Raghava Lawrence: ‘చంద్రముఖి’గా కంగనా ర‌నౌత్‌ అనగానే భయపడిపోయా..

ABN , First Publish Date - 2023-08-26T21:19:54+05:30 IST

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో అల‌రించనున్నారు. సీనియర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా చెన్నైలో నిర్వహించారు.

Raghava Lawrence: ‘చంద్రముఖి’గా కంగనా ర‌నౌత్‌ అనగానే భయపడిపోయా..
Raghava Lawrence

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో అల‌రించనున్నారు. సీనియర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ (Subhaskaran) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ‘చంద్రముఖి 2’ సినిమాను సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల చేయనున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు.


Lawrence-1.jpg

ఈ కార్యక్రమంలో హీరో రాఘ‌వ లారెన్స్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మై విష‌యాలను ప్ర‌స్తావించారు. తన ప్ర‌తీ సినిమా కార్య‌క్ర‌మంలో డాన్స్ వేసే విక‌లాంగుల గురించి ఆయ‌న ముందుగా మాట్లాడుతూ ‘‘నా ప్ర‌తీ సినిమా ఈవెంట్‌లో నా సోద‌రులతో కార్య‌క్ర‌మం చేయిస్తుంటాను. అందుకు కార‌ణం.. వారికి డాన్స్ త‌ప్ప మ‌రేదీ రాదు. వాళ్లు ఇంత మాత్రం క‌ష్ట‌ప‌డ‌క‌పోతే వాళ్ల కుటుంబం ప‌స్తులుండాల్సిందే. వాళ్లు నా సినిమా స్టేజ్‌పై పెర్ఫామెన్స్ చేసిన‌ప్పుడు మ‌రేవరైనా చూసి వాళ్ల‌కు మ‌రేదైనా ఫంక్ష‌న్స్‌లో అవ‌కాశం ఇవ్వ‌క‌పోతారా? అనేదే నా అభిప్రాయం’’ అన్నారు. ఈ సంద‌ర్భంగా రాఘ‌వ లారెన్స్ నిర్వ‌హిస్తోన్న చారిటీ సంస్థ‌కు నిర్మాత సుభాస్క‌రన్ కోటి రూపాయ‌ల‌ను విరాళంగా ప్ర‌క‌టించారు. దీనిపై లారెన్స్ స్పందిస్తూ ‘‘సుభాస్కరన్‌గారు చూడ‌టానికి సీరియ‌స్‌గా క‌నిపిస్తారు కానీ చిన్న‌పిల్లాడి మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌ది. ప్ర‌తీ ఒక్క‌రినీ ప్రేమ‌తో ప‌ల‌క‌రిస్తారు. ఆయ‌న్ని క‌లిసిన‌ప్పుడు ఆయ‌న్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఎంతో పెద్ద మ‌న‌సుతో ఆయ‌న నా చారిటీకి కోటి రూపాయ‌లు విరాళం ఇచ్చారు. ఆయ‌న ఇచ్చిన డ‌బ్బుతో నేను ఓ స్థ‌లం కొని ఓ బిల్డింగ్ క‌డ‌తాను. అందులో నా స్టూడెంట్స్ అంద‌రూ డాన్స్ ప్రాక్టీస్ చేసుకునేలా ఉంటుంది. ఇక‌పై ఎవ‌రూ నా చారిటీకి డ‌బ్బులు ఇవ్వ‌కండి. ఎందుకంటే నా చారిటీకి నేను ఉన్నాను. అందులోని స‌భ్యుల‌ను నేను చూసుకుంటాను. నిజంగానే మీరు సాయం చేయాల‌నుకుంటే ఇంకా చాలా చారిటీ సంస్థ‌లున్నాయి. వాటికి అండ‌గా నిల‌బ‌డండి’’ అన్నారు. (Chandramukhi 2 Pre Release Event)


Lawrence-2.jpg

‘చంద్ర‌ముఖి 2’ (Chandramukhi 2) సినిమా గురించి లారెన్స్ మాట్లాడుతూ.. ‘‘పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే సుభాస్కరన్‌గారు నాతో సినిమా చేస్తారా? అని అనుకున్నాను. కానీ చంద్ర‌ముఖి 2 వంటి ఓ గొప్ప సినిమాను లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీలా నిర్మించారు. ఆయ‌న బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌టం ఎంతో గ‌ర్వంగా ఉంది. డైరెక్ట‌ర్ వాసుగారి గురించి చెప్పాలంటే ఆయ‌న‌కు నాలుగు ద‌శాబ్దాల అనుభ‌వం ఉంది. నేను సైడ్ డాన్స‌ర్‌గా ఉన్నప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న డైరెక్ట‌ర్‌గా ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ‘చంద్రముఖి 2’ను కూడా ఎంతో గొప్ప‌గా తెర‌కెక్కించారు. ఈ సినిమా సాధించే విజ‌యం ఆయ‌న‌కే ద‌క్కుతుంది. కంగనా ర‌నౌత్‌గారు ఈ సినిమాలో నటిస్తార‌ని తెలియ‌గానే ఆశ్చ‌ర్య‌పోయాను. ఆమె చాలా బోల్డ్ ప‌ర్స‌న్‌. ఆమె ఎలా ఉంటారోన‌ని టెన్ష‌న్ ప‌డ్డాను. ఆమె సెట్స్‌లోకి గ‌న్‌మెన్స్‌తో స‌హా వ‌చ్చింది. అప్పుడు నాలో ఇంకా భ‌యం పెరిగిపోయింది. త‌ర్వాత నా రిక్వెస్ట్ మేర‌కు ఆమె గ‌న్ మెన్స్‌ను సెట్ బ‌య‌టే ఉంచారు. అప్ప‌టి నుంచి ఆమెతో ఫ్రెండ్ షిప్ చేయటం ప్రారంభించాను. అద్భుతంగా పాత్ర‌లో ఒదిగిపోయారు. ఇక కీర‌వాణిగారి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న వ‌ర్క్‌ను టెన్ష‌న్‌లా ఫీలై చేయ‌రు. ఈ సినిమాతో నాకు ఆవిష‌యం అర్థ‌మైంది. అలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు కాబ‌ట్టే అంత మంచి సంగీతాన్ని మా సినిమాకు అందించారు. సినిమాటోగ్రాఫ‌ర్ రాజశేఖ‌ర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ తోట‌త‌ర‌ణిగారు, ఎడిట‌ర్ ఆంటోని స‌హా ఎంటైర్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులతో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప సినిమా చేశాం. త‌ప్ప‌కుండా ఈ సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది’’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్న ఐకాన్ స్టార్

*****************************************

*Prakash Raj and Bobby Simha: నటులు ప్రకాశ్ రాజ్‌, బాబీ సింహాలకు నోటీసులు

*****************************************

*Kartikeya Gummakonda: నేనలా చెప్పగానే.. 2 నిమిషాల పాటు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు

*****************************************

*Jovika: కుమార్తెను లైన్‌లోకి దించుతోన్న వనితా విజయ్ కుమార్

***************************************

Updated Date - 2023-08-26T21:19:54+05:30 IST