Raghava Lawrence: తప్పు జరిగింది.. నన్ను క్షమించండి

ABN , First Publish Date - 2023-08-28T11:47:26+05:30 IST

‘చంద్రముఖి-2’ ఆడియో రిలీజ్‌ వేడుకలో ఓ విద్యార్థిపై బౌన్సర్‌ దాడి చేసిన ఘటనపై ఆ చిత్ర హీరో రాఘవ లారెన్స్‌ క్షమాపణలు చెప్పారు. ఇలాంటి ఘటనలకు బౌన్సర్లు దూరంగా ఉండాలని ఆయన కోరారు. పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుక శుక్రవారం రాత్రి చెన్నైలోని ఓ విద్యా సంస్థకు చెందిన ఆడిటోరియంలో జరిగింది.

Raghava Lawrence: తప్పు జరిగింది.. నన్ను క్షమించండి
Raghava Lawrence

‘చంద్రముఖి-2’ ఆడియో రిలీజ్‌ వేడుకలో ఓ విద్యార్థిపై బౌన్సర్‌ దాడి చేసిన ఘటనపై ఆ చిత్ర హీరో రాఘవ లారెన్స్‌ క్షమాపణలు చెప్పారు. ఇలాంటి ఘటనలకు బౌన్సర్లు దూరంగా ఉండాలని ఆయన కోరారు. పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుక శుక్రవారం రాత్రి చెన్నైలోని ఓ విద్యా సంస్థకు చెందిన ఆడిటోరియంలో జరిగింది. ఈ వేడుకకు వచ్చిన విద్యార్థి (Student)పై ఆడిటోరియం వెలుపల బౌన్సర్‌ దాడి చేశారు. ఇది సోషల్‌ మీడియా (Social Media)లో వైరల్‌ అయింది. బౌన్సర్ల ప్రవర్తనను అనేక మంది తప్పుబడుతున్నారు.


ఈ నేపథ్యంలో దీనిపై రాఘవ లారెన్స్‌ స్పందిస్తూ... సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఈ ఘటనకు సంబంధించి ఆడిటోరియంలో ఉన్న తమకు సమాచారం రాలేదు. ఆడిటోరియం వెలుపల జరిగింది. సాధారణంగా నేను విద్యార్థులను ఎంతగానో ప్రేమిస్తాను. వారు జీవితం వృద్ధిలోకి రావాలని కోరుకునే వ్యక్తిని. మనం ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా, శాంతియుతంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని. కారణం ఏమైనప్పటికీ ఒక వ్యక్తిని కొట్టడం తప్పు. ముఖ్యంగా విద్యార్థిపై చెయ్యి చేసుకోవడం తీవ్రంగా ఖండించదగిన విషయం. ఆ సమయంలో జరిగిన దానికి నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నా. బౌన్సర్లు (Bouncers) కూడా ఇలాంటి సంఘటనలకు దూరంగా ఉండాలని కోరుతున్నాను’’ అని లారెన్స్‌ పేర్కొన్నారు. (Bouncer Attack on Student)

Lawrence-2.jpg

ఇక ‘చంద్ర‌ముఖి 2’ (Chandramukhi 2) సినిమా గురించి లారెన్స్ మాట్లాడుతూ.. ‘‘పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే సుభాస్కరన్‌గారు నాతో సినిమా చేస్తారా? అని అనుకున్నాను. కానీ చంద్ర‌ముఖి 2 వంటి ఓ గొప్ప సినిమాను లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీలా నిర్మించారు. ఆయ‌న బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌టం ఎంతో గ‌ర్వంగా ఉంది. డైరెక్ట‌ర్ వాసుగారి గురించి చెప్పాలంటే ఆయ‌న‌కు నాలుగు ద‌శాబ్దాల అనుభ‌వం ఉంది. నేను సైడ్ డాన్స‌ర్‌గా ఉన్నప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న డైరెక్ట‌ర్‌గా ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ‘చంద్రముఖి 2’ను కూడా ఎంతో గొప్ప‌గా తెర‌కెక్కించారు. ఈ సినిమా సాధించే విజ‌యం ఆయ‌న‌కే ద‌క్కుతుంది. త‌ప్ప‌కుండా ఈ సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది’’ అని తెలిపారు. (Chandramukhi 2 Audio Launch)


ఇవి కూడా చదవండి:

============================

*Shivathmika Rajasekhar: మరో తమిళ ఫిల్మ్‌లో ఛాన్స్.. హీరో ఎవరంటే..

*****************************************

*Raghava Lawrence: ‘చంద్రముఖి’గా కంగనా ర‌నౌత్‌ అనగానే భయపడిపోయా..

***************************************

*Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్న ఐకాన్ స్టార్

*****************************************

*Prakash Raj and Bobby Simha: నటులు ప్రకాశ్ రాజ్‌, బాబీ సింహాలకు నోటీసులు

*****************************************

Updated Date - 2023-08-28T11:47:26+05:30 IST