Atlee: ‘జవాన్‌’తో కల నెరవేరింది.. టాలీవుడ్‌లోని ఆ హీరోలతో టచ్‌లోనే ఉన్నా..

ABN , First Publish Date - 2023-09-07T21:36:31+05:30 IST

బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం వస్తుందని ఊహించలేదని, ‘జవాన్‌’ చిత్రంతో తన కల నెరవేరిందని ఆ చిత్ర దర్శకుడు అట్లీ అన్నారు. ‘జవాన్’ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన అట్లీ.. చిత్ర విశేషాలతో పాటు.. టాలీవుడ్ హీరోలతో టచ్‌లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

Atlee: ‘జవాన్‌’తో కల నెరవేరింది.. టాలీవుడ్‌లోని ఆ హీరోలతో టచ్‌లోనే ఉన్నా..
Kollywood Director Atlee

బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan)ను డైరెక్ట్‌ చేసే అవకాశం వస్తుందని ఊహించలేదని, ‘జవాన్‌’ (Jawan) చిత్రంతో తన కల నెరవేరిందని ఆ చిత్ర దర్శకుడు అట్లీ అన్నారు. షారుఖ్‌, నయనతార (Nayanthara) నటించిన ‘జవాన్‌’ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సందర్భంగా అట్లీ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘జవాన్‌’ భారీస్థాయిలో విడుదలైనందుకు సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పది వేలకుపైగా స్ర్కీన్లపై ఈ సినిమా విడుదలైంది. విడుదలకు ముందు ఎంతో ఉత్కంఠకు గురయ్యాను. ఇప్పటివరకు ఈ స్థాయిలో విడుదలైన సినిమా లేదని అనుకుంటున్నా. విజయ్‌ను డైరెక్ట్‌ చేసిన తర్వాత షారుఖ్‌ను డైరెక్ట్‌ చేయడం సవాల్‌గా భావించా. ఆందోళనకు గురయ్యాను. కానీ, షారుఖ్‌తో మాటలు కలిపిన తర్వాత పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ‘జవాన్‌’ ప్రజల భావోద్వేగతంతో కూడిన కథ. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. మన సమాజంలో జరిగే సంఘటనలే ఈ కథాంశం. తమిళ చిత్ర పరిశ్రమలో గొప్ప నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi). ఈ సినిమా తొలి భాగంలో హీరో కంటే విలన్‌కే ప్రాధాన్యం ఉంటుంది. అందుకే విజయ్‌ సేతుపతిని ఎంపిక చేశాం. (Atlee about Jawan Movie)


SRK.jpg

సినిమా చిత్రీకరణలో భాగంగా ఒక షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్‌ చేసి పూర్తి చేయడానికి కారణం నేను. నా మాటను గౌరవించి షారుఖ్‌ సమ్మతించారు. దీనివల్ల 300 మంది టెక్నీషియన్లకు కొద్ది రోజులు పాటు ఉపాధి లభించింది. నిర్మాణ సంస్థకు కూడా రూ.10 నుంచి రూ.15 కోట్లు ఖర్చు తగ్గించా. ‘జవాన్‌’ తర్వాత నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటా. ఆ తర్వాత తదుపరి ప్రాజెక్టుపై ఆలోచిస్తా. బహుశా విజయ్‌తో ఉండొచ్చు. నాలుగు నెలల తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తా. టాలీవుడ్‌ హీరోలను డైరెక్ట్‌ చేసే అవకాశం వస్తే వదులుకోను.. అలాంటి పిలుపుకోసమే ఎదురు చూస్తున్నా. తెలుగు చిత్రపరిశ్రమకు (Tollywood Heroes) చెందిన మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌, రామ్ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌ వంటి వారితో ఎపుడూ టచ్‌లోనే ఉంటున్నా. ఈ హీరోలను డైరెక్ట్‌ చేసే అవకాశం వస్తే మాత్రం జారవిడుచుకోనని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*Kushi: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

***********************************

*Rudram Kota: ‘రుద్రంకోట‌’ రిలీజ్‌కు రెడీ..

*************************************

*Rama Banam: ‘ఏజెంట్’ ఏమోగానీ.. ‘రామబాణం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

*************************************

*MSMP Recipe Challenge: ఛాలెంజ్ స్వీకరించి.. ఇష్టమైన రెసిపీ ఏంటో తెలిపిన రామ్ చరణ్

*************************************

Updated Date - 2023-09-07T21:36:31+05:30 IST