Bholaa Shankar Twitter Talk: ‘భోళా శంకర్’ బొమ్మ పరిస్థితి ఏంటో తెలిసిపోయింది..

ABN , First Publish Date - 2023-08-11T10:19:20+05:30 IST

సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు మరో బొమ్మతో థియేటర్లలోకి దిగేశారు. ఆ సినిమా విడుదలైన కేవలం 7 నెలల గ్యాప్‌తో ఇప్పుడు ‘భోళా శంకర్’ అంటూ బాక్సాఫీస్‌ని పలకరించారు చిరు. ఓవర్సీస్‌తో పాటు.. ఇతర చోట్ల కూడా ఈ సినిమా షోస్ ఎర్లీ మార్నింగే ప్రారంభం కావడంతో.. సినిమా చూసిన వారంతా ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Bholaa Shankar Twitter Talk: ‘భోళా శంకర్’ బొమ్మ పరిస్థితి ఏంటో తెలిసిపోయింది..
Bholaa Shankar Poster

సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)గా వచ్చి అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi).. ఇప్పుడు మరో బొమ్మతో థియేటర్లలోకి దిగేశారు. ఆ సినిమా విడుదలైన కేవలం 7 నెలల గ్యాప్‌తో ఇప్పుడు ‘భోళా శంకర్’ (Bholaa Shankar) అంటూ బాక్సాఫీస్‌ని పలకరించారు చిరు. చాలా గ్యాప్ తర్వాత స్టైలిష్ మేకర్‌గా పేరున్న మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి ఆసక్తినే క్రియేట్ చేసింది. సంక్రాంతికి వచ్చినట్లే.. ఒక రోజు ముందు రజనీకాంత్ ‘జైలర్’ రూపంలో పోటీ ఉన్నా.. మెగాస్టార్ మరోసారి కదం తొక్కాలని ఎంతో కాన్ఫిడెంట్‌‌గా ‘భోళా’ని బరిలోకి దించారు. మరి సంక్రాంతికి వీరయ్య‌గా వచ్చి మ్యాజిక్ చేసిన చిరు.. ఇప్పుడు ‘భోళా’గా మరోసారి దానిని రిపీట్ చేశారా? ‘భోళా శంకర్’ ఓవర్సీస్‌తో పాటు.. ఇతర చోట్ల కూడా ఎర్లీ మార్నింగే షోస్ మొదలవడంతో.. సినిమా చూసిన వారంతా.. ‘భోళా శంకర్’పై ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘భోళా శంకర్’ ట్విట్టర్ టాక్ ఏంటంటే..

భోళా శంకర్ ఇంటర్వెల్ అరుపులే.. మూవీ చాలా బాగుంది. చూస్తుంటే మెగా ఫ్యామిలీకి కోల్‌కతా సెంటిమెంట్ బాగా కలిసొస్తున్నట్లుంది. నటనలో చిరంజీవి ఎవరెస్ట్.. ఫైట్స్ కొంచెం బోరింగ్ అనిపించాయి. సాంగ్స్ ఇంకాస్త బాగుండాల్సింది. ఇంటర్వెల్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. మా ఫ్యామిలీ మొత్తానికి ఈ సినిమా నచ్చింది. చిరంజీవికి అభినందనలు. మంచి సినిమా.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మీరు చిరంజీవి అభిమానులైతే పోస్ట్ ఇంటర్వెల్‌లో వచ్చే సెకండ్ ఇంట్రడక్షన్‌ని అస్సలు మిస్ కావద్దు.. అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. (Bholaa Shankar Twitter Review)


ఫస్టాఫ్ బాస్ ఎంట్రీ, సాంగ్స్‌లో ఆయన చూసిన స్వాగ్, గ్రేస్, డ్యాన్స్, స్టైల్, ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ ఇచ్చిపడేశారు. బాస్ ఎంత అందంగా ఉన్నారో.. మెహర్ అన్నా నీకు నమస్తే. సెకండాఫ్ అంతా భోళా మానియానే. కామెడీ సీన్స్ అంతగా వర్కవుట్ కాలేదు కానీ ఓవరాల్‌గా అయితే సినిమా పాజిటివ్‌గానే ఉంది.. అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో ఈ సినిమా సూపర్బ్. భోళా శంకర్ కచ్చితంగా ఆడియెన్స్‌కి నచ్చుతుంది.. విజయం సాధిస్తుంది. కామెడీ, ఫైట్స్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. వింటేజ్ మెగాస్టార్ కనిపిస్తారు. మెగాస్టార్ ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్‌తో ఓ ఆట ఆడుకుంటారు.. అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (Bholaa Shankar Twitter Talk)


‘భోళా శంకర్’ అనుకున్నంత గొప్పగా అయితే లేదు. చిరు, మెహర్‌లకు ఈ సినిమా రాంగ్ ఛాయిస్.. అని ఓ నెటిజన్ చెబితే.. సెకండాఫ్ బాగుంది. సెంటిమెంట్ మరియు యాక్షన్‌తో అల్లాడిచ్చాడు. ఫస్టాఫ్ కంటే నాకు సెకండాప్ చాలా బాగా నచ్చింది. నా రేటింగ్ ఈ సినిమాకు 3 అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

చిరంజీవి ఇలాంటి చెత్త సినిమాలను ఆపేస్తే మంచిది. మేము ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇస్తున్నామని తెలుపుతూ.. వరస్ట్ ఫస్టాప్.. గుడ్ సెకండాఫ్ అని ఫ్యాక్ట్ ఇన్ మీడియా అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చిరంజీవి, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, భోళా మానియా ఎలిమెంట్ మరియు సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చిరు-తమన్నాల మధ్య కొన్ని సీన్లు ఈ సినిమాకు పాజిటివ్స్‌గా చెప్పుకుంటే.. ఫస్టాఫ్, మెహర్ రమేష్ డైరెక్షన్, ఓవర్ కామెడీ, ఇరికించినట్లుగా అనిపించే భావోద్వేగాలు, పాతకాలపు కథ ఈ సినిమాకు నెగిటివ్స్ అని తెలిపారు. (Bholaa Shankar Twitter Reports)


అయ్యా సభకు నమస్కారం. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. సెకండాఫ్‌లో చిరంజీవి నుంచి వచ్చే కొన్ని కామెడీ సీన్స్, ఇంటర్వెల్ తర్వాత 10 నిమిషాలకు వచ్చే సన్నివేశాలు, భోళా మానియా సాంగ్, ఎమోషన్స్‌ని పండించిన తీరు బాగుంది అంటూ.. డైరెక్టర్ ఆఫ్ వెర్షన్‌లో ఈ సినిమా ఫెయిల్ అని.. చిరు కెరీర్‌లో ఈ సినిమాని మరిచిపోవడం లేదంటే వదిలేయడం మంచిదని చెబుతూ.. 100 భోళా శంకర్లు కలిస్తే ఓ వాల్తేరు వీరయ్య అన్నట్లుగా ఓ ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నారు.

మూవీ బ్లాక్‌బస్టర్.. మీరు చూసి మాట్లాడండి. రివ్యూలు చూడకుండా.. సినిమా చూసి మాట్లాడండి. ఫస్టాఫ్ యావరేజ్.. సెకండాఫ్ బ్లాక్‌బస్టర్ అని ఓ నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. (Megastar Chiranjeevi Movie)


ఓవరాల్‌గా అయితే.. ‘భోళా శంకర్’పై ట్విట్టర్‌లో మిశ్రమ టాక్ నడుస్తోంది. ఫ్యాన్స్ బాగుందని అంటుంటే.. యాంటీస్ వేస్ట్ అని అంటున్నారు. మ్యాగ్జిమమ్ మెంబర్స్ మాత్రం ఫస్టాఫ్ ఫట్.. సెకండాఫ్ హిట్ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోన్న ఈ ‘భోళా శంకర్’ బొమ్మ పరిస్థితి ఏంటో కాసేపట్లో వచ్చే రివ్యూలో తెలుసుకుందాం. (Bhola Shankar Twitter Talk)


ఇవి కూడా చదవండి:

***************************************

*OG: పవర్ ‌స్టార్ బర్త్‌డేకి హీట్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధమా..

***************************************

*Bholaa Shankar: భారీ కటౌట్, ర్యాలీ.. సినిమా ప్రచారానికి కాదు బాబాయ్..!

***************************************

*Raiza Wilson: వీధి పిల్లి దాడిలో హీరోయిన్‌కు గాయాలు

***************************************

Updated Date - 2023-08-11T12:32:22+05:30 IST