Surender Reddy Universe: ‘ఏజెంట్’లో ‘ధృవ’.. వీడియో అదిరింది

ABN , First Publish Date - 2023-04-27T19:51:38+05:30 IST

చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ఓ టీజర్‌ని వదిలారు. ఈ టీజర్ చూస్తే.. ‘ఏజెంట్’ మూవీలోకి సురేందర్ రెడ్డి (Surender Reddy) గతంలో చేసిన ‘ధృవ’ (Dhruva) వచ్చి..

Surender Reddy Universe: ‘ఏజెంట్’లో ‘ధృవ’.. వీడియో అదిరింది
Ram Charan and Akhil Akkineni

హాలీవుడ్ (Hollywood) వాళ్లే కాదు.. మేము కూడా యూనివర్స్‌ (Universe)లను సృష్టించగలమనేలా.. సౌత్ డైరెక్టర్స్ ముందుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj).. తన చిత్రాలతో ఓ యూనివర్స్‌ని క్రియేట్ చేస్తే, ఇప్పుడు సురేందర్ రెడ్డి.. ఓ యూనివర్స్‌ని క్రియేట్ చేసినంత పని చేశాడు. ఏమిటా యూనివర్స్ అనుకుంటున్నారా? తాజాగా ఆయన దర్శకత్వంలో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా రూపొందిన హై ఆక్టేన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ (Agent). ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ఓ టీజర్‌ని వదిలారు. ఈ టీజర్ చూస్తే.. ‘ఏజెంట్’ మూవీలోకి సురేందర్ రెడ్డి (Surender Reddy) గతంలో చేసిన ‘ధృవ’ (Dhruva) వచ్చి.. మిషన్ గురించి అడుగుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ధృవ’. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో రామ్ చరణ్ పాత్రకి, ఇప్పుడు ‘ఏజెంట్’లోని అఖిల్ (Akhil) పాత్రకి లింక్ పెడుతూ.. ఈ టీజర్‌ని కట్ చేశారు. ఈ టీజర్ కోసం రామ్ చరణ్ ‘ధృవ’ సినిమా లుక్‌లోకి మేకోవర్ కావడం విశేషం. ఈ వీడియోలో మిషన్‌కి సిద్ధమా? నీకోసం అంతా వెయిట్ చేస్తున్నారని రామ్ చరణ్ అంటే.. ‘అఫ్‌కోర్స్ ధృవ.. ఇది నా వైల్డెస్ట్ మిషన్.. నేను రెడీ’ అని అఖిల్ సమాధానమిచ్చాడు. ‘మరి ఇంకా లేటెందుకు వైల్డ్ సాలే’ అని చరణ్ అంటే.. ‘నీ కమాండ్ కోసమే సీనియర్..’ అని అఖిల్ చెప్పాడు. ‘లెట్స్ బిగెన్ ద వైల్డ్ రైడ్’ అని చరణ్ నెంబర్స్ లెక్కపెడుతుంటే.. ‘సాలే నహీ.. వైల్డ్ సాలే’ అంటూ అఖిల్ యాక్షన్‌లోకి దిగుతున్నాడు. ఇది ఈ టీజర్‌లో ఉన్న మ్యాటర్. ఇది కేవలం ‘ఏజెంట్’ ప్రమోషన్ కోసం చేసిందా.. లేదంటే ఇంకా ఏదైనా ప్లాన్ ఉందా? అనేది సురేందర్ రెడ్డికే తెలియాలి.

ఇదిలా ఉంటే.. ఇది సురేందర్ రెడ్డి యూనివర్స్ అంటూ ఈ వీడియోని మెగా, అక్కినేని ఫ్యాన్స్ (Mega and Nandamuri Fans) వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోని పోస్ట్ చేసిన అఖిల్.. ‘థ్యాంక్యూ మై బ్రదర్’ అంటూ చరణ్‌కి ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియోతో.. ఇటువంటి సినిమా ఒకటి ప్లాన్ చేయమంటూ సురేందర్ రెడ్డికి ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. అలాగే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న అఖిల్ ‘ఏజెంట్’ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుతున్నారు. కాగా.. వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కథను అందించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటించింది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Bholaa Shankar: రెండు కీలక అప్‌డేట్స్‌తో వచ్చిన మెగాస్టార్

*Sekhar Kammula: శేఖర్ కమ్ముల సక్సెస్ సీక్రెట్ ఇదేనట..

*Thangar Bachan: తమిళ తెరకు మరో నందితా దాస్‌ను పరిచయం చేస్తున్నా..

*Kundavai: యువరాణి కుందవై ఇతర పేర్లు ఏంటి?

*Samuthirakani: పవన్ కల్యాణ్ లెటర్‌కు సముద్రఖని స్పందనిదే..

* Samantha: సమంతని వదలని చిట్టిబాబు.. ఇదో ‘రంగస్థలం’ అవుతుందేమో..

*Samantha: ఆంధ్రప్రదేశ్‌లో హీరోయిన్ సమంతకు గుడి.. ప్రారంభం ఎప్పుడంటే?

Updated Date - 2023-04-27T21:08:17+05:30 IST