‘PS2’ Twitter Review: ‘బాహుబలి’‌ సరిపోదు.. ఇండియన్ సినిమా గర్వపడే చిత్రమిది

ABN , First Publish Date - 2023-04-28T10:55:09+05:30 IST

‘పిఎస్ 1’తో కోలీవుడ్ మినహా.. పాన్ ఇండియా స్థాయిలో మెప్పించలేకపోయిన మణిరత్నం.. ఈ ‘పిఎస్2’తో ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడనేది కాసేపట్లో వచ్చే రివ్యూలో తెలుసుకుందాం కానీ.. ఈ లోపు ట్విట్టర్‌లో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం..

‘PS2’ Twitter Review: ‘బాహుబలి’‌ సరిపోదు.. ఇండియన్ సినిమా గర్వపడే చిత్రమిది
PS 2 Movie Poster

కోలీవుడ్ సంచలన దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు అయినటువంటి ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కి.. గత ఏడాది ఒక పార్ట్ విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. గ‌త సంవత్సరం సెప్టెంబ‌ర్ 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1’.. ఒక్క తమిళంలోనే దాదాపు రు. 400 కోట్లను వసూలు చేసి రికార్డును క్రియేట్ చేసింది. గత సంవత్సరం కోలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలిచింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగం ‘పిఎస్ 2’ (Ponniyin Selvan 2)గా నేడు (ఏప్రిల్ 28) ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌ (Overseas)లో ప్రీమియర్ షోలు కంప్లీట్ అవడంతో పాటు.. తమిళనాడు (Tamil Nadu)లో సైతం కొన్ని ప్రీమియర్ షోస్ ముగిశాయి. ఈ సినిమాని చూసిన నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ‘పిఎస్ 1’తో కోలీవుడ్ మినహా.. పాన్ ఇండియా స్థాయిలో మెప్పించలేకపోయిన మణిరత్నం.. ఈ ‘పిఎస్2’తో ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడనేది కాసేపట్లో వచ్చే రివ్యూలో తెలుసుకుందాం కానీ.. ఈ లోపు ట్విట్టర్‌లో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.. (PS2 Twitter Review)

స్లోగా నడిచే మంచి డ్రామా చిత్రమిది.. చాలా చక్కగా తెరకెక్కించారు. ముఖ్యంగా విక్రమ్ (Vikram) మరియు ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai)ల మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఓమై రాణికి సంబంధించిన సన్నివేశాలను విడమరిచి చెప్పిన తీరు బాగుంది. కార్తీ (Karthi), ఐశ్వర్య అరిపించేశారు. అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఓవరాల్‌గా మంచి ఎంటర్‌టైనర్ చిత్రమిదని తెలుపుతూ ఓ నెటిజన్ 4 రేటింగ్ ఇచ్చారు. (Ponniyin Selvan 2 Twitter Talk)


నవల నుంచి తీసుకున్న ఈ కథకి.. మణిరత్నం సార్ తెరరూపమిచ్చి సరైన న్యాయం చేశారు. స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ పూర్తిగా ఎంగేజింగ్‌గా ఉందీ సినిమా. ఐశ్వర్యరాయ్, విక్రమ్, జయం రవి (Jayam Ravi) మరియు కార్తీ అద్భుతంగా నటించారు. మొత్తంమ్మీద ఒక మంచి చిత్రమిదని తెలుపుతూ మరో నెటిజన్ 4 రేటింగ్ ఇచ్చాడు.


‘పిఎస్2’ సినిమా చూశాను. నిజంగా ఇండియన్ సినిమా గర్వపడే చిత్రమిది. టాలీవుడ్ అభిమానులు క్షమించాలి.. బాహుబలి కంటే కూడా పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రం చాలా బాగుంది. బాక్సాఫీస్ ప్రమాదంలో ఉంది. (Ponniyin Selvan 2 Twitter Report)


పొన్నియిన్ సెల్వన్ 2 మాస్టర్ పీస్ అంటూ లెట్స్ ఓటీటీ ట్విట్టర్ 5 రేటింగ్ ఇచ్చింది. అద్భుతమైన మాయాజాలంతో ఇటువంటి చిత్రాన్ని తెరకెక్కించి, ప్రేక్షకులకు అందించిన మణిరత్నం అభినందనీయుడు. కథాంశం, పాత్రలు, విజువల్స్, డైలాగ్స్ మరియు సంగీతం అద్భుతంగా కుదిరాయి. విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష (Trisha) వారి నటనతో మనసులు దోచేశారు. తప్పక చూడండి.


వన్ వర్డ్ రివ్యూ- బ్లాక్‌బస్టర్. స్టోరీ, స్ర్కీన్‌ప్లే, యాక్షన్స్, ఎమోషనల్ సీన్స్, సీజీ, విఎఫ్‌ఎక్స్, సాంగ్, బీజీఎమ్, క్లైమాక్స్ అన్ని అద్భుతంగా కుదిరాయి. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్.. అంటూ ఓ నెటిజన్ 5కి 5 రేటింగ్ ఇచ్చేశాడు.


విజువల్స్ అంత గొప్పగా ఏం లేవు. ప్రారంభం బాగుంది. బీజీ స్కోర్ చెప్పుకునేంతగా లేకపోయినా.. సినిమాకు కావాల్సిన విధంగా ఉంది. పిఎస్ 1 అంత గొప్పగా ఈ సినిమా ప్లో లేదు. విక్రమ్, ఐశ్వర్యరాయ్ తమ నటనతో ఆకట్టుకున్నారు. త్రిష, కార్తీ, జయం రవిల పాత్రలను ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే పిఎస్ 2 కంటే పిఎస్ 1 చాలా గొప్పగా ఉంది. అయినా ఇది చూసి ఆనందించదగ్గ చిత్రమని ఓ నెటిజన్ 10కి 6.9 రేటింగ్ ఇచ్చారు.


ఇక టాలీవుడ్ (Tollywood) విషయానికి వస్తే.. పిఎస్ 1 మాదిరిగానే పిఎస్ 2కి కూడా స్పందన వస్తుంది తప్ప గొప్పగా మార్పు అయితేం ఏం లేదు. అయితే ఇందులో పాత్రలని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుందని మాత్రం అంటున్నారు. అంతేకాదు, చూడదగ్గ చిత్రంగా కూడా కొందరు నెటిజన్లు తమ ట్వీట్స్‌లో పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Agent Twitter Review: అయ్యగారి సినిమా టాక్.. ఏదో తేడాగా ఉందే..?

*Surender Reddy Universe: ‘ఏజెంట్’లో ‘ధృవ’.. వీడియో అదిరింది

*Bholaa Shankar: రెండు కీలక అప్‌డేట్స్‌తో వచ్చిన మెగాస్టార్

*Sekhar Kammula: శేఖర్ కమ్ముల సక్సెస్ సీక్రెట్ ఇదేనట..

*Thangar Bachan: తమిళ తెరకు మరో నందితా దాస్‌ను పరిచయం చేస్తున్నా..

*Kundavai: యువరాణి కుందవై ఇతర పేర్లు ఏంటి?

*Samuthirakani: పవన్ కల్యాణ్ లెటర్‌కు సముద్రఖని స్పందనిదే..

* Samantha: సమంతని వదలని చిట్టిబాబు.. ఇదో ‘రంగస్థలం’ అవుతుందేమో..

Updated Date - 2023-04-28T10:55:09+05:30 IST