Vinayakan: ‘జైలర్’ విలన్ వినాయకన్ అరెస్ట్.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-10-25T09:45:13+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కి, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం ‘జైలర్‌’. ఈ చిత్రంలో విలన్‌గా చేసిన వినాయకన్‌ తన నటనతో సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యారు. తాజాగా ఈ నటుడిని కేరళ పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

Vinayakan: ‘జైలర్’ విలన్ వినాయకన్ అరెస్ట్.. ఎందుకంటే?
Jailer Villain Arrested

సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో తెరకెక్కి, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం ‘జైలర్‌’ (Jailer). ఈ చిత్రంలో విలన్‌గా చేసిన వినాయకన్‌ (Vinayakan) తన నటనతో సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యారు. కానీ నిజ జీవితంలో కూడా ఆయన విలన్‌గానే ప్రవర్తించడంతో.. తాజాగా ఆయనని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని వారంతా ఆయనపై కంప్లయింట్ ఇవ్వడంతో.. పోలీసులు రంగంలోకి దిగి వినాయకన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వినాయకన్‌ ఇబ్బంది పెడుతున్నారంటూ.. అపార్ట్‌మెంట్‌ వాసులంతా ఆయనపై చేసిన ఫిర్యాదు మేరకు వినాయకన్‌ను ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీసులు స్టేషన్‌ను పిలిపించారు. స్టేషన్‌కు వచ్చిన వినాయకన్ మద్యం మత్తులో ఉండటంతో పాటు.. తనని పోలీసు స్టేషన్‌కు పిలిపిస్తారా? అంటూ.. సహనం కోల్పోయి పోలీసులతోనే గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు అతని పట్ల సహనంగా వ్యవహరించినా.. వినాయకన్ కంట్రోల్ కాకపోవడంతో.. చేసేది లేక అతడిపై కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆయనని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. (Jailer Villain Arrested)


Vinayakan.jpg

అయితే వినాయకన్‌ (Actor Vinayakan) అరెస్ట్ తర్వాత అతని గురించి చాలా విషయాలు బయటికి వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా అతనిని పోలీసులు అరెస్ట్‌ చేశారని, కానీ ఆయనలో మార్పు మాత్రం రావడం లేదంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఓ మోడల్‌ను వేధించిన కేసులో అతడిని అరెస్ట్‌ చేయగా.. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారని అక్కడి మీడియా సర్కిల్స్‌లో సైతం వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. మంచి నటుడు, కానీ ఇలాంటి చేష్టలతో వచ్చిన నేమ్, ఫేమ్‌ని నాశనం చేసుకుంటున్నాడని.. అతని అభిమానులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన బెయిల్‌పై బయటికి వచ్చినట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Saripodhaa Sanivaaram: శనివారం వరకు ఎందుకుని.. మంగళవారమే క్లాప్ కొట్టేశారు

************************************

*Devil: ‘డెవిల్’ స్టన్నింగ్‌ పోస్టర్‌.. సీక్రెట్‌ ఏజెంట్‌ ఏం ఉన్నాడులే..

**********************************************

*Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ సక్సెస్‌పై బాలకృష్ణ ఏమన్నారంటే..

*********************************************

Updated Date - 2023-10-25T09:48:37+05:30 IST