AskSRK: ‘జవాన్’.. మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పిన బాలీవుడ్ కింగ్ ఖాన్

ABN , First Publish Date - 2023-08-28T13:11:53+05:30 IST

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’. ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. అభిమానులు, ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా #AskSRKలో జ‌వాన్ గురించి నెటిజ‌న్స్ కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు అడుగగా.. షారూఖ్‌ కూడా అంతే ఆసక్తికరంగా స‌మాధానాలు ఇచ్చారు.

AskSRK: ‘జవాన్’.. మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పిన బాలీవుడ్ కింగ్ ఖాన్
Shah Rukh Khan in Jawan

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘జవాన్’ (Jawan). ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. అభిమానులు, ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా షారూఖ్ ఖాన్ #AskSRK అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా #AskSRKలో జ‌వాన్ గురించి నెటిజ‌న్స్ షారూఖ్‌ను కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు వేయ‌గా.. ఆయ‌న కూడా అంతే ఆసక్తికరంగా స‌మాధానాలు ఇచ్చారు. అవేంటంటే.. (Shah Rukh Khan Chit Chat with Netizens)


SrK-2.jpg

* ‘జవాన్’లో షారూఖ్ పాత్రను ఓ పదంలో చెప్పండి

- మ‌హిళ‌లు.. ‘జవాన్’ సినిమాను మ‌హిళ‌లే న‌డిపిస్తారు. ఇది మ‌హిళ‌ల గొప్ప‌తనాన్ని పురుషుల‌కు తెలియ‌జేసేలా తెర‌కెక్కిన చిత్ర. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్ష‌కుల‌ందరికీ న‌చ్చుతుంది.

* మోష‌న్ పోస్ట‌ర్ మీద ఓ ప‌ద్యం చెప్పండి..

- మీరు అంద‌రూ మోష‌న్ పోస్టర్ మీద ఒక్కొక్క‌రు ఓ ప‌ద్యాన్ని రాసి నాకు పంపండి.. ఎవ‌రూ బాగా రాశారో చూద్దాం.

*న్యాయానికి గ‌ల 5 ముఖాలేంటి?

- ఈ సినిమాలో అలాంటివి చాలా ముఖాలే ఉంటాయి. రేపు థియేట‌ర్‌లో అవేంటో స్క్రీన్‌పై చూస్తారు. అప్పుడు తెలుస్తుంది.

SRK.jpg

*జ‌వాన్ మూవీలో గుండుతో క‌నిపించ‌డం....

- ‘జ‌వాన్’ సినిమాలో నేను గుండుతో క‌నిపించ‌టం చాలా మందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ‘ప‌ఠాన్’ సినిమాలో పొడ‌వాటి జుట్టుతో న‌టించాను. ఆ వెంట‌నే చేసిన ‘జ‌వాన్’ మూవీలో గుండు లుక్‌తో న‌టించాను. ఇది నా పిల్ల‌ల‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందోన‌ని ఎదురు చూస్తున్నాను.. హ హ(నవ్వుతూ..)

* జ‌వాన్ సినిమాను ఎన్ని సార్లు చూడొచ్చు

- ఓ సారి మ‌న‌సు కోసం, ఓసారి త‌నువు కోసం, ఓ సారి ఫ‌న్ కోసం, నా అభిమాని అయితే నా కోసం ఓసారి.. మొత్తంగా ఓ నాలుగు సార్లు చూడండి.


Jawan.jpg

* జ‌వాన్‌ను ఎవ‌రెవ‌రు చూడొచ్చు

- పిల్ల‌ల నుంచి ముస‌లివాళ్ల వ‌ర‌కు అంద‌రూ చూడొచ్చు. అందరినీ అలరించే కంటెంట్ ఇందులో ఉంది.

* జ‌వాన్‌లో బెస్ట్ షూటింగ్ ఎక్స్‌పీరియెన్స్‌

- జ‌వాన్‌లో చాలా లుక్స్‌, చాలా షేడ్స్ చేశాను. చాలా క‌ష్ట‌ప‌డ్డాం. అయితే సినిమాను ఫైన‌ల్‌గా చూసిన త‌ర్వాత‌ అంద‌రూ ఎంజాయ్ చేశారు.

*జ‌వాన్ ప్రివ్యూ 2 ఉంటుందా!

- ప్రివ్యూ మ‌ళ్లీ రీ లోడ్ చేయించాలా లేక పాట‌ను రిలీజ్ చేస్తున్నాం.. దాన్ని రిలీజ్ చేయాలా!. మీరంద‌రూ ఆలోచించి చెప్పండి. డైరెక్ట‌ర్ అట్లీతో మాట్లాడి చెబుదాం. ఏదైనా త‌ను చేయాల్సిందే.. అంటూ కింగ్ ఖాన్ చెప్పుకొచ్చారు.

కాగా, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి.. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రివ్యూతో పాటు న‌టీన‌టుల పోస్ట‌ర్స్‌, రెండు సాంగ్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. దీంతో సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ (Atlee) ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Raghava Lawrence: తప్పు జరిగింది.. నన్ను క్షమించండి

*****************************************

*Shivathmika Rajasekhar: మరో తమిళ ఫిల్మ్‌లో ఛాన్స్.. హీరో ఎవరంటే..

*****************************************

*Raghava Lawrence: ‘చంద్రముఖి’గా కంగనా ర‌నౌత్‌ అనగానే భయపడిపోయా..

***************************************

*Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్న ఐకాన్ స్టార్

*****************************************

Updated Date - 2023-08-28T13:11:53+05:30 IST