Jawan: లెజెండ్‌లో ఉన్న స్టఫ్ ఇది.. ‘జవాన్‌’పై మహేష్ బాబు రివ్యూ.. ఎంత బాగుందో

ABN , First Publish Date - 2023-09-08T15:39:47+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాపై సినీ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తుండటం విశేషం. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. ట్విట్టర్ వేదికగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అంటూ తన రివ్యూను తెలియజేశారు.

Jawan: లెజెండ్‌లో ఉన్న స్టఫ్ ఇది.. ‘జవాన్‌’పై మహేష్ బాబు రివ్యూ.. ఎంత బాగుందో
SRK and Mahesh Babu

షారుఖ్ ఖాన్ (ShahRukhKhan), తమిళ దర్శకుడు అట్లీ (Atlee) కాంబినేషన్‌లో వచ్చిన ‘జవాన్’ (Jawan) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఒక్క హిందీలోనే కాకుండా దక్షిణాది భాషలన్నింటిలోనూ ఈ సినిమాని భారీగా విడుదల చేశారు. నయనతార (Nayanthara), విజయ్ సేతుపతి (VijaySethupathi), దీపికా పదుకునే (DeepikaPadukone), ప్రియమణి (Priyamani) ఇలా భారీ తారాగణమే ఇందులో నటించారు. ఈ సినిమా విడుదలకు ముందే చాలా హైప్ సొంతం చేసుకుంది. అలాగే విడుదల తర్వాత కూడా పైసా వసూల్ సినిమా అని, మాస్ ఎంటర్‌టైనర్ అని ప్రేక్షకుల, విమర్శకుల నుంచి స్పందనను రాబట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాపై సినీ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తుండటం విశేషం. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu).. ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై తన రివ్యూను తెలియజేశారు.

సినిమా విడుదలకు ముందు.. ‘జవాన్’ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు.. సినిమా విడుదల తర్వాత, ఆ సినిమాని చూసి ఎలా ఉందో ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, షారుఖ్‌ని లెజెండ్ అంటూ సంభోధించి బాలీవుడ్ అభిమానులను, ముఖ్యంగా షారుఖ్ అభిమానులను ఖుషి చేశారు. ‘జవాన్’ సినిమాపై మహేష్ బాబు ఏమన్నారంటే.. (Mahesh Babu Review about Jawan)


Mahesh-Babu.jpg

‘‘జవాన్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా. దర్శకుడు అట్లీ (Atlee) కింగ్ ఖాన్‌తో కింగ్‌ సైజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు. కింగ్ ఖాన్ కెరీర్‌లోని బెస్ట్‌ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఆయన ఆరా, స్ర్కీన్ ప్రెజన్స్, చరిష్మాని ఎవరూ మ్యాచ్ చేయలేరు. స్ర్కీన్‌ మీద చెలరేగిపోయారు. తన గత చిత్రాల రికార్డులను మళ్లీ ఆయనే బద్దలు కొట్టబోతున్నారు. సినిమా చాలా బాగుంది. లెజెండ్స్‌లో ఉన్న స్టఫ్ ఇది’’ అంటూ ‘జవాన్’ సినిమాపై.. షారుఖ్‌ ఖాన్‌పై మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. షారుఖ్ అంటే మహేష్‌కు ఎంతో అభిమానమో అంటూ.. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. మహేష్ చేసిన ఈ ట్వీట్‌కు దర్శకుడు అట్లీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ.. త్వరలోనే మహేష్‌ని కలుస్తానని ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

============================

*Srimanthudu: ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డ్

**********************************

*Rules Ranjann Trailer: గంట లేదు, అరగంట లేదు.. ఎక్కడో విన్నట్టుందే..

**********************************

*Jailer Fame Marimuthu: గుండెపోటుతో ‘జైలర్’ యాక్టర్ కన్నుమూత

**********************************

*Vetrimaaran: ‘ఇండియా’ అనే పేరే చాలు

**********************************

*Atlee: ‘జవాన్‌’తో కల నెరవేరింది.. టాలీవుడ్‌లోని ఆ హీరోలతో టచ్‌లోనే ఉన్నా..

************************************

Updated Date - 2023-09-08T15:39:47+05:30 IST