Jailer Fame Marimuthu: గుండెపోటుతో ‘జైలర్’ యాక్టర్ కన్నుమూత

ABN , First Publish Date - 2023-09-08T12:16:57+05:30 IST

ఇటీవల వచ్చిన ‘జైలర్’లో విలన్ పక్కన కీలక పాత్రలో నటించిన కోలీవుడ్ న‌టుడు, డైరెక్ట‌ర్ మారిముత్తు (58) శుక్ర‌వారం గుండెపోటుతో క‌న్నుమూశారు. ఓ టీవీ సీరియ‌ల్‌కు డ‌బ్బింగ్ చెబుతూ.. ఆయన సడెన్‌గా కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆస్పత్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మారిముత్తు క‌న్నుమూసిన‌ట్లుగా వైద్యులు గుర్తించారని సమాచారం.

Jailer Fame Marimuthu: గుండెపోటుతో ‘జైలర్’ యాక్టర్ కన్నుమూత
Kollywood Actor Marimuthu

ఇటీవల వచ్చిన ‘జైలర్’లో (Jailer) విలన్ పక్కన కీలక పాత్రలో నటించిన కోలీవుడ్ న‌టుడు, డైరెక్ట‌ర్ అయిన మారిముత్తు (58) (G Marimuthu) శుక్ర‌వారం గుండెపోటుతో క‌న్నుమూశారు. ఓ టీవీ సీరియ‌ల్‌కు డ‌బ్బింగ్ చెబుతూ.. ఆయన సడెన్‌గా కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆస్పత్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మారిముత్తు (Marimuthu) క‌న్నుమూసిన‌ట్లుగా వైద్యులు గుర్తించారని సమాచారం. గుండెపోటుతో మారిముత్తు కన్నుమూసినట్లుగా డాక్టర్స్ ధృవీకరించినట్లుగా తెలుస్తోంది. మారిముత్తు ప్రస్తుతం చేస్తున్న ‘ఎథిర్ నీచెల్’ అనే టీవీ సీరియ‌ల్‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి శుక్రవారం ఉద‌యం డ‌బ్బింగ్ స్టూడియోకు వచ్చారని, డబ్బింగ్ చెబుతూనే గుండెపోటుతో కుప్పకూలిపోయారని.. డబ్బింగ్ స్టూడియో సిబ్బంది చెబుతున్నారు. (#RIPMarimuthu)


జి. మారిముత్తు ఇప్పటి వరకు వంద‌కుపైగా సినిమాల్లో నటించారు. క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఇలా అనేక రకాల పాత్రలలో ప్రేక్షకులని అలరించారు. అజిత్ (Ajith) హీరోగా ఎస్‌జే సూర్య (SJ Surya) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ‘వాలి’ (Vaali) సినిమాతో న‌టుడిగా అరంగేట్రం చేసిన మారిముత్తు.. రీసెంట్‌గా వచ్చిన ర‌జ‌నీకాంత్ ‘జైల‌ర్‌’ (Rajinikanth Jailer) సినిమాలో విలన్‌కు నమ్మినబంటు పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన క‌మ‌ల్‌హాస‌న్ ‘ఇండియ‌న్ 2’లోనూ న‌టిస్తున్నట్లుగా తెలుస్తోంది. మారిముత్తు స్వతహాగా దర్శకుడు కూడా కావడంతో నటుడిగా మంచి గుర్తింపును పొందుతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్ ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారంటే.. మారిముత్తు నటనకున్న క్రేజ్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. అంతేకాదు, ప్రస్తుతం ఆయన ఏ సీరియల్‌కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్లారో.. అందులో ఆయన గుండెపోటు గురించి చెప్పిన ఓ డైలాగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Marimuthu No More)

Marimuthu-Jailer.jpg

రీసెంట్‌గా ‘గార్గి’ (Gargi), ‘విక్రమ్’ (Vikram) సినిమాలలో నటించిన సీనియర్ నటుడు ఆర్.ఎస్. శివాజీ (RS Shivaji) మరణ వార్త మరువక ముందే.. మారిముత్తు మరణం కోలీవుడ్ ఇండస్ట్రీని దిగ్ర్భాంతికి గురిచేస్తుంది. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మారిముత్తు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. కోలీవుడ్ (Kollywood) నటులు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Vetrimaaran: ‘ఇండియా’ అనే పేరే చాలు

**********************************

*Atlee: ‘జవాన్‌’తో కల నెరవేరింది.. టాలీవుడ్‌లోని ఆ హీరోలతో టచ్‌లోనే ఉన్నా..

************************************

*Kushi: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

***********************************

*Rudram Kota: ‘రుద్రంకోట‌’ రిలీజ్‌కు రెడీ..

*************************************

*Rama Banam: ‘ఏజెంట్’ ఏమోగానీ.. ‘రామబాణం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

*************************************

Updated Date - 2023-09-08T12:16:57+05:30 IST