OG: అఫీషియల్.. పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరంటే..

ABN , First Publish Date - 2023-04-19T12:51:32+05:30 IST

మేకర్స్ OG చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించబోతున్న హీరోయిన్ (Heroine) పేరును

OG: అఫీషియల్.. పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరంటే..
Pawan Kalyan OG Update

టాలీవుడ్ ఇండస్ట్రీకి (Tollywood) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో ఆస్కార్ (Oscar) సాధించిపెట్టిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (DVV Entertainment) సంస్థలో ఇప్పుడు ఒక భారీ యాక్షన్ డ్రామాను నిర్మాత డీవీవీ దానయ్య (Dvv Danayya) ప్లాన్ చేశారు. OG పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం దర్శకుడు సుజీత్‌ (Sujeeth)తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) జత కట్టారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 15న ముంబైలో ప్రారంభమైన విషయం తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ ఈ వారం ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ రోజు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించబోతున్న హీరోయిన్ (Heroine) పేరును అధికారికంగా ప్రకటించారు.

‘డాక్టర్‌, డాన్‌, నానీస్ గ్యాంగ్‌ లీడర్, శ్రీకారం’ వంటి చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్‌ (Priyanka Mohan) ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైంది (Priyanka Mohan to play the female lead in OG). ఈ భామకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఆమె తన రూపం, శైలితో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటను తెరపై చూడాలని సినీ ప్రియులు (Cine Lovers) ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసున్నారు. వారి కోరిక తీర్చేలా.. ప్రియాంక మోహనే ఇందులో హీరోయిన్ అని తెలుపుతూ.. సెట్స్‌లోకి ఆమె అడుగుపెట్టినట్లుగా మేకర్స్ ప్రకటించారు. మేకర్స్ ప్రకటనకి, అలాగే ఈ సినిమాలో చేయబోతున్నందుకు థ్రిల్ అవుతున్నట్లుగా ప్రియాంక మోహన్ కూడా ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఇప్పటికే ఈ భామ ఈ సినిమాలో చేస్తున్నట్లుగా వార్తలు వచ్చేసిన విషయం తెలిసిందే.

Priyanka-Mohan.jpg

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్‌ ముంబై మరియు పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు (Pawan Kalyan OG Shooting Update). దర్శకుడు సుజీత్ ఎక్కడా రాజీపడకుండా అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి కె చంద్రన్ (Ravi K Chandran) సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ (AS Prakash) ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఎస్ థమన్ సంగీతం (S Thaman) అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Tollywood: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ కార్యాలయాల్లో ఐటీ దాడులు

*Taapsee Pannu: సౌత్ సినీ ఇండస్ట్రీని ఇంత చీప్‌గా తీసేసిందేంటి?

*Trisha: కార్తీతో కెమిస్ట్రీపై.. త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

*Kanchu Kagada: ఎన్టీఆర్‌ అభిమానుల ఆందోళన.. వెనక్కి తగ్గని కృష్ణ!

*Box Office: బావలు కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే!

Updated Date - 2023-04-19T12:58:12+05:30 IST