కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Natti Kumar: అసెంబ్లీలో బాలకృష్ణపై అంబటి వ్యాఖ్యలను ఖండిస్తున్నా..

ABN, First Publish Date - 2023-09-21T18:19:02+05:30

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం జరిగిన ఘటనలు దురదృష్టకరమని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పట్ల అధికార పార్టీ వైసీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని తెలుపుతూ నట్టి కుమార్ ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు.

Natti Kumar, Ambati Rambabu and Balakrishna

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం జరిగిన ఘటనలు దురదృష్టకరమని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ (Natti Kumar) ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పట్ల అధికార పార్టీ వైసీసీ ఎమ్మెల్యేలు (YSRCP MLA), మంత్రులు (Ministers) వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని తెలుపుతూ నట్టి కుమార్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో ఏముందంటే..

‘‘హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. ఎన్నో బిల్లులు అక్కడ పాస్ అవుతుంటాయి. సమీక్షలు, చర్చలు జరిగే అలాంటి దేవాలయంలో గొడవలు జరగడం బాధాకరం. తమ అధినాయకుడు చంద్రబాబు అరెస్ట్‌పై ప్రశ్నించే హక్కు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఉంది. అలాగే నిరసన తెలిపే హక్కు, తమ భావనను తెలిపే స్వేచ్ఛ కూడా తెలుగుదేశం (TDP) ఎమ్మెల్యేలకు ఉంటుంది. కానీ ఎంతసేపు ఆ చర్చ జరగనీయకుండా అధికార పార్టీ వారు చీప్ ట్రిక్స్‌తో అడ్డుకోవడం ఎంతమాత్రం సహేతుకం కాదు. అసెంబ్లీలో వైసీసీ వాళ్ళు అనుసరిస్తున్న వైఖరిని బయట ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. దానివల్ల బయట తమను చులకనగా అనుకుంటారు అన్న అంశాన్ని వైసీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రహించాలి. (Natti Kumar Letter)


స్పీకర్ అధీనంలో నిర్వహించబడే అసెంబ్లీలో ఏదైనా విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు తప్ప అంబటి రాంబాబు జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీ వారికి వార్నింగ్ ఇవ్వడం, రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. అంబటి రాంబాబు కూడా అసెంబ్లీలో ఒక సభ్యుడే. మిగతా పార్టీల వారు కూడా తనలాగే సభ్యులు అన్న అంశాన్ని ఆయన గుర్తించాలి. ప్రజా సమస్యలు, అభివృద్ధి వంటి చర్చోపచర్చలకు అసెంబ్లీ వేదిక కావాలి తప్ప, గొడవలకు వేదిక కాకూడదు. ప్రజా ధనాన్ని వెచ్చించి, పెడుతున్న అసెంబ్లీ సమావేశాలు మంచి చర్చలకు తావులేకుండా పోతున్నాయి. తిట్టడం కోసమే మంత్రుల పోర్టుఫోలియోలు ఇచ్చినట్లు వైసీసీ వాళ్లు ఫీలవుతున్నారు. ఉదయం చంద్రబాబు (Chandrababu)ను, సాయంత్రం అయితే పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. మంత్రి అంబటి రాంబాబు నేను కాపు బిడ్డను అంటూ కులాల ప్రస్తావన తీసుకుని రావడం కరెక్ట్ కాదు.

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అవుతుందనే చెప్పుకునే అసలు పోలవరం వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు గురించి చర్చలు జరగడం లేదు. పోలవరం ఎంతవరకు వచ్చింది? ఎంత పూర్తయింది? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? వంటి వాటి గురించి అంబటి రాంబాబు చర్చించాలి తప్ప అత్యంత విలువైన సభా సమయాన్ని వృధా చేయరాదు. అలాగే టూరిజం మంత్రి రోజా కూడా నారా బ్రాహ్మణిని, నారా భువనేశ్వరిని టార్గెట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. రోజా (Roja) మాదిరిగా తిట్టడంలో వాళ్లకు డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు లేవు. తన భర్త కోసం నారా భువనేశ్వరి, తన మామయ్య బయటకు రావడం కోసం బ్రాహ్మణి ఆరాటపడుతుంటే తోటి మహిళగా సంఘీభావం తెలుపలేకపోయినా, ఇష్టం వచ్చినట్లు రోజా మాట్లాడటం సమంజసం కాదు. తన టూరిజం శాఖలో అభివృద్ధిలో ఏం చేశారో చెప్పాలి. విశాఖపట్నంలో కాటేజీలను కూల్చి, సీఎం భవనాన్ని నిర్మించడం కాదు అభివృద్ధి అంటే. అలాగే పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాధ్ (Amarnath) కూడా అసెంబ్లీ సాక్షిగా తన శాఖకు సంబంధించిన అభివృద్ధిపై రివ్యూలు చేస్తే బావుంటుంది. ఎన్ని పరిశ్రమలను ఏపీకి తీసుకుని రాగలిగాం? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం వంటి వాటిపైన చర్చలు జరిపితే బావుంటుంది’’ అని నట్టికుమార్ తన సుదీర్ఘ లేఖలో వైసీపీ వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*Anasuya: ‘పెదకాపు 1’‌లో కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పా..

*******************************

*Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది..

******************************

*Kannappa: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ నుంచి ఆ హీరోయిన్ అవుట్..

***********************************

*Vishal: టికెట్ డబ్బులకు సరిపడా వినోదం ఇచ్చినందుకు హ్యాపీ..

**********************************

Updated Date - 2023-09-21T18:19:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!