Tollywood: ప్రముఖ నిర్మాణ సంస్థ, దర్శకుడి కార్యాలయాల్లో ఐటీ దాడులు

ABN , First Publish Date - 2023-04-19T11:38:04+05:30 IST

సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ వారు నిర్మిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాకు సంబంధించి వినిపిస్తున్న బిజినెస్ (Business) లెక్కలు కూడా ఈ దాడులకు..

Tollywood: ప్రముఖ నిర్మాణ సంస్థ, దర్శకుడి కార్యాలయాల్లో ఐటీ దాడులు
Sukumar and Mythri Movie Makers Logo

టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్ర మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) పై మరోసారి ఐటీ దాడులు (IT Raids) జరిగినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఈ బ్యానర్ నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy), ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రాల విడుదలకు ముందు ఈ సంస్థపై ఐటీ దాడుదలు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులలో కొన్ని కీలక పత్రాలు లభించినట్లుగా అప్పట్లో టాక్ వచ్చింది. తాజాగా మైత్రీ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతుండటం గమనార్హం.

Pushpa-2.jpg

ఈ మధ్య వరుసబెట్టి సినిమాలు చేయడంతో పాటు, స్టార్ హీరోలతో, పాన్ ఇండియా సినిమాలు.. అలాగే డిస్ట్రిబ్యూషన్ సంస్థను కూడా రన్ చేస్తుండటంతో.. ఈ సంస్థపై మరోసారి ఐటీ కన్ను పడింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ వారు నిర్మిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాకు సంబంధించి వినిపిస్తున్న బిజినెస్ (Business) లెక్కలు కూడా ఈ దాడులకు కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే భారీ ప్రాజెక్ట్‌ కూడా ప్రస్తుతం ఈ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటోంది.

Pawan.jpg

అలాగే ఈ సంస్థతో మంచి అనుబంధం ఉండటంతో పాటు.. ప్రస్తుతం ఇదే సంస్థలో సినిమా చేస్తున్న సుకుమార్‌ (Sukumar) ఆఫీస్‌లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాణరంగంలోనూ దూసుకెళుతూ.. దర్శకనిర్మాతగా పేరొందారీ క్రియేటివ్ డైరెక్టర్. ఆయన నిర్మాణ భాగస్వామంలో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటించిన ‘విరూపాక్ష’ (Virupaksha) చిత్రం ఏప్రిల్ 21న విడుదల కాబోతోంది.

Sukumar.jpg

ఈ నేపథ్యంలో సుకుమార్ ఇళ్లు, ఆఫీస్‌లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం సుకుమార్.. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ డైరెక్టర్స్ అయిన నవీన్, రవిశంకర్ ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ తనిఖీలలో అధికారులకు ఏమేం లభించాయనేది తెలియాల్సి ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌కు సంబంధించిన వివరాలు:

2015లో స్టార్ట్ అయిన మైత్రి మూవీ మేకర్స్

మొదటి సినిమా మహేష్ బాబు ‘శ్రీమంతుడు’

ఇప్పటి వరకు 17 సినిమా లు నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ

సంక్రాంతికి విడుదలైన ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’.. బాలకృష్ణలో ‘వీరసింహ రెడ్డి’

ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమాలు

అల్లు అర్జున్ ‘పుష్ప2’

పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’

విజయ్ దేవరకొండ ‘ఖుషి’

కళ్యాణ్ రామ్ సినిమా

ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్నవి

ఎన్టీఆర్- ప్రశాంత్ నిల్ సినిమా

రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా

నానితో ఓ సినిమా

మహేష్ శ్రీమంతుడు బడ్జెట్ 80 కోట్లు.. టోటల్‌గా వచ్చినది 200 కోట్లు (సుమారుగా)

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ బడ్జెట్ 70 కోట్లు.. టోటల్‌గా వచ్చినది 150 కోట్లు (సుమారుగా)

రామ్ చరణ్ రంగస్థలం బడ్జెట్ 75 కోట్లు.. టోటల్‌గా వచ్చినది 215 కోట్లు (సుమారుగా)

నాని గ్యాంగ్ లీడర్ బడ్జెట్ 20 కోట్లు.. టోటల్‌గా వచ్చినది 45 కోట్లు (సుమారుగా)

ఉప్పెన సినిమా బడ్జెట్ 20 కోట్లు.. టోటల్‌గా వచ్చినది 125 కోట్లు (సుమారుగా)

అల్లు అర్జున్ పుష్ప బడ్జెట్ 150 కోట్లు.. టోటల్‌గా వచ్చినది 380 కోట్లు (సుమారుగా)

మహేష్ సర్కారు వారి పాట బడ్జెట్ 90 కోట్లు.. టోటల్‌గా వచ్చినది 180 కోట్లు (సుమారుగా)

బాలకృష్ణ వీర సింహ రెడ్డి బడ్జెట్ 80 కోట్లు

చిరంజీవి వాల్తేరు వీరయ్య బడ్జెట్ 120కోట్లు

నిర్మాణంలో ఉన్న సినిమాల బడ్జెట్‌లు

విజయ్ దేవరకొండ ఖుషి సినిమా బడ్జెట్ 50 కోట్లు

అల్లు అర్జున్ సినిమా పుష్ప2 పాన్ ఇండియా మూవీ బడ్జెట్ 250 కోట్లు

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ 160 కోట్లు

చేయబోయే పాన్ ఇండియా సినిమాలు

ఎన్టీఆర్- ప్రశాంత్ నిల్ సినిమా బడ్జెట్ అంచనా 300 కోట్లు

రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా బడ్జెట్ అంచనా 200 కోట్లు

ఇవి కూడా చదవండి:

*********************************

*Taapsee Pannu: సౌత్ సినీ ఇండస్ట్రీని ఇంత చీప్‌గా తీసేసిందేంటి?

*Trisha: కార్తీతో కెమిస్ట్రీపై.. త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

*Kanchu Kagada: ఎన్టీఆర్‌ అభిమానుల ఆందోళన.. వెనక్కి తగ్గని కృష్ణ!

*Box Office: బావలు కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే!

Updated Date - 2023-04-19T12:09:06+05:30 IST