Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ సక్సెస్‌పై బాలకృష్ణ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-10-24T14:46:45+05:30 IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని దసరా విన్నర్‌గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళుతోంది. తాజాగా జరిగిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఇదొక విస్పోటనంగా బాలయ్య చెప్పుకొచ్చారు.

Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ సక్సెస్‌పై బాలకృష్ణ ఏమన్నారంటే..
Nandamuri Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని దసరా విన్నర్‌గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా.. శ్రీలీల (Sreeleela) కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌పై దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి.. అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం దిశగా దూసుకెళుతోంది. ‘భగవంత్ కేసరి’ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ సోమవారం బ్లాక్‌బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించింది. ఈ వేడుకకు నిర్మాత దిల్ రాజు (Dil Raju), దర్శకురాలు నందిని రెడ్డి (Nandini Reddy) అతిధులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ముందుంగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. శక్తికి నిర్వచనం స్త్రీ. అలాంటి స్త్రీ శక్తి ప్రతిరూపం దుర్గమ్మ అమ్మవారు. ఆ అమ్మవారిని 108 నామాలతో స్మరిస్తాం. నా 108వ చిత్రం భగవంత్ కేసరి ఈ నవరాత్రుల్లో విడుదల కావడం, ఈ చిత్రానికి మూలం స్త్రీశక్తి కావడం, అమ్మవారి వాహనం పులి కావడం, ఈ చిత్రం కూడా బనావో బేటికో షేర్ అనే అంశంతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్ప సందేశాత్మక చిత్రంలో మేమంతా పాలుపంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు.. భారతీయ చలన చిత్రపరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రం ‘భగవంత్ కేసరి'. ఇలాంటి అద్భుతమైన సినిమా తెలుగువారు తీశారని దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. (BLOCKBUSTER DAWATH success celebrations)

నాన్నగారి స్ఫూర్తితో ఏదైనా వైవిధ్యంగా చేయాలనే తపనతో చిత్ర పరిశ్రమలో నా ప్రస్థానం కొనసాగుతోంది. ‘భైరవద్వీపం, ఆదిత్య 369, గౌతమీపుత్ర శాతకర్ణి..’ ఇలాంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దర్శకుడు అనిల్ రావిపూడి నా అభిమాని. ప్రతి సినిమాకి వైవిధ్యం చూపుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగివుండే తన స్వభావం, అంకితభావం చూస్తుంటే చాలా గర్వంగా వుంది. ప్రతి మహిళ కూడా తనని తాను తర్ఫీదు చేసుకొని ఒక సైనికుడిలా తయారవ్వాలి. ఈ సినిమాతో ఇలాంటి మంచి సందేశం ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. కుటుంబాలు తమ పిల్లలని తీసుకెళ్ళి థియేటర్‌లో సినిమా చూపిస్తున్నారు. ఇంత అద్భుతమైన చిత్రాన్ని తీసిన దర్శకుడు అనిల్ రావిపూడిని అభినందిస్తున్నాను. (Dasara Winner Bhagavanth Kesari)


BK.jpg

శ్రీలీలకు తనలోని నటనా ప్రతిభని చూపించే పాత్ర దక్కింది. ఈ పాత్రకు తను పూర్తి న్యాయం చేసింది. కాజల్ తన అనుభవం అంతా రంగరించి తన పాత్రని చక్కగా చేసింది. అర్జున్ రాంపాల్‌గారు జాతీయ అవార్డ్ పొందిన నటుడు. ఈ చిత్రంలో తన పాత్రని అద్భుతంగా పోషించారు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తమన్ నా చిత్రాలకు హైఎనర్జీ మ్యూజిక్ అందిస్తారు. ఈ చిత్రంలోని పాటలు, నేపధ్య సంగీతం చాలా అద్భుతంగా చేశారు. రామ్ ప్రసాద్ నా ప్రతికదలిక తెలిసిన కెమెరామెన్. దర్శకుడు మనసులో వున్న కాన్సెప్ట్‌ని అద్భుతంగా ఒడిసిపట్టుకుంటాడు. జయచిత్ర గారు చాలా అద్భుతమైన పాత్ర చేశారు. ఏదైనా విస్పోటనం జరిగినప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ‘భగవంత్ కేసరి’ కూడా అలాంటి ఒక విస్పోటనంతో పుట్టింది. (Balakrishna Speech)

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ నిర్మాతలు సాహు, హరీష్.. ఇంకా ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటీనటులు.. ఇలా అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయం సమిష్టి కృషి. ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం కోసం ‘దంచవేమేనత్త కూతురా’ పాటని చాలా గ్రాండ్‌గా తీశాం. ఇప్పుడా పాటని అభిమానులు, ప్రేక్షకులు కోరిక మేరకు యాడ్ చేస్తున్నాం. మరోసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమికి డబుల్ ధమాకా... అటు పండగ.. ఇటు ‘భగవంత్ కేసరి’ ఘన విజయం. భారతీయ చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాలు చాలా అరుదుగా వుంటాయి. వాటిలో ఒకటిగా ‘భగవంత్ కేసరి’ని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని చెప్పుకొచ్చారు. (Balayya about Bhagavanth Kesari)


ఇవి కూడా చదవండి:

============================

*Saripodhaa Sanivaaram: వాడ్ని ఎవరైనా ఆపాలని అనుకోగలరా? అనుకున్నా.. ఆపగలరా?

********************************************

*Game Changer: హమ్మయ్యా.. ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్

*******************************************

*Dussehra: ఉపాస‌న - రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూశారా?

************************************

Updated Date - 2023-10-24T14:46:45+05:30 IST