Ram Charan: భార్య కోసం రామ్ చరణ్ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2023-04-20T16:24:26+05:30 IST

‘గేమ్ ఛేంజర్’ ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఆ షూటింగ్ అనంతరం రామ్ చరణ్ బ్రేక్ తీసుకోబోతున్నారట.. ఎందుకంటే?

Ram Charan: భార్య కోసం రామ్ చరణ్ సంచలన నిర్ణయం
Ram Charan and Upasana

కెరీర్ పిక్ స్టేజ్‌లో ఉండగా.. కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. అలాగే ఎటువంటి స్టార్ హీరో అయినా సరే.. ఫ్యామిలీకి కొంత సమయం కేటాయించక తప్పదు. అలాంటి సమయం కోసం ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) తన డైరీలో కొన్ని పేజీలు ఖాళీగా వదిలేయాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తాజాగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ గ్లోబల్ స్టార్ (Global Star).. సంచలన దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా విడుదల చేశారు. ‘గేమ్ ఛేంజర్’ ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఆ షూటింగ్ అనంతరం మూడు నెలల పాటు రామ్ చరణ్ బ్రేక్ తీసుకోబోతున్నారట. అందుకు కారణం ఉపాసన (Upasana).

Ram-Charan-3.jpg

పెళ్లయిన సుమారు పదేళ్ల తర్వాత చరణ్-ఉపాసన (Ram Charan and Upasana) దంపతులు పేరేంట్స్ కాబోతున్నారు. ప్రస్తుతం ఉపాసన నెలలు నిండిన గర్భిణీ. ఈ సమయంలో భర్తతోడు ఉంటే.. ఆమెకు మరింత ధైర్యంగా ఉండటంతో పాటు.. ప్రేమించిన, ప్రేమించే మనిషి పక్కనుంటే ఉండే సంతోషమే వేరు కదా. అలా ఆ సంతోషాన్ని ఉపాసనకు ఇచ్చేందుకు.. సుమారు మూడు నెలల పాటు రామ్ చరణ్ బ్రేక్ (Ram Charan Takes Break) తీసుకోవాలని భావిస్తున్నాడట. అందుకే ఈ మధ్య ఉపాసనతో చెర్రీ వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ ఫైనల్ షూట్ అనంతరం.. పూర్తి సమయాన్ని ఉపాసన కోసం రామ్ చరణ్ కేటాయించబోతున్నారనేలా ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు ఈ మూమెంట్ చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని మిస్ కాకూడదనే చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్.

Ram-Charan.jpg

కొణిదెల, కామినేని కుటుంబాలలో సంబరాలు:

ఉపాసన-రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయే బిడ్డ కోసం కొణిదెల, కామినేని ఫ్యామిలీలు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. ప్రతి మూమెంట్‌ని వారు సంబరంగా జరుపుకుంటున్నారు. ఇటీవల దుబాయ్‌లో ఉపాసన సిస్టర్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఆమెకు బేబీ షవర్ పార్టీ (Baby Shower Party)ని గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఇంటిలో కూడా ఉపాసనకు బేబీ షవర్ పార్టీని గ్రాండ్‌గా నిర్వహించినట్లుగా.. సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు ప్రత్యక్షమవుతున్నాయి.

Ram-Charan-2.jpg

డెలివరీ డేట్ జూలైలోనే..

ఉపాసన డెలివరీ డేట్ (Upasana Delivery Date) జూలైలో ఇచ్చినట్లుగా స్వయంగా ఆమెనే తన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన ఆగస్ట్ నెలలోనే.. ఉపాసన బిడ్డకు జన్మనిస్తుందనేలా వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ ఇంటర్వ్యూలో ఉపాసన ఆ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది. డాక్టర్స్ తనకి జూలైలో డెలివరీ డేట్ ఇచ్చినట్లుగా ఆమె వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Dasara: నాని ‘దసరా’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*23YrsOfBlockBusterBadri: పవన్ కల్యాణ్ ‘బద్రి’ గురించి ఈ విషయం తెలుసా?

*Sai Dharam Tej: ‘విరూపాక్ష’ను ‘కాంతార’తో పోల్చవద్దు

*Thalapathy Vijay: ఒకే ఒక్క సిట్టింగ్‌లో.. మరో టాలీవుడ్ దర్శకుడితో విజయ్ మూవీ!

*OG: అఫీషియల్.. పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరంటే..

*Tollywood: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ కార్యాలయాల్లో ఐటీ దాడులు

Updated Date - 2023-04-20T16:24:26+05:30 IST