Rudram Kota: ‘రుద్రంకోట‌’ రిలీజ్‌కు రెడీ..

ABN , First Publish Date - 2023-09-07T18:01:37+05:30 IST

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కురాలిగా వ్య‌వ‌హరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘రుద్రంకోట‌’. పవర్ ‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏఆర్‌కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 22న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Rudram Kota: ‘రుద్రంకోట‌’ రిలీజ్‌కు రెడీ..
Jayalalitha in Rudram Kota

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత (Jayalalitha) స‌మ‌ర్ప‌కురాలిగా వ్య‌వ‌హరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘రుద్రంకోట‌’ (Rudram Kota). పవర్ ‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏఆర్‌కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన (Ramu Kona) ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి (Anil Arka Kandavalli) నిర్మిస్తున్నారు. అనిల్‌, విభీష, రియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 22న స్క్రీన్ మాక్స్ పిక్చ‌ర్స్ సంస్థ ద్వారా వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.


ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి మాట్లాడుతూ.. శ్మ‌శాన వాటిక‌లో పెరిగి పెద్దయిన ఓ యువకుడి ప్రేమ‌కథా చిత్ర‌మిది. భ‌ద్రాచలం ద‌గ్గ‌ర రుద్రంకోట అనే ఊరి నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌ని అంశాల‌ను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అంశాలుంటాయి. సీనియ‌ర్ న‌టి జ‌య‌లలిత స‌మ‌ర్ప‌కురాలిగా వ్యవహరించడమే కాకుండా.. ఇందులో ఓ కీలక పాత్రలో నటించారు. ఆమె పాత్ర ఈ సినిమాకి ఎంతో కీలకం. అలాగే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు కోటి గారు మా చిత్రానికి అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. (Rudram Kota Release Date Fixed)

Rudram-Kota.jpg

ఇంకా సుభాష్ ఆనంద్ అందించిన రెండు పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్నాయి. సినిమాకు సంబంధించి ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ ప్ర‌ముఖులు యుబైఏ స‌ర్టిఫికెట్‌తో పాటు సినిమా బావుందంటూ, సరికొత్త ప్రయోగం అంటూ ప్ర‌శంసించారు. మా సినిమా న‌చ్చ‌డంతో స్క్రీన్ మాక్స్ పిక్చ‌ర్స్ వారు ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చారు. సెప్టెంబ‌ర్ 22న వ‌ర‌ల్డ్ వైడ్‌గా సినిమాను గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్నామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Rama Banam: ‘ఏజెంట్’ ఏమోగానీ.. ‘రామబాణం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

*************************************

*MSMP Recipe Challenge: ఛాలెంజ్ స్వీకరించి.. ఇష్టమైన రెసిపీ ఏంటో తెలిపిన రామ్ చరణ్

*************************************

*Raghava Lawrence: ఆ స్వామి అనుగ్రహంతోనే ఈ అదృష్టం

*************************************

*Narayana and Co: ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ ఎంటర్‌టైనర్..

*************************************

*Ala Ninnu Cheri: నిన్నటి కంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా.. క్రిష్ వదిలిన ప్రేమ సాంగ్

*************************************

Updated Date - 2023-09-07T18:08:32+05:30 IST