర్స్ పేర్లని అడిగారు. హోస్ట్ చెబుతున్న క్రికెటర్లను మెగా ఫ్యామిలీ (Mega Family) హీరోలతో పోల్చుతూ తేజ్ ఇచ్చిన సమాధానాలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని సాయిధరమ్ తేజ్ పోల్చిన క్రికెటర్ విషయంలోనే పెద్ద రచ్చే జరుగుతోంది. ఎందుకంటే అల్లు అర్జున్‌ని ఏ రోహిత్ శర్మతోనో, లేదంటే ఇంకా కాస్త పేరున్న క్రికెటర్‌తోనే పోల్చితే ఏ గొడవా ఉండేది కాదు. అల్లు అర్జున్‌ని ఇక్కడ టైర్ 2 హీరోని చేసేశాడంటూ తేజ్‌పై బన్నీ ఫ్యాన్స్ (Bunny Fans) ఫైర్ అవుతున్నారు. ఇంతకీ తేజ్ ఏ క్రికెటర్‌ని ఏ మెగా ఫ్యామిలీ హీరోతో పోల్చాడంటే..

విరాట్ కోహ్లీ (Virat Kohli) దూకుడు - పవన్ కల్యాణ్ (Pawan Kalyan)

ధోని (Dhoni) ప్రశాంతత - రామ్ చరణ్ (Ram Charan)

హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చమత్కారం - నేనే (సాయిధరమ్ తేజ్)

జడేజా (Jadeja) స్వాగ్ - వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)

రోహిత్ (Rohit) లెజీ అలెగెన్స్ - వరుణ్ తేజ్ (Varun Tej)

తిలక్ వర్మ (Tilak Varma) యూత్ ఫుల్ ఎనర్జీ - అల్లు అర్జున్ (Allu Arjun).. అంటూ సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. అయితే తిలక్ వర్మతో అల్లు అర్జున్‌ని పోల్చడం ఏమిటని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం.. యూత్ ఫుల్ ఎనర్జీ మరియు వెరీ ఎనర్జిటిక్ అనే కోటాలో అల్లు అర్జున్ పేరు చెప్పిన సాయిధరమ్‌పై బన్నీ ఫ్యాన్స్ (Bunny Fans) ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిలక్ వర్మ ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరపున సక్సెస్‌పుల్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Upasana: అత్యంత ప్రేమాభిమానాల మధ్య ఉపాసన సీమంతం.. ఫొటోలు వైరల్

*Young Actor: ఇంట్లో ఉరి వేసుకొని నటుడి ఆత్మహత్య

*King Nagarjuna: కడుపులో ఉండగానే.. అయ్యగారి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!

*Hari Hara Veera Mallu: కీరవాణి కూడా..!

*Akhil Akkineni: ‘ఏజెంట్’లో అది నాకు చాలా కష్టమనిపించింది

*OG Producer: మటన్ బిర్యానీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని సర్‌ప్రైజ్ చేసిన నిర్మాత

Updated Date - 2023-04-24T20:49:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!