Rules Ranjann Trailer: గంట లేదు, అరగంట లేదు.. ఎక్కడో విన్నట్టుందే..

ABN , First Publish Date - 2023-09-08T13:33:45+05:30 IST

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులోని ‘గంట.. అరగంట..’ అంటూ సాగే ఓ డైలాగ్ ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది.

Rules Ranjann Trailer: గంట లేదు, అరగంట లేదు.. ఎక్కడో విన్నట్టుందే..
Rules Ranjann Movie Still

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నేహా శెట్టి (Neha Sshetty) జంటగా రత్నం కృష్ణ (Rathinam Krishna) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann). సీనియర్ నిర్మాత ఏ.ఎం. రత్నం (AM Rathnam) సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందనను రాబట్టుకోవడంతో సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పండిస్తూ.. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేస్తుంది. (Rules Ranjann Trailer Out)

ట్రైలర్ విషయానికి వస్తే.. ‘ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాలా.. అమ్మ పాలిచ్చి పెంచుద్ది.. అయ్య మందు ఇచ్చి ఓదార్చాలి’ అంటూ గోపరాజు రమణ డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్.. ట్రైలర్‌కి జస్టిఫికేషన్ అన్నట్లుగా మనో రంజన్‌కు ఉన్న రూల్స్‌ని వెన్నెల కిశోర్‌తో చెప్పించారు. ‘ఫ్రెండ్స్ అందరిలో నా ఫ్రెండ్సే బెస్ట్ వెధవలు’ అంటూ మరోరంజన్ ఫ్రెండ్స్‌ని పరిచయం చేసి.. వారితో చిన్న కామెడీ టచ్ ఇచ్చారు. తర్వాత హీరోయిన్ పరిచయం.. హీరోహీరోయిన్ల మధ్య ఇంట్రెస్టింగ్ సంభాషణ, పబ్ అంటూ.. మనో రంజన్ కాస్త పబ్ రంజన్‌గా మారిపోవడం చూపించారు. ఇక్కడే మరో హీరోయిన్‌ని పరిచయం చేసి.. ట్రైలర్‌ని మరింత ఆసక్తికరంగా మలిచారు. ‘ఈ రూల్స్ రంజన్.. పబ్ రంజన్‌గా ఎందుకు మారాడు?’ అని క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేసి.. ఇద్దరు హీరోయిన్లతో తాగుడు సీన్ పెట్టి.. ఇందులో కొత్తదనం ఇదే అనే పాయింట్‌ని ప్రేక్షకులకి ఎక్కించారు. ఆ తర్వాత హీరోతో ఓ ప్రేమతో నిండిన సెంటిమెంట్ డైలాగ్ చెప్పించి.. హీరోయిన్‌కి వేరొకరితో పెళ్లి సీన్‌లోకి తీసుకెళ్లారు. ఒక యాక్షన్ ఎపిసోడ్, అనంతరం కొన్ని కామెడీ సీన్స్, సాంగ్స్, డ్యాన్స్.. ఇలా ఇందులో బోలెడంత కంటెంట్ ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. (Rules Ranjann Trailer Talk)


ఇక చివరిలో ‘ఏంటి ఒక గంట కూడా సరిపోదా’ అని ఓ అమ్మాయి అడిగితే.. ‘గంట లేదు.. అరగంట లేదు.. ఇద్దరూ బయటికి పోండి’ అంటూ హీరో సీరియస్ అవుతాడు. అయితే ఈ డైలాగే ఈ ట్రైలర్‌కు హైలెట్ అవుతోంది. ఎందుకంటే, ఈ మధ్య ఏపీలో ఇలాంటి డైలాగ్స్ బాగా వినిపించాయ్. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన కొందరు లీడర్స్ నోటి వెంట వచ్చిన ఈ డైలాగ్ క్లిప్పింగ్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ఈ ట్రైలర్‌లో కావాలని పెట్టారో.. లేదంటే.. సన్నివేశం అలా డిమాండ్ చేసిందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ఈ డైలాగ్ పుణ్యమా అని.. ఈ ట్రైలర్ ట్రెండ్ సెట్ చేస్తోంది. ఓవరాల్‌గా అయితే ఈ ట్రైలర్‌తో సినిమాలో పూర్తి స్థాయిలో వినోదాన్ని అందించే కంటెంట్ ఉన్నట్లుగా అయితే అర్థమవుతోంది. ఇక సెప్టెంబర్ 28న ఈ సినిమా ఎలాంటి టాక్‌ని సొంతం చేసుకుంటుందో.. ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ, అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్, గుల్షన్ పాండే వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి అమ్రిష్ గణేష్ సంగీతం మరో ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Jailer Fame Marimuthu: గుండెపోటుతో ‘జైలర్’ యాక్టర్ కన్నుమూత

**********************************

*Vetrimaaran: ‘ఇండియా’ అనే పేరే చాలు

**********************************

*Atlee: ‘జవాన్‌’తో కల నెరవేరింది.. టాలీవుడ్‌లోని ఆ హీరోలతో టచ్‌లోనే ఉన్నా..

************************************

*Kushi: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

***********************************

*Rudram Kota: ‘రుద్రంకోట‌’ రిలీజ్‌కు రెడీ..

*************************************

Updated Date - 2023-09-08T13:33:45+05:30 IST